కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
2021, మే నెలలో ఈపీఎఫ్ఓలో 9.20 లక్షల చందాదారులు చేరారు: పేరోల్ డేటా
నాడు పోస్టు చేయడమైనది:
20 JUL 2021 5:19PM by PIB Hyderabad
2021, మే నెలలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ(ఈపీఎఫ్)లో సుమారు 9లక్షల 20వేల మంది నికర చందాదారులు చేరిన అంశాన్ని 2021, జూలై 20న ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ(ఈపీఎఫ్ఓ) ప్రచురించిన తాత్కాలిక పేరోల్ డేటా ముఖ్యాంశంగా పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్ సెకండ్ వేవ్ సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (ఈపీఎఫ్) సంచిత చందాదారులను చేర్చుకోగలిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలల్లో 20లక్షల 20వేల చందాదారులు ఈపీఎఫ్లో చేరారు.
కోవిడ్ 19 సంక్షోభం ఫస్ట్ వేవ్తో పోలిస్తే సెకండ్ వేవ్ప్రభావం అంత తీవ్రంగా లేదనే విషయాన్ని పేరోల్ డేటాలోని చేరికలు సూచిస్తున్నాయి. అన్క్లెయిమ్ల సమర్పణ, ఆటోక్లెయిమ్ సెటిల్మెంట్, ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల ఆన్లైన్ బదిలీ, మొబైల్ ఫోన్ద్వారా ఫిర్యాదుల పరిష్కార సేవలను మెరుగుపర్చడంతో సహా ఈపీఎఫ్ఓ తీసుకున్న వివిధ కీలక నిర్ణయాలతోపాటు ఏబీఆర్వై, పీఎంజీకేవై వంటి పథకాల రూపంలో భారత ప్రభుత్వం సకాలంలో అందించిన మద్దతు కూడా చందాదారుల సంఖ్య పెరగడానికి కారణం కావొచ్చు.
నెల వ్యవధిలో చేరిన మొత్తం 9 లక్షల 20వేల నికర చందాదారుల్లో 5లక్షల 73వేల మంది కొత్త ఉద్యోగులు మొదటిసారిగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్ పథకం పరిధిలోకి వచ్చారు. ఈ నెలలో సుమారు 3లక్షల 47వేల మంది నికర చందాదారులు ఈపీఎఫ్ఓ నుంచి నిష్క్రమించారు. కానీ.. ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్న సంస్థల్లోనే ఉద్యోగంలో చేరడం ద్వారా ఈపీఎఫ్ఓలో తిరిగి చేరారు. వారి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను పూర్తిగా ఉపసంహరించుకోకుండా నిధుల బదిలీ ద్వారా పథకం సభ్యత్వాన్ని నిలుపుకున్నారు.
పేరోల్ డేటా ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం.. వయసులవారీగా చూస్తే 22 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసువారు 2021, మే నెలలో సుమారు 2 లక్షల 39వేల మంది నికర చందాదారులు చేరారు. ఈ వయసు గ్రూపు వారే తాజాగా చేరినవారిలో అత్యధికంగా ఉన్నారు. వీరి తర్వాత 29 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగినవారు లక్షా 90వేల మంది ఉన్నారు. ఇక స్త్రీ, పురుషుల ప్రకారంగా చూస్తే.. నెల వ్యవధిలో చేరిన మొత్తం నికర చందాదారుల్లో మహిళ ఉద్యోగుల వాటా సుమారు 21.77శాతం.
మహారాష్ట్ర, హరియాణ, గుజరాత్, తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో నమోదైన సంస్థలు ఈ నెలలో సుమారు 5.45 లక్షల మంది (అన్ని వయసులవారు) సభ్యులను చేర్చుకోవడం ద్వారా ముందంజలో నిలిచాయి. ఇది మొత్తం నికర పేరోల్ చేరికలో 59.29 శాతం. దేశవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో చేరిన మొత్తం 20 లక్షల 20వేల మంది చందాదారుల్లో ఈ ఐదు రాష్ట్రాలకు చెందినవారు 11లక్షల 83వేల మంది నికర చందాదారులున్నారు.
పరిశ్రమల వారీగా పేరోల్ డేటా వివరాల్లోకెళ్తే.. మావన వనరుల సంస్థలు, ప్రైవేటు సెక్యూరిటీ ఏసెన్సీలు, చిన్న కాంట్రాక్టర్లు మొదలుగువారు కలిగిన అనుభవం కలిగిన ఉద్యోగుల్లో 46.77 శాతం మంది చందాదారులుగా ఉన్నారు. ఉద్యోగుల రికార్డులను నవీకరించడం నిరంతర ప్రక్రియ. కాబట్టి.. డేటా తయారుచేయడం నిరంతరంగా జరుగుతుంది. దీంతో ఈ పేరోల్ డేటా తాత్కాలికమైనదే. ప్రతినెలా అంతకు ముందున్న డేటా నవీకరించబడుతుంది. 2017, సెప్టెంబర్ నాటికి ఉన్న వివరాలతో.. 2018, మే నుంచి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ పేరోల్డేటాను విడుదల చేస్తోంది.
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్స్& మిస్సెలీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952 పరిధిలోకి వచ్చే దేశంలోని వ్యవస్థీకృత శ్రామికశక్తికి ప్రావిడెంట్, పెన్సన్, బీమా ఫండ్ల రూపంలో సామాజిక భద్రత ప్రయోజనాలను కల్పించడానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ కట్టుబడి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 1737454)
సందర్శకుల సూచీ సంఖ్య : : 178