ఆర్థిక మంత్రిత్వ శాఖ

2019-21 ఆర్థిక సంవత్సరాల్లో రూ.6.41 లక్షల కోట్లు విలువ చేసే 11.29 కోట్లకు పైగా రుణాలు దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ముద్రా యోజన (పిఎంఎంవై) కింద పంపిణీ


పిఎంఎంవై కింద 2015 ఏప్రిల్ నుంచి రూ. 15.97 లక్షల విలువైన 30 కోట్ల రుణాలు మంజూరు

Posted On: 20 JUL 2021 4:11PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి ముద్రా యోజన (పిఎంఎంవై) కింద సభ్య రుణ సంస్థల (ఎంఎల్‌ఐ) సమాచారం ప్రకారం 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా  6.41 లక్షల కోట్ల రూపాయలకు 11.29 కోట్ల రుణాలు పంపిణీ చేశారు. ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసాన్రావ్ కరాడ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

2015 ఏప్రిల్‌లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి పిఎంఎంవై కింద రూ .15.97 లక్షల కోట్ల విలువైన 30 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (పిఎంఎంవై) సంస్థాగత క్రెడిట్ కింద సూక్ష్మ / చిన్న వ్యాపార విభాగాలకు వ్యవస్థాపక కార్యకలాపాల కోసం సభ్య రుణ సంస్థలు (ఎంఎల్‌ఐ)  షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు (ఎస్‌సిబి), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్‌ఆర్‌బి), నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి), మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఎఫ్‌ఐ) రూ.10 లక్షల వరకు రుణాన్ని అందిస్తాయని మంత్రి పేర్కొన్నారు.

నిరుద్యోగం తగ్గించడంలో పథకం సహాయం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ (మోల్) సూచించినట్లుగా, పిఎంఎంవై కింద ఉపాధి కల్పనను అంచనా వేయడానికి జాతీయ స్థాయిలో నమూనా సర్వే నిర్వహించినట్లు మంత్రి పేర్కొన్నారు. సర్వే ఫలితాల ప్రకారం, సుమారు 3 సంవత్సరాల కాలంలో (అంటే 2015 నుండి 2018 వరకు) 1.12 కోట్ల నికర అదనపు ఉపాధిని ఉత్పత్తి చేయడానికి పిఎంఎంవై సహాయపడిందన్నారు. మొత్తం స్థాయిలో, ముద్ర లబ్ధిదారుల యాజమాన్యంలోని సంస్థల ద్వారా ఉత్పత్తి చేయబడిన అదనపు ఉపాధిలో శిశు కేటగిరీలో 66% వాటా ఉంది, తరువాత కిషోర్ (19%), తరుణ్ (15%) ఉన్నాయి.

పిఎంఎంవై కింద రుణాలు పొందిన నిరుద్యోగులకు సంబంధించిన డేటాను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక క్యాటగిరి నిర్వహించదు. ఈ కాలంలో అందించిన రుణాలు రాష్ట్రాల వారీగా వివరాలు క్రింద పట్టికలో పేర్కొనడం జరిగింది.  

 

ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఖాతాల సంఖ్య, పంపిణీ మొత్తం రాష్ట్రాల వారీగా డేటా (2019-20 ఆర్థిక సంవత్సరానికి మరియు 2020-21 ఆర్థిక సంవత్సరానికి)

నగదు రూ. కోట్లలో 

 

 

 

2019-20

 

2020-21

 

మొత్తం 

వరుస 

సంఖ్య 

రాష్ట్రం 

ఖాతాల సంఖ్య

పంపిణీ చేసిన నిధులు 

ఖాతాల సంఖ్య 

పంపిణీ చేసిన నిధులు 

ఖాతాల సంఖ్య

పంపిణీ చేసిన నిధులు 

1

అండమాన్ నికోబార్ దీవులు 

1733

73.12

5,468

119.32

7,201

192

2

ఆంధ్ర ప్రదేశ్ 

844501

10090.71

11,52,152

11,564.66

19,96,653

21,655

3

అరుణాచల్ ప్రదేశ్ 

23288

150.56

6,159

172.12

29,447

323

4

అస్సాం 

1668347

7571.6

11,89,829

7,399.66

28,58,176

14,971

5

బీహార్ 

6712494

26340.31

53,06,694

24,019.78

1,20,19,188

50,360

6

చండీగఢ్ 

24313

390.16

20,295

432.22

44,608

822

7

ఛత్తీస్గఢ్ 

1261018

6691.69

10,27,266

6,423.07

22,88,284

13,115

8

దాద్రా నాగర్ హవేలీ 

2899

42.78

3,787

51.09

6,686

94

9

దామన్ దయ్యు 

766

22.37

1,140

19.11

1,906

41

10

ఢిల్లీ 

568596

5069.32

3,30,497

4,003.83

8,99,093

9,073

11

గోవా 

39040

480.46

37,520

501.47

76,560

982

12

గుజరాత్ 

2096393

13529.73

14,30,956

11,313.24

35,27,349

24,843

13

హర్యానా 

1155917

7623.25

10,05,453

7,303.11

21,61,370

14,926

14

హిమాచల్ ప్రదేశ్ 

107865

2226.32

1,30,494

2,163.83

2,38,359

4,390

15

ఝార్ఖండ్ 

1720485

7767.09

16,68,281

8,177.78

33,88,766

15,945

16

కర్ణాటక 

5733127

29702.91

46,45,196

29,785.29

1,03,78,323

59,488

17

కేరళ 

2176889

12921.14

15,86,258

11,238.55

37,63,147

24,160

18

లక్షద్వీప్ 

796

6.15

1,799

22.94

2,595

29

19

మధ్యప్రదేశ్ 

3557948

18578.04

32,49,158

17,822.84

68,07,106

36,401

20

మహారాష్ట్ర 

4769888

27394.57

37,54,163

24,624.06

85,24,051

52,019

21

మణిపూర్ 

90175

393.43

69,906

406.68

1,60,081

800

22

మేఘాలయ 

44416

266.45

40,478

402.43

 

 
***
 

(Release ID: 1737386) Visitor Counter : 224


Read this release in: English , Urdu , Punjabi , Tamil