హోం మంత్రిత్వ శాఖ

కరోనా మహమ్మారి నివారణ

Posted On: 20 JUL 2021 3:06PM by PIB Hyderabad

ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోని విషయం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సాయాన్ని అందజేయడం ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య వ్యవస్థతో బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా కోవిడ్ 19 పరిస్థితుల్లో సవాలుగా మారిన ప్రజారోగ్య వ్యవస్థ నిర్వహణను కూడా మెరుగుపరుస్తుంది. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్ హెచ్ ఎమ్) కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థికసాయం అందిస్తుంది.

కోవిడ్ పరిస్థితుల నిర్వహణతోపాటు సాధారణ  ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ కింద 2019-20 ఆర్థిక సంవత్సరంలో.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.1113.21 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

 అంతేకాకుండా 2020 ఏప్రిల్ లో కేంద్ర ప్రభుత్వం ‘ఇండియా కోవిడ్ 19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపరేషన్‌నెస్ ప్యాకేజీ’కి ఆమోదం తెలిపింది. కోవిడ్ -19 వల్ల కలిగే ముప్పును నివారించడం, గుర్తించడం మరియు స్పందించడం కోసం ఈ ప్యాకేజీ కింద 15వేల కోట్ల రూపాయలు అందజేసింది. ఈ ప్యాకేజీ కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ 19 నిర్వహణ, నియంత్రణకు సహాయ పడడానికి రూ.8,257.88 కోట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించింది.

వీటికి అదనంగా.. 2021 జూలై నుంచి 2022 మార్చి కాలానికిగాను రూ.23,123 కోట్ల 'ఇండియా కోవిడ్ -19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ & హెల్త్ సిస్టమ్ ప్రిపరేషన్‌నెస్ ప్యాకేజీ: ఫేజ్ -2' ను కూడా ప్రభుత్వం  ఆమోదించింది. ఇందులో కేంద్ర వాటాగా రూ .15 వేల కోట్లు కాగా, రాష్ట్రాల వాటా రూ .8,123 కోట్లు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలతోసహా పట్టణాల్లోనూ ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచడానికి, మందులు, పరీక్షల వంటి వాటికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సహాయసహకారాలు అందిస్తుంది. పీడియాట్రిక్ కేర్ కేసులతోసహా కోవిడ్ 19 కేసుల నిర్వహణ, ఔషధాల కొరత సమస్యను నివారించడం, ఆస్పత్రుల నిర్వహణ వ్యవస్థను అమలు  చేయడం, జిల్లాల్లో టెలీ కన్సల్టేషన్ల సదుపాయాలను విస్తరించడం వంటి కార్యకలాపాల ద్వారా కోవిడ్ 19 నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సామర్థ్యాన్ని పెంచుతుంది.

కేంద్ర హోంశాఖ వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. 

***


(Release ID: 1737348)
Read this release in: English , Urdu , Marathi , Punjabi