ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆదాయపు పన్ను ఫామ్స్ 15CA / 15CB ఎలక్ట్రానిక్ ఫైలింగ్ కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) మరిన్ని సడలింపులిచ్చింది.

Posted On: 20 JUL 2021 4:40PM by PIB Hyderabad

ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం.. ఫారం 15CA / 15CBని ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించాల్సిన అవసరముంది. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు ఫామ్ 15CAతోపాటు 15CBలో వర్తించేవారు చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికెట్ ను ఏదైనా విదేశీ చెల్లింపుల కోసం అధీకృత డీలర్‌కు కాపీని సమర్పించే ముందు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు.,

www.incometax.gov.in పోర్టల్‌లో ఆదాయపు పన్ను ఫారమ్‌లు 15CA / 15CB ఎలక్ట్రానిక్ ఫైలింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ పన్ను చెల్లింపుదారులు పేర్కొన్న దృష్ట్యా.. 2021 జూలై 15 వరకు 15CA / 15CB ఫారమ్‌లను మాన్యువల్ ఫార్మాట్‌లో అధీకృత డీలర్లకు సమర్పించవచ్చని ఇంతకు ముందే నిర్ణయించిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు..  తాజాగా ఆ తేదీని 2021 ఆగస్టు 15 వరకు పొడిగించాలని నిర్ణయించారు.  పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఆ ఫారాలను మాన్యువల్ ఫార్మాట్‌లో 2021, ఆగస్టు 15 వరకు అధీకృత డీలర్లకు సమర్పించవచ్చు. అథీకృత  డీలర్లు ఆగస్టు 15 వ తేదీ వరకు మాన్యువల్ పద్ధతిలో సమర్పించిన ఫారాలను విదేశీ చెల్లింపుల ప్రయోజనం అంగీకరించాలని సూచించారు. కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ లో ఈ ఫామ్స్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ తర్వాత అప్ లోడ్ చేసే వెసులుబాటు కల్పిస్తారు. 

 

***

 



(Release ID: 1737342) Visitor Counter : 184