ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పని చేస్తున్న 22 'మెగా ఫుడ్ పార్కు'ల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పన దేశంలో ఇప్పటివరకు 38 మెగా ఫుడ్ పార్కులకు ఆమోదం

Posted On: 20 JUL 2021 3:44PM by PIB Hyderabad

'మెగా ఫుడ్ పార్కు' పథకం మార్గదర్శకాల ప్రకారం, ఒక్కో మెగా ఫుడ్ పార్కు పూర్తి స్థాయిలో పనిచేస్తే, దాదాపు 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. వ్యాపార ప్రణాళికను బట్టి ప్రాజెక్టు గణాంకాలు మారవచ్చు. మెగా ఫుడ్ పార్కు పథకం కింద, దేశంలో 38 మెగా ఫుడ్ పార్కులకు మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తెలింపింది. మరో 3 మెగా ఫుడ్ పార్కులకు సూత్రప్రాయ అనుమతినిచ్చింది. పని చేస్తున్న 22 మెగా ఫుడ్ పార్కుల ద్వారా 6,66,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించింది.

    ఆహార శుద్ధి రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించడానికి మెగా ఫుడ్ పార్కు పథకాన్ని (ఎంఎఫ్‌పీఎస్) కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం కింద దేశంలో మెగా ఫుడ్ పార్కులను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను 'ఆసక్తి వ్యక్తీకరణ' ద్వారా ఆహ్వానిస్తారు. ఈ పథకం ఒక రాష్ట్రం లేదా ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు.  హరియాణాలోని సోనిపట్, రోహ్‌తక్ జిల్లాల్లో 2 మెగా ఫుడ్ పార్కులకు మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు (హెచ్‌ఎస్‌ఐఐడీసీ, హాఫెడ్) ఈ పార్కులను నిర్వహిస్తున్నాయి. హర్యానాలోని భివాని-మహేంద్రఘర్‌-చార్కిదాద్రి జిల్లాల్లో మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు మంత్రిత్వ శాఖ వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదు.

    కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ లోక్‌సభకు సమర్పించారు.
 

*****



(Release ID: 1737339) Visitor Counter : 120


Read this release in: English , Urdu , Punjabi , Tamil