ఆయుష్
ఆయుర్వేద ఉత్పత్తులకు డబ్ల్యూహెచ్‌వో-జీఎంపీ/సీవోపీపీ ధృవీకరణ
Posted On:
20 JUL 2021 3:59PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్‌లోని 'ది ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఐఎంపీసీఎల్) (కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ) 18 ఆయుర్వేద ఉత్పత్తులకు డబ్ల్యూహెచ్‌వో-జీఎంపీ/సీవోపీపీ ధృవీకరణ కోసం దరఖాస్తు చేసింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థ పని చేస్తుంది. ఈ దరఖాస్తును డ్రగ్ కంట్రోలర్ జనరల్ (ఇండియా) కార్యాలయం పరిశీలించింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో), ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ అధికారులు ఐఎంపీసీఎల్ ప్లాంటులో ఈ ఏడాది మార్చిలో సంయుక్త పరిశీలన నిర్వహించారు. ఉమ్మడి తనిఖీ బృందం పరిశీలనలో వెల్లడైన విషయాలను ముందస్తు సమ్మతి కోసం ఐఎంపీసీఎల్‌కు కూడా తెలియజేశారు. సంబంధిత నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించి, డ్రగ్ కంట్రోలర్ జనరల్ (ఇండియా) డబ్ల్యూహెచ్‌వో-జీఎంపీ/సీవోపీపీ ధృవీకరణను జారీ చేస్తుంది.
ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీ మహేందర్ భాయ్ ముంజపర ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.
*****
(Release ID: 1737336)
Visitor Counter : 220