పర్యటక మంత్రిత్వ శాఖ

దేశీయంగా ప‌ర్యాట‌క రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మార్కెట్ డ‌వ‌ల‌ప్‌మెంట్ అసిస్టెన్స్ (ఎండిఎ) మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప‌ర్యాట‌క మంత్రిత్వ‌శాఖ ఇటీవ‌ల సవ‌రించింది: కేంద్ర మంత్రి శ్రీ జి.కిష‌న్ రెడ్డి

Posted On: 19 JUL 2021 4:50PM by PIB Hyderabad

దేశ‌వ్యాప్తంగాప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత ప్రోత్స‌హించేదుకు ల‌క్షిత కార్య‌క్ర‌మాల‌రూప‌క‌ల్ప‌న‌కు ప్ర‌ణాళిక రూపాందిస్తున్న‌ది. దేశీయంగా ప‌ర్యాట‌క రంగాన్ని ప్రోత్స‌హించేందుకు ఈ మంత్రిత్వ‌శాఖ కింది కార్య‌క‌లాపాలు, చొర‌వ‌ను చేప‌ట్టింది.

1) దేఖో అప్నా దేశ్ వెబినార్లు
2) ఏక్‌భార‌త్ ,శ్రేష్ఠ్‌భార‌త్ :  రోడ్ షోలు, ఫామ్ ట్రిప్‌లు, బి2బి స‌మావేశాలు, క్విజ్ కార్య‌క్ర‌మాలు, వివిధ రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల మ‌ధ్య ఏక్‌భారత్ శ్రేష్ఠ్ భార‌త్‌ను ప్రోత్స‌హించేందుకు వెబినార్ల నిర్వ‌హ‌ణ‌
3) కీల‌క న‌గ‌రాలు, సాంస్కృతిక ప్రాంతాల‌కు సంబంధించి (ఢిల్లీ, చెన్నై,కోల్క‌తా, ముంబాయి, బెంగ‌ళూరు, ఉడిపి, ఔరంగాబాద్‌, ప్రఖ్యాత ప‌ర్యాట‌క‌కేంద్రాల)  లాక్‌డౌన్ స‌మ‌యంలో ఏరియ‌ల్ ఫొటోగ్ర‌ఫి
4) ప‌ర్యాట‌క‌రంగాన్నితిరిగి ప్రారంభించేందుకు ఈప‌రిశ్రమ‌కు చెందిన స్టేక్ హొల్డ‌ర్ల‌తో క్ర‌మంత‌ప్ప‌కుండా సమావేశాల నిర్వ‌హ‌ణ‌.
5. ప‌ర్యాట‌కుల‌కు స‌దుపాయాల క‌ల్పించ‌డం, వారిభ‌ద్ర‌త‌,ర‌క్ష‌ణ‌కు సంబంధించిన ప్రొటోకాల్స్‌పాటించ‌డం,సేవ‌ల‌కు సంబంధించిన ప్ర‌మాణాలు పాటించ‌డం.
6.వెబినార్లు, సామాజిక మాధ్య‌మాలు,ఇత‌ర డిజిట‌ల్ వేదిక‌ల ద్వారా దేశీయ ప‌ర్యాట‌క రంగ ప్ర‌చార కార్య‌క్ర‌మం.
7. దేఖో అప్నా దేశ్ ప్ర‌చారం దేశీయ ప‌ర్యాట‌క రంగ ప్రోత్సాహానికి ప్ర‌ధానంగా ఉ ప‌యోగ‌ప‌డ‌నుంది. దీని ద్వారా దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల దృష్టిలో కోవిడ్ అనంత‌ర ప‌రిస్థితుల‌లో ప‌ర్య‌ట‌న‌కు భార‌త్ అత్యంత సుర‌క్షిత‌మైన గ‌మ్య‌స్థౄనం అన్న విశ్వాసాన్ని దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల‌లో క‌ల్పించ‌డం.

దేశీయ ప‌ర్యాట‌క‌రంగాన్ని ప్రోత్స‌హించేందుకు 2020 న‌వంబ‌ర్‌లో ప‌ర్యాట‌క మంత్రిత్వ‌శాఖ‌ మార్కెట్ డ‌వ‌ల‌ప్‌మెంట్ అసిస్టెన్స్ (ఎండిఎ) మార్గ‌ద‌ర్శ‌కాల‌ను స‌వ‌రించింది. ఈ ప‌థ‌కం ప‌రిధి, విస్తృతిని పెంచేందుకు దీనిని స‌వ‌రించారు. ఈ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం, స్టేక్‌హోల్డ‌ర్ల‌కు దేశీయ ప‌ర్యాట‌క రంగ ప్రోత్సాహ‌కానికి ఆర్థిక మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్నారు అద‌న‌పు ప్రోత్సాహ‌క‌కార్య‌క‌లాపాలు ఇందులో చేర్చారు. ఆన్‌లైన్ ప్ర‌మోష‌న్లు, అనుమ‌తించ‌ద‌గిన ఆర్థిక స‌హాయాన్ని పెంచారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప‌ర్యాట‌క విభాగాలు ఈప‌థ‌కం కింద ఆర్ధిక స‌హాయాన్ని పొందేందుకు అర్హ‌త క‌లిగి ఉంటాయి.

 కేంద్ర ఆర్థిక మంత్రిత్వ‌శాఖ ఇటీవ‌ల దేశంలోని 11,000కు పైగా రిజిస్ట‌ర్డ్ టూరిస్ట్ గైడ్‌, డ్రావెల్‌, ప‌ర్యాట‌క రంగ‌స్టేక్ హోల్డ‌ర్ల‌కు కొత్త రుణ గ్యారంటీ ప‌థ‌కాన్ని ప్రక‌టించింది. దీనివ‌ల్ల వారు కోవిడ్ -19 ప్ర‌భావం వ‌ల్ల ఎదురైన ఇబ్బందుల‌ను తొల‌గించుకుని తిరిగి త‌మ వ్యాపారాల‌ను ప్రారంభించుకోవడానికి వీలుక‌లుగుతుంది. కింది ప‌రిమితుల‌ను అనుస‌రించి నూరుశాతం గ్యారంటీని అందించ‌డం జ‌రుగుతుంది.

* టిటిఎస్ (ప్ర‌తి ఏజెన్సీకి) 10 ల‌క్ష‌ల వ‌ర‌కు
*ప్రాంతీయ‌,రాష్ట్ర‌స్థాయి టూరిస్టు గైడ్‌ల‌కు  రూ 1,00,000

ఈ స‌మాచారాన్ని కేంద్ర ప‌ర్యాట‌క‌ శాఖ మంత్రి జి.కిష‌న్ రెడ్డి ఈరోజు లోక్‌స‌భ‌లో ఒక లిఖిత‌పూర్వ‌క ప్ర‌శ్న‌కు స‌మాధానంగా తెలిపారు.

***



(Release ID: 1737077) Visitor Counter : 158


Read this release in: English , Urdu , Punjabi , Tamil