సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
సిజిఎస్ కింద ఎంఎస్ఎంఇ పరిశ్రమలకు రుణాలు
Posted On:
19 JUL 2021 4:29PM by PIB Hyderabad
వాణిజ్య కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న ఉత్పత్తి లేదా సేవలు అందించే నూతన, ఇప్పటికే ఉనికిలో ఉన్న సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (సిజిటిఎంఎస్ ఇ) అమలు చేస్తున్న పరపతి గ్యారంటీ పథకం (సిజిఎస్) పరిధిలోకి రావడానికి అర్హులు. యోగ్యమైన ప్రతిపాదనలను తిరస్కరించడం జరుగదు. సిజిటిఎంఎస్ఇ 30 జూన్ 2021వరకూ రూ.2,72,007 కోట్ల మేరకు 53,86,739 గ్యారంటీలను ఆమోదించింది. ఆర్థిక సంవత్సరం 2021-22 తొలి త్రైమాసికంలో బ్యాంకులకు, ఎన్‌బిఎఫ్‌సిలకు గ్యారంటీ ఆమోదాలు రూ, 6,693 కోట్లు, రూ.6,603 కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్టు సిజిటిఎంఎస్ఇ నివేదించింది. ఇది ఆర్థిక సంవత్సరం 2020-2021 తొలి త్రైమాసికంలో ఈ మొత్తం రూ. 6,041 కోట్లు, రూ. 2,934 కోట్లగా ఉంది.
ఆర్థిక సంవత్సరం 2020-2021లో సిజిటిఎంఎస్ఇ తెలంగాణా రాష్ట్రం నుంచి వచ్చిన రూ. 1,408 కోట్ల మొత్తాన్ని కేటాయిస్తూ 22,021 గారంటీ దరఖాస్తులను ఆమోదించింది.
భారత ప్రభుత్వం ఎంఎస్ ఎంఇ రంగం సహా భారతీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేందుకు పరిహార ప్యాకేజీని ప్రకటించింది. ఈ సూక్ష్మ ఆర్థిక సంస్థలు (మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్) ద్వారా దాదాపు 25 లక్షల మంది చిన్న స్థాయి లబ్ధిదారులకు రుణాలను అందించేందుకు కోవిడ్ కారణంగా ప్రభావితమైన రంగాలకు రూ.1.1 లక్షల కోట్లు, అదనంగా అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకం, రుణ హామీ పథకం కింద రూ. 1.5 లక్షల కోట్లను అందించడం ఈ ప్యాకేజీ లక్ష్యం.
ఈ సమాచారాన్ని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వాణిజ్యసంస్థల మంత్రి నారాయణ్ రాణె సోమవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ద్వారా వెల్లడించారు.
(Release ID: 1736979)
Visitor Counter : 211