రక్షణ మంత్రిత్వ శాఖ
ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చందీనగర్లోని గరుడ రెజిమెంటెల్ ట్రైనింగ్ సెంటర్ లో మెరూన్ బెరెట్ ఉత్సవ కవాతు
प्रविष्टि तिथि:
17 JUL 2021 4:38PM by PIB Hyderabad
69వ వైమానిక దళ ప్రత్యేక దళాల ఆపరేటివ్ ల (గరుడ) శిక్షణను విజయవంతంగా పూర్తి అయినందున కనులవిందైన మెరూన్ బెరెట్ సెర్మోనియల్ పరేడ్ (ఎంబిసిపి)ని 17 జులై 2021న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చందీనగర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిర్ కమడోర్ కె. ఖజూరియా విఎస్ఎం, ఎయిర్ కమడోర్ ఆపరేషన్స్ (అఫెన్సివ్) పాసింగ్ ఔట్ పరేడ్‌ను సమీక్షించారు. ప్రతిభావంతులైన ట్రైనీలకు ట్రోఫీలను ప్రదానం చేసిన ముఖ్య అతిధి విజయవంతమైన గరుడ ట్రైనీలకు మెరూన్ బెరెట్, గరుడ్ ప్రొఫెషియన్సీ బాడ్జ్, స్పెషల్ ఫోర్సెస్ టాబ్స్ ను అందచేశారు. ఎల్ఎసి అఖోకా మువివాహ్ కు ఉత్తమ ఆల్‌రౌండర్ ట్రోఫీని అందచేశారు. యువ గరుడ కమెండోలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ట్రైనీలు వృత్తి పరంగా ఉత్తమ స్థాయిలో పని చేయాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. కష్టపడి పని చేసిన శిక్షణ సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ, పతాకం ఉన్నతంగా ఎగురుతూ ఉండాలని ఉద్బోధించారు.
పరేడ్ సందర్భంగా, గరుడ కంబాట్ ఫైరింగ్, హోస్టేజ్ రెస్క్యూ ఫైరింగ్ డ్రిల్, అసాల్ట్ ఎక్స్‌ప్లోజివ్స్, అబ్స్టెకిల్ క్రాసింగ్ డ్రిల్, వాల్ క్లైంబింగ్ / స్లిదరింగ్/ రాపెలింగ్ స్కిల్స్ & మిలటరీ మార్షల్ ఆర్ట్స్ వంటి వివిధ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు డెమాన్‌స్ట్రేషన్లను నిర్వహించారు.
మెరూన్ బెరెట్ సెర్మోనియల్ పరేడ్ అన్నది గరుడ సాధించిన విజయానికి గర్వపడే క్షణం, ఇది వారి శిక్షణ పూర్తి అయ్యి వారు యువ ప్రత్యేక దళా ఆపరేటర్లుగా పరివర్తన చెందారని సూచించే సమయం.
***
(रिलीज़ आईडी: 1736525)
आगंतुक पटल : 256