ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) రౌండ్ టేబుల్ సమావేశంలో ‘యు.ఎస్. పెట్టుబడికి గ్లోబల్ గమ్యస్థానంగా భారతదేశం సుస్థిర మరియు సమగ్ర వృద్ధిని పెంచడం’ అనే ఆంశంపై ప్రసంగించారు.

Posted On: 16 JUL 2021 9:58PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా  యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) నిర్వహించిన రౌండ్‌ టేబుల్ సమావేశంలో ‘యు.ఎస్. పెట్టుబడికి గ్లోబల్ గమ్యస్థానంగా భారతదేశం సుస్థిర మరియు సమగ్ర వృద్ధిని పెంచడం’ అనే ఆంశంపై ప్రసంగించారు. ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జనరల్ ఎలక్ట్రిక్, బాక్స్టర్ హెల్త్‌కేర్ యుఎస్‌ఎ, బ్రాంబుల్స్, మార్ష్ & మెక్లెనన్ కంపెనీలు, పెప్సికో వంటి ప్రముఖ విదేశీ పెట్టుబడిదారులు పాల్గొన్నారు.

రౌండ్ టేబుల్ సమావేశంలో పెట్టుబడిదారులకు ఆర్థిక మంత్రి మరియు భారత ప్రభుత్వ ఇతర ఉన్నతాధికారులతో పరస్పరం చర్చించుకునే అవకాశాన్ని కల్పించింది. లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్సూరెన్స్, డిఫెన్స్, సెక్యూరిటీ, మాన్యుఫ్యాక్చరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, పవర్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్‌ అండ్ హాస్పిటాలిటీ, డిజిటల్ ఎకానమీ వంటివి చర్చా రంగాలలో ఉన్నాయి.

శ్రీమతి నిర్మలా సీతారామన్‌  రెండో వేవ్‌లో భారతదేశానికి వనరులను సమీకరించడానికి గ్లోబల్ టాస్క్‌ఫోర్స్‌ను రూపొందించడానికి టాప్ -40 అమెరికన్ కంపెనీల సిఇఓలు చేసిన కృషిని వివరించారు. భారతదేశం మరియు యు.ఎస్‌లు  ఇరువైపుల వాణిజ్యంలో 500 బిలియన్ డాలర్లను సాధించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించాయని ఆమె పేర్కొన్నారు.

ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల గురించి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. ఇది పెట్టుబడిదారుల ప్రాథమిక అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది. భారతదేశం యొక్క స్థిరమైన మరియు నిరంతర విస్తృత సంస్కరణల గురించి ఆమె పెట్టుబడిదారులకు వివరించారు. ఇవి దేశాన్ని విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా చేస్తాయని అలాగే ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా భారతదేశం ఎదుగుతుంది.గిఫ్ట్‌ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్‌ఎస్‌సి) కు సంబంధించిన ఈ సంవత్సరం బడ్జెట్ చొరవ గురించి ఆమె ప్రస్తావించారు. ఇక్కడ భారత ఆర్థిక వ్యవస్థకు మరియు మొత్తం ప్రాంతానికి సేవ చేయడానికి ఆవిష్కరణ మరియు ఆర్థిక కార్యకలాపాల కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని తెలిపారు.


పెట్టుబడిదారులకు వివరించిన విస్తృత సందేశాలు:

 

  • కొవిడ్ సమయంలో బలమైన, క్రమబద్దమైన సంస్కరణలతో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయడం వల్ల కొవిడ్ వ్యాప్తి  గణనీయంగా తగ్గుతుంది.
  • ఇటీవలి నెలల్లో స్థూల-ఆర్థిక స్థిరత్వం మరియు ఆర్థిక పునరుద్ధరణలో స్థితిస్థాపకత.
  • పెట్టుబడులకు గమ్యస్థానంగా భారతదేశం యొక్క బలాలు / ప్రయోజనాలు
  • భారతదేశాన్ని ‘ఆత్మ నిర్భర్’ గా తీర్చిదిద్దే ప్రణాళిక
  • మౌలిక సదుపాయాల దిశగా తీసుకున్న చర్యలు ఆర్థిక వృద్ధికి దారితీశాయి
  • పెట్టుబడిదారులకు బహుళ రంగ అవకాశాలను సృష్టించడం.
  • గత 6 సంవత్సరాలలో సంస్కరణల అమలు వైపు దేశానికి బలమైన ట్రాక్ రికార్డ్



ముగింపు సందేశంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ స్వయం ప్రతిపత్తి గల ఆధునిక భారతదేశాన్ని నిర్మించడానికి చేపట్టిన కార్యక్రమాల గురించి మాట్లాడారు. అమెరికా పెట్టుబడిదారులతో దీర్ఘకాలిక సంబంధానికి దేశం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఆమె దీని గురించి మాట్లాడుతూ:

  • భారతదేశ పెట్టుబడిదారుల స్నేహపూర్వక గమ్యస్థానంగా మార్చే స్థిరమైన మరియు నిరంతర ఉత్పాదక సంస్కరణలు
  • శక్తివంతమైన మరియు పల్సేటింగ్ ఆర్థిక మార్కెట్లు
  • మౌలిక సదుపాయాల రంగంలో అపారమైన పెట్టుబడులు జరుగుతున్నాయి
  • కోవిడ్ మరియు దాని పర్యవసానాలు భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిస్థాపకతను ప్రదర్శించాయి
  • ఇన్నోవేషన్ మరియు ఆర్ అండ్ డి యొక్క అద్భుతమైన సామర్థ్యం



ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్ పాలసీ మరియు పన్నుల రంగాలలో భారతదేశం యొక్క పురోగతిని వివరించారు. రాష్ట్రాల్లోను, రాష్ట్రాల మధ్య వేగంగా మరియు అవాంతరాలు లేని వస్తువుల కదలికను ప్రోత్సహించే ఈ-వే బిల్లు వ్యవస్థపై ఆయన ఉద్ఘాటించారు. పెట్టుబడి మరియు పన్ను అంచనా సమస్యలను పరిష్కరించడం, ఆస్తి మోనటైజేషన్ మరియు చాలా రంగాల ప్రైవేటీకరణ వైపు దృష్టి సారించే ఈ సంవత్సరం ప్రతిస్పందించే మరియు బాధ్యతాయుతమైన బడ్జెట్ గురించి ఆయన మాట్లాడారు.

యుఎస్ఐబిసి గురించి

పెట్టుబడులను పెంచడానికి భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రైవేట్ రంగాలను ప్రకాశవంతం చేయడానికి మరియు ప్రోత్సహించడానికి 1975 లో యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఒక వ్యాపార న్యాయవాద సంస్థగా ఏర్పడింది. యునైటెడ్ స్టేట్స్ మరియు భారతదేశం మధ్య వ్యాపారాన్ని సులభతరం చేయడానికి, మరింత సమర్థవంతంగా కౌన్సిల్ సహాయపడుతుంది. ఇది ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలను కలుపుతుంది. స్థానిక మరియు ప్రపంచ వ్యాపార సవాళ్లకు స్థిరమైన పరిష్కారాలను చూపుతుంది.

 

 

****


(Release ID: 1736390) Visitor Counter : 222