భారత ఎన్నికల సంఘం
పశ్చిమ బంగాల్ నుంచి రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక
Posted On:
16 JUL 2021 12:28PM by PIB Hyderabad
ఈ క్రింది వివరాల ప్రకారం, రాజ్యసభలో పశ్చిమ బంగాల్ నుంచి ఒక స్థానం ఖాళీ అయింది:-
రాష్ట్రం
|
సభ్యుడి పేరు
|
కారణం
|
ఖాళీ అయిన తేదీ
|
పదవీకాలం గడువు
|
పశ్చిమ బంగాల్
|
శ్రీ దినేష్ త్రివేది
|
రాజీనామా
|
12.02.2021
|
02.04.2026
|
క్ర.సం.
|
కార్యక్రమం
|
తేదీ
|
|
నోటిఫికేషన్ ప్రకటన
|
22 జులై, 2021 (గురువారం)
|
|
నామినేషన్ల గడువు తేదీ
|
29 జులై, 2021 ( గురువారం )
|
|
నామినేషన్ల పరిశీలన
|
30 జులై, 2021 (శుక్రవారం)
|
|
నామినేషన్ ఉపసంహరణకు గడువు
|
02 ఆగస్టు, 2021 (సోమవారం)
|
|
ఉప ఎన్నిక తేదీ
|
09 ఆగస్టు, 2021 (సోమవారం)
|
|
పోలింగ్ సమయం
|
ఉదయం 09:00 - సాయంత్రం 04:00
|
|
ఓట్ల లెక్కింపు
|
09 ఆగస్టు, 2021 (సోమవారం) సాయంత్రం 05:00కు.
|
2. పశ్చిమ బంగాల్ నుంచి రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఈ కింది షెడ్యూల్ ప్రకారం ఉప ఎన్నిక నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది:-
3. మొత్తం ఉప ఎన్నిక ప్రక్రియ కోసం అందరూ అనుసరించాల్సిన విస్తృత మార్గదర్శకాలు:-
I. ఉప ఎన్నికకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి
II. ఉప ఎన్నిక కోసం ఉపయోగించే గది లేదా ప్రాంగణ ప్రవేశం వద్ద:
(ఎ) ప్రతి ఒక్కరికి థర్మల్ స్కానింగ్ నిర్వహిస్తారు
(బి) అన్ని ప్రదేశాల్లో శానిటైజర్ అందుబాటులో ఉంచుతారు
III. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విధించిన కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం సామాజిక దూరం పాటించాలి.
4. ఉప ఎన్నిక నిర్వహణ ఏర్పాట్లలో కొవిడ్ నియంత్రణ చర్యలు, నిబంధనలు పాటించేలా చూసేందుకు రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్నికల సంఘం ఆదేశించింది.
****
(Release ID: 1736144)