ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 టీకాల తాజా సమాచారం


రాష్ట్రాలకు 41.10 కోట్లకు పైగా టీకాడోసుల అందజేత
ఇంకా రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద 2.51కోట్ల డోసులు

Posted On: 16 JUL 2021 10:36AM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయటంతో బాటు విస్తరించింది. జూన్ 21న సార్వత్రిక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరిన్ని టీకా డోసులు అందుబాటులో ఉంచటం ద్వారా టీకాలివ్వటాన్ని బాగా పెంచింది. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరింత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించేలా టీకా డోసుల అందుబాటుపై ముందస్తు సమాచారం ఇస్తోంది. ఆ విధంగా సరఫరా వ్యవస్థను క్రమబద్ధం చేసింది

దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అండగా నిలబడి టీకా మందును ఉచితంగా అందిస్తోంది. సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్త దశలో భాగంగా కేంద్రం దేశంలోని టీక మందు తయారీ సంస్థలు తయారుచేసే టీకా డోసులలో 75% మేరకు ఉచితంగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందిస్తోంది. 

 

టీకా డోసులు

 

(2021 జులై 16 నాటికి)

 

సరఫరా చేసినవి

 

41,10,38,530

 

 

దారిలో/పంపిణీలో  ఉన్నవి

 

52,90,640

 

వాడినవి

 

38,58,75,958

 

అందుబాటులో ఉన్న నిల్వ 

 

2,51,62,572

 

ఇప్పటిదాకా 41.10 కోట్లకు పైగా  (41,10,38,530) టీకా డోసులు రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చింది. మరో 52,90,640 డోసులు పంపిణీ సిద్ధమయాయి. ఈ ఉదయం 8 గంటలకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకు వృధాతో సహా వాడినది 38,58,75,958 డోసులు. 2.51 కోట్లకు పైగా (2,51,62,572) డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర ఇంకా ఉన్నాయి. 

 

 

****


(Release ID: 1736143) Visitor Counter : 187