రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ లో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకున్న ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్
Posted On:
15 JUL 2021 4:31PM by PIB Hyderabad
నోయిడాలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ లో నైపుణ్య అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంతో ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్ పనిచేస్తోంది.
వర్చువల్ విధానంలో జరిగిన సంతకాల కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ,కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ వి.కె. సింగ్,డిజి (రోడ్ డెవలప్‌మెంట్) సంయుక్త కార్యదర్శి శ్రీఐ.కే. పాండే,ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్ డైరెక్టర్ శ్రీ సుమన్ ప్రసాద్ సింగ్, న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఇయన్ జాకబ్స్, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గడ్కరీ మాట్లాడుతూ దేశంలో రహదారి భద్రతా పరిస్థితులను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని అన్నారు.
ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్ లో సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ నైపుణ్య కేంద్రాన్ని నెలకొల్పడానికి అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించడం, సాంకేతిక బదిలీ మరియు కేంద్ర ఏర్పాటుకు ఈ ఒప్పందం సహకరిస్తుంది. స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ మరియు మోడలింగ్‌పై న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం ఒక కోర్సును కూడా అందిస్తుంది.
ఈ కింది అంశాలపై దృష్టి సారించి సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ పనిచేస్తోంది.
1.దేశంలో అన్ని జాతీయ రహదారుల వ్యవస్థకు దేశ అవసరాలకు అనుగుణంగా సూక్ష్మ ప్రణాళిక, సాఫ్ట్‌వేర్ కు న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం రూపకల్పన చేస్తుంది
2. భారత దేశ పట్టణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ కు రూపకల్పన చేసి దీనికి సంబంధించిన అధ్యయనాలను న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం చేపడుతుంది.
3. స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ మరియు మోడలింగ్‌పై న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం ఒక సర్టిఫికేషన్ కోర్స్ ను అందిస్తుంది. దీనిలో భారతదేశంలో మూడు, ఆస్ట్రేలియాలో మూడు వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు. అయిదు రోజులపాటు సాగే ఈ వర్క్‌షాప్‌లో 40 మంది పాల్గొనడానికి వీలు కల్పిస్తారు.
రవాణా రంగంలో భారతదేశం, ఆస్ట్రేలియా దేశాలలో అంకుర సంస్థల ఏర్పాటును ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుంది. ఆధునిక రవాణా రంగంలో పరిశోధన అధివృద్ధితో పాటు వినూత్న ఆవిష్కరణలకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.
***
(Release ID: 1736025)
Visitor Counter : 150