పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

ప్రజాభిప్రాయ సేకరణకు డ్రోన్ల నిబంధనలు, 2021 ముసాయిదాను విడుదల చేసిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

Posted On: 15 JUL 2021 11:27AM by PIB Hyderabad

ప్రజాభిప్రాయ సేకరణకు నూతనంగా రూపొందించిన డ్రోన్ల నిబంధనల 2021 ముసాయిదాను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నమ్మకంస్వీయ నియంత్రణ,కొంతమేరకు మాత్రమే పర్యవేక్షణ ఉండే విధంగా వీటిని రూపొందించారు. యూఏఎస్ నిబంధనలు ( 2021 మార్చి 12న విడుదల అయినవి) స్థానంలో నూతన డ్రోన్ల నిబంధనలు 2021 అమలులోకి వస్తాయి. వీటిపై 2021 ఆగస్ట్ అయిదవ తేదీ వరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తారు. 

డ్రోన్ నిబంధనలు 2021 రూపొందించడానికి పరిగణనలోకి తీసుకున్న ముఖ్య అంశాలు :

1. అనుమతుల రద్దు: ప్రత్యేకమైన ప్రామాణీకరణ సంఖ్యప్రత్యేకమైన ప్రోటోటైప్ గుర్తింపు సంఖ్యధృవీకరణ పత్రంనిర్వహణ ధృవీకరణ పత్రందిగుమతి క్లియరెన్స్ఇప్పటికే ఉన్న డ్రోన్‌ల అంగీకారంఆపరేటర్ అనుమతిఆర్ అండ్ డి సంస్థ నుంచి అనుమతి , విద్యార్థి రిమోట్ పైలెట్ లైసెన్స్రిమోట్ పైలట్ బోధకుని నుంచి డ్రోన్ పోర్ట్ ఆథరైజేషన్ మొదలైనవి   

2. పత్రాల సంఖ్య 25 నుంచి ఆరుకి తగ్గింపు 

3. తక్కువ స్థాయికి ఫీజుల తగ్గింపు.డ్రోన్ పరిమాణం తో సంబంధం ఉండదు .

4.  ‘అనుమతి లేదు - టేకాఫ్ లేదు’ (ఎన్‌పిఎన్‌టి)రియల్ టైమ్ ట్రాకింగ్ బెకన్జియో-ఫెన్సింగ్ వంటి భద్రతా అంశాలను తరువాత ఖరారు చేయడం జరుగుతుంది. వీటిని అమలులోకి తేవడానికి ఆరు నెలల గడువు లభిస్తుంది. 

5.  వ్యాపార-స్నేహపూర్వకంగా వుండే విధంగా ఆన్  లైన్ వ్యవస్థగా ఏక గవాక్షంగా డిజిటల్ స్కై ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయబడుతుంది.

 6. డిజిటల్ స్కై ప్లాట్‌ఫామ్‌లో కనీస వ్యక్తిగత కార్యకలాపాలు ఉంటాయి.  అనుమతులలో ఎక్కువ భాగం  స్వీయ-ఉత్పత్తి చేయబడతాయి.

7. డిజిటల్ స్కై ప్లాట్‌ఫామ్‌లో గ్రీన్ ఎల్లో మరియు రెడ్జో న్లతో ఇంటరాక్టివ్ గగనతల మ్యాప్ ప్రదర్శించబడుతుంది.

8.  విమానాశ్రయ చుట్టుకొలతలో ఎల్లో జోన్ 45 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్లకు కుదించబడుతుంది. 

9. గ్రీన్ జోన్లలో 400 అడుగులు, విమానాశ్రయం నుంచి ఎనిమిది నుంచి 12 కిలోమీటర్ల దూరం వరకు ఫ్లైట్ పర్మిషన్ అవసరం ఉండదు. 

10. చిన్న డ్రోనులు  (వాణిజ్యేతర ఉపయోగం కోసం)నానో డ్రోనులు మరియు ఆర్ అండ్ డి సంస్థలకు పైలట్ లైసెన్స్ అవసరం ఉండదు.

11. భారతదేశంలో నమోదు చేసుకున్న విదేశీ యాజమాన్యంలోని కంపెనీల డ్రోన్ కార్యకలాపాలకు ఎటువంటి పరిమితి  ఉండదు.

12.  డ్రోన్లు మరియు డ్రోన్ భాగాల దిగుమతిని డిజిఎఫ్‌టి నియంత్రిస్తుంది.

13. ఏదైనా రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ జారీకి ముందు భద్రతా అనుమతి అవసరం ఉండదు.

14.   ఆర్‌అండ్‌డి సంస్థలకు  ఎయిర్‌వర్తినెస్ సర్టిఫికేట్ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యముందస్తు అనుమతి మరియు రిమోట్ పైలట్ లైసెన్స్ అవసరం ఉండదు.

15. డ్రోన్ నిబంధనల 2021 పరిధిలోకి వచ్చే  డ్రోన్ల బరువును   300 కిలోల నుండి 500 కిలోలకుపెంచడం జరిగింది.  ఇది డ్రోన్ టాక్సీలను కూడా వర్తిస్తుంది.  

16.  డ్రోన్ శిక్షణ మరియు పరీక్షలు అధీకృత డ్రోన్ పాఠశాల నిర్వహిస్తుంది.  శిక్షణ ప్రమాణాలనుడ్రోన్ పాఠశాలలను పర్యవేక్షణ  మరియు ఆన్‌లైన్‌లో పైలట్ లైసెన్స్‌ల జారీ అంశాలను  డీజీసీఎ అమలు చేస్తుంది. 

17. ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికెట్ ను జారీ చేసే అధికారాన్ని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేదా దాని ఆమోదం పొందిన సంస్థలు కలిగి ఉంటాయి. 

18. తయారీదారు స్వీయ-ధృవీకరణ మార్గం ద్వారా డిజిటల్ స్కై ప్లాట్‌ఫామ్‌లో వారి డ్రోన్ కు  ప్రత్యేక గుర్తింపు సంఖ్యను రూపొందించవచ్చు.

19.  డ్రోన్‌ల బదిలీ మరియు రిజిస్ట్రేషన్ కోసం సులభమైన ప్రక్రియ అమలులోకి వస్తుంది.

20. వినియోగదారుల స్వీయ పర్యవేక్షణ కోసం డిజిటల్ స్కై ప్లాట్‌ఫాంపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు,  శిక్షణా విధానం కార్యక్రమాన్ని డీజీసీఎ నిర్ణయిస్తుంది.  సూచించిన విధానాల నుంచి  గణనీయమైన మార్పులు ఉంటే తప్ప ఆమోదాలను పొందవలసిన అవసరం ఉండదు.

21. డ్రోన్ నిబంధనల ప్రకారం విధించే గరిష్ట జరిమానాను లక్ష రూపాయలుగా నిర్ణయించారు. అయితేఇతర చట్టాల ఉల్లంఘన కు సంబంధించి జరిమానాలకు ఇది వర్తించదు.

22. సరకు రవాణా కోసం డ్రోన్ కారిడార్లు అభివృద్ధి చేయబడతాయి.

23. వ్యాపార-స్నేహపూర్వక నియంత్రణ పాలనను సులభతరం చేయడానికి డ్రోన్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. 

Link to Public Notice

 

***



(Release ID: 1735855) Visitor Counter : 251