భారత పోటీ ప్రోత్సాహక సంఘం

'జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌'లో వాటాను 'సినర్జీ మెటల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ హోల్డింగ్ లిమిటెడ్' కొనుగోలు చేయడానికి సంబంధించి గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా నోటీసు అందుకున్న సీసీఐ, సూత్రప్రాయ అంగీకారం

Posted On: 15 JUL 2021 11:53AM by PIB Hyderabad

'జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌'లో (లక్షిత సంస్థ) వాటాను 'సినర్జీ మెటల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ హోల్డింగ్ లిమిటెడ్' (కొనుగోలు సంస్థ) కొనుగోలు చేయడానికి సంబంధించి, 'కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా' (సీసీఐ) గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా నోటీసు అందుకుంది. ఈ ఒప్పందానికి సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.

    కొనుగోలు సంస్థ, దాని అంతిమ నియంత్రణ సంస్థ అయిన 'సినర్జీ మెటల్స్ అండ్‌ మైనింగ్ ఫండ్ ఐ ఎల్‌పీ"(సినర్జీ ఫండ్‌)కు పెట్టుబడి నిధి సంస్థ. 'సినర్జీ ఫండ్‌' ప్రపంచ దేశాల్లోని పరిశ్రమలు, లోహాలు, విద్యుత్ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంది.

    లక్షిత సంస్థ, భారతదేశంలో ఏర్పాటైన లిస్ట్‌ కాని పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ. ఇది జేఎస్‌డబ్ల్యూ గ్రూపు సంస్థ. (ఎ) సిమెంట్, క్లింకర్, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్-ఫర్నేస్ స్లాగ్, స్లాగ్ శాండ్‌, సంబంధిత ఉత్పత్తుల తయారీ, వ్యాపారం (బి) సిమెంటు ఉత్పత్తి కోసం ముడి పదార్థాల తవ్వకం, పగులగొట్టడం, పొడి చేయడం, ఇతర అన్ని ప్రక్రియలు (సి) రహదారి రవాణా సేవలు (డి) ఇళ్ళు, భవనాల నిర్మాణం కోసం భూమి, స్థిరాస్తుల కొనుగోలు వంటి వ్యాపారాలను లక్షిత సంస్థ నిర్వహిస్తోంది.
 

****



(Release ID: 1735785) Visitor Counter : 122