మంత్రిమండలి

వివిధ మంత్రిత్వ‌శాఖ‌లు, సిపిఎస్ఇలు పిలిచే అంత‌ర్జాతీయ టెండ‌ర్ల‌లో భార‌తీయ షిప్పింగ్ కంపెనీల‌కు స‌బ్సిడీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా వాణిజ్య నౌక‌ల‌కు ప్రోత్సాహం క‌ల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం.

Posted On: 14 JUL 2021 4:02PM by PIB Hyderabad
ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ ల‌క్ష్యాన్ని నెర‌వేర్చేందుకు , ప్ర‌ధాన‌మంత్రి  శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన  కేంద్ర కేబినెట్ ,
రాగ‌ల 5 సంవ‌త్స‌రాల‌లో భార‌తీయ షిప్పింగ్ కంపెనీల‌కు , వివిధ మంత్రిత్వ‌శాఖ‌లు, సిపిఎస్ఇలు ప్ర‌భుత్వ కార్గోను దిగుమ‌తి చేసుకునేందుకు జారీ చేసే టెండ‌ర్ల‌లో  1624 కోట్ల రూపాయ‌ల మేర‌కు స‌బ్సిడీ అందించేందుకు ఈ కింది విధంగా త‌గిన ఆమోదం తెలిపింది.
2021, ఫిబ్ర‌వ‌రి 1 త‌ర్వాత ఇండియాలో రిజిస్ట‌ర్ అయిన నౌక‌, ఇండియాలో రిజిస్ట‌ర్ అయ్యే నాటికి 10 సంవ‌త్స‌రాల‌కంటే త‌క్కువ క‌లిగి ఉంటే దానికి ఎల్ 1 విదేవీ షిప్పింగ్ కంపెనీ కోట్ చేసిన మొత్తంలో 15 శాతం వ‌ర‌కు స‌బ్సిడీని ఇవ్వ‌నున్నారు. లేదా ఆర్‌.ఒ.ఎఫ్‌.ఆర్ క‌లిగిన ఇండియ‌న్ ఫ్లాగ్ వెస‌ల్ ఆఫ‌ర్ చేసిన ధ‌ర‌కు, ఎల్ 1 విదేశీ షిప్పింగ్ కంపెనీ ఆఫ‌ర్ చేసిన ధ‌ర‌కు మ‌ధ్య ఏది త‌క్కువ అయితే దాని వ‌ర‌కు స‌బ్సిడీ వ‌ర్తింప చేస్తారు.
ఎ).  2021 ఫిబ్ర‌వ‌రి 1 త‌ర్వాత రిజిస్ట‌ర్ అయి, రిజిస్ట‌ర్ అయ్యే స‌మ‌యానికి 10 నుంచి 20 సంవ‌త్స‌రాల పాత‌ది అయితే స‌బ్సిడీ మొత్తాన్ని ఎల్‌1 విదేశీ షిప్పింగ్ కంపెనీ ఆఫ‌ర్ చేసిన‌దానిలో 10 శాతం లేదా భార‌త ఫ్లాగ్ క‌లిగి, ఆర్‌.ఒ. ఎఫ్‌.ఆర్ క‌లిగిన నౌక ఆఫర్ చేసిన దానికి , ఎల్ 1 విదేశీ షిప్పింగ్ కంపెనీ ఆఫ‌ర్ చేసిన దానికి మ‌ధ్య గ‌ల తేడాలో ఏది త‌క్కువ అయిత ఆ మొత్తం స‌బ్సిడీ గా ఇస్తారు.
ఈ స‌బ్సిడీ మ‌ద్ద‌తును ప్ర‌తి ఏడాది 1 శాతానికి త‌గ్గిస్తూ అది  పైన పేర్కొన్న కేట‌గిరీల‌కు వ‌రుస‌గా10 శాతం, 5 శాతం వ‌ర‌కు వ‌చ్చే వ‌ర‌కు, త‌గ్గిస్తారు.
బి). ప్ర‌స్తుతం భార‌త్‌లో రిజిస్ట‌ర్ అయిన నౌక‌లు అయి ఉండి, 2021 ఫిబ్ర‌వ‌రి 1 నాటిక 10 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు గ‌ల‌వి అయితే, స‌బ్సిడీ మ‌ద్ద‌తును ఎల్ 1 విదేశీ షిప్పింగ్ కంపెనీ ఆపర్ చేసిన ధ‌ర‌లో 10 శాతం, లేదా భార‌త రిజిస్ట‌ర్డ్ ఆర్‌.ఒ.ఎప్‌.ఆర్ వ‌ర్తింప‌చేస్తున్న నౌక ఆఫ‌ర్ చేస్తున్న ధ‌ర‌కు , విదేశీ ఎల్ 1 షిప్పింగ్  కంపెనీ ఆఫ‌ర్ చేస్తున్న‌ధ‌ర‌కు మ‌ధ్య‌గ‌ల వ‌త్యాసంలో ఏది త‌క్కువ అయితే ఆ మేర‌కు స‌బ్సిడీ ఇస్తారు. ప్ర‌స్తుత భార‌త ఫ్లాగ్ క‌లిగిన నౌక‌లు 2021 ఫిబ్ర‌వ‌రి 1 నాటికి 10 నుంచి 20 సంవ‌త్స‌రాల పాతవి అయితే వాటికి స‌బ్సిడీని 5 శాతం మేర‌కు ఎల్ 1 విదేశీ షిప్పింగ్ కంపెనీ కోట్ చేసిన మొత్తంలో ఇస్తారు లేదా భార‌త్ ఫ్లాగ్ క‌లిగిన నౌక కోట్ చేసిన మొత్తానికి, ఎల్ 1 విదేశీ నౌక కోట్ చేసిన మొత్తానికి మ‌ధ్య‌గ‌ల తేడాలో ఏది త‌క్కువ అయితే దానిని స‌బ్సిడీగా ఇస్తారు.
 
సి) ఇండియ‌న్ ఫ్లాగ్ క‌లిగిన నౌక ఎల్ 1 బిడ్డ‌ర్ అయితే ఈ సబ్సిడీ ఉండ‌దు.
డి) ఇందుకు సంబంధించిన బ‌డ్జెట‌రీ మ‌ద్ద‌తును నేరుగా సంబంధిత మంత్రిత్వ‌శాఖ‌, విభాగానికి అంద‌జేయ‌డం జ‌రుగుతుంది..
ఇ) ఈ ప‌థ‌కం అమ‌లు త‌ర్వాత అవార్డు ద‌క్కించుకున్న నౌక‌ల‌కు మాత్ర‌మే ఈ సబ్సిడీ వ‌ర్తింప చేస్తారు.
ఎఫ్‌) ఒక సంవ‌త్స‌రం నుంచి మ‌రో సంవ‌త్స‌రానికి నిధులు ఖ‌ర్చుచేసేందుకు కేటాయింపుల‌లో  ఈ ప‌థ‌కానికి సంబంధించి ఆయా మంత్రిత్వ‌శాఖ‌లు, విభాగాల‌లో సుల‌భ త‌ర విధానాలు
జి) 20 సంవ‌త్స‌రాలు పైబ‌డిన నౌక‌లు ఈ ప‌థ‌కం కింద స‌బ్సిడీకి అర్హత పొందలేవు
హెచ్‌) ఈ ప‌థ‌కం ప‌రిధిని విస్త‌రింప  చేసిన దరిమ‌లా, అవ‌స‌ర‌మైన మేరకు డిపార్ట‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండీచ‌ర్ నుంచి అద‌న‌పు నిధుల‌ను ఈ మంత్రిత్వ‌శాఖ కోర‌నుంది. 
ఐ) ఈ ప‌థ‌కాన్ని ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత తిరిగి స‌మీక్షిస్తారు.

అమ‌లు వ్యూహం, టార్గెట్‌లు:

 ఎ) అమ‌లు షెడ్యూలు, ఆయా సంవ‌త్స‌రాల‌లో గ‌రిష్ఠ ఖ‌ర్చు 15 శాతం అంచ‌నా స‌బ్సిడీ చెల్లించ‌డానికి సంబంధించిన గ‌ణాంకాలు కిందివిధంగా ఉన్నాయి. కోట్ల రూపాయ‌ల‌లో

 

 

 

2021-22

 

2022-23

 

2023-24

 

2024-25

 

2025-26

 

Total

 

 క్రూడ్‌

62.10

 

124.19

 

186.29

 

248.39

 

310.49

 

931.46

 

ఎల్‌.పి.జి

 

34.72

 

69.43

 

104.15

 

138.87

 

173.59

 

520.76

 

కోల్‌

 

10.37

 

20.75

 

31.12

 

41.50

 

51.87

 

155.61

 

ఫ‌ర్టిలైజ‌ర్‌

 

1.08

 

2.16

 

3.25

 

4.33

 

5.41

 

16.23

 

మొత్తం 

108.27

 

216.53

 

324.81

 

433.09

 

541,36

 

1624.06

 

 
 
 


(Release ID: 1735624) Visitor Counter : 180