జౌళి మంత్రిత్వ శాఖ
దుస్తులు / వస్త్రాలు మరియు మేడ్-అప్ల ఎగుమతిపై రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు మరియు లెవీ(రో ఎస్ సిటీ ఎల్ )రిబేట్లను కొనసాగించడానికి ప్రభుత్వం ఆమోదం
ప్రస్తుత రేట్ల ప్రకారం 2024 మార్చి 31 వరకు రో ఎస్ సిటీ ఎల్ పొడిగింపు
స్థిరమైన ఊహించదగిన విధాన నిర్ణయానికి అవకాశం
ఎగుమతులకు ఊతం - ప్రపంచ మార్కెట్ తో భారత వస్త్ర పరిశ్రమ పోటీకి అవకాశం
అంకుర సంస్థలు, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
ఆర్ధిక పురోభివృద్ధికి దోహదం- లక్షలాది ఉద్యోగాల కల్పన
Posted On:
14 JUL 2021 4:13PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం అయిన కేంద్ర మంత్రివర్గం దుస్తులు / వస్త్రాలు మరియు మేడ్-అప్ల ఎగుమతిపై ఇస్తున్న రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు మరియు లెవీ(రో ఎస్ సిటీ ఎల్ )రిబేట్లను అమలులో ఉన్న రేట్లతో కొనసాగించడానికి ఆమోదం తెలిపింది. 2019 మార్చి 8 వ తేదీన జౌళి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దుస్తులు / వస్త్రాల ఎగుమతులపై ( చాప్టర్ -61, 62), మేడ్-అప్‌ల (చాప్టర్ -63) ఎగుమతులపై పన్నులు మరియు పన్నుల నుంచి మినహాయింపు కల్పిస్తారు. ఈ పథకం 2024 మార్చి 31 వరకు కొనసాగుతుంది.
రో ఎస్ సిటీ ఎల్ పరిధిలోకిరాని ఇతర జౌళి ఉత్పత్తులు (చాప్టర్ -61, 62 మరియు 63 మినహా)
రో డి టి ఈ పి కింద ప్రయోజనాలను పొందటానికి అర్హత కలిగి ఉంటాయి. దీనికి సంబంధించి వాణిజ్య శాఖ ఇతర ఉత్పత్తులతో పాటు జౌళి ఉత్పత్తులకు వర్తించే తేదీలను ప్రకటిస్తుంది.
దుస్తులు / వస్త్రాలు మరియు మేడ్-అప్ల ఎగుమతిపై ఇస్తున్న రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు మరియు లెవీ రిబేట్లను కొనసాగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో జౌళి రంగం అంతర్జాతీయ మార్కెట్ తో పోటీ పడడానికి అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఈ రంగంపై విధిస్తున్న సుంకాలు/పన్నులపై ఎటువంటి రిబేట్లు లభించడం లేదు. ప్రభుత్వ నిర్ణయంతో స్థిరమైన విధాన నిర్ణయాలు అమలులోకి వచ్చి జౌళి ఉత్పత్తుల ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్ తో పోటీ పడడానికి అవకాశం కలుగుతుంది. ఇంతేకాకుండా, అంకుర సంస్థలు,పారిశ్రామికవేత్తలు జౌళి రంగంలోకి ప్రవేశించి వస్తువులను ఎగుమతి చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగాలను కల్పించ దానికి వీలవుతుంది.
ఎగుమతి చేయబడిన వస్తువులకు పన్ను తిరిగి చెల్లింపు:
అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడడానికి ఎగుమతులపై పన్నులు సుంకాలను విధించరాదన్న విధానం ప్రపంచవ్యాపితం ఆమోదం పొందింది. దిగుమతులపై విధిస్తున్న సుంకాలు, జీఎస్టీని తిరిగి చెల్లించడం జరుగుతుంది. ఎగుమతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు, సుంకాలను ఎగుమతిదారులకు తిరిగి చెల్లించడం లేదు. పన్నులతో దుస్తులు / వస్త్రాలు మరియు మేడ్-అప్ల ధరలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్ లో భారత జౌళి ఉత్పత్తులు పోటీ పడలేక పోతున్నాయి.
ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా విధిస్తున్న పన్నులలో భాగమైన తిరిగి చెల్లించబడని కొన్ని సెస్సులు , సుంకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: -
1. వస్తువుల రవాణా, విద్యుత్ ఉత్పత్తి మరియు వ్యవసాయ రంగానికి ఉపయోగించే ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర పన్నులు,సుంకాలు మరియు సెస్సులు.
2. మార్కెట్ పన్ను
3.ఉత్పత్తి కార్యక్రమాలపై అన్ని స్థాయిల్లో విధిస్తున్న విద్యుత్ చార్జీలు
4. స్టాంపు డ్యూటీ
5. క్రిమిసంహారక మందులు, ఎరువులు తదితర వస్తువులపై విధిస్తున్న జీఎస్టీ
6. రిజిస్టర్ కానీ డీలర్లు తదితరుల నుంచి వసూలు చేస్తున్న జీఎస్టీ
7. బొగ్గు ఇతర వస్తువులపై విధిస్తున్న సెస్
అన్నీ కలుపుకుని వసూలు చేస్తున్న పన్నులు, విధిస్తున్న సుంకాలు, డ్యూటీలను తిరిగి చెల్లించవలసి ఉన్న అంశానికి గల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ 2016లో రిబేట్ అఫ్ స్టేట్ డ్యూటీస్ పేరిట ఒక పథకాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం, అన్నీ కలుపుకుని పన్నులు, సుంకాలను చెల్లిస్తున్న వస్త్రాలు, దుస్తులు, మేడ్ అప్ ల ఎగుమతిదారులకు వారు చెల్లించిన పన్నులను జౌళి మంత్రిత్వశాఖ బడ్జెట్ ద్వారా తిరిగి చెల్లించడం జరుగుతుంది. 2019లో కేంద్ర రాష్ట్ర పన్నులు, సుంకాల రిబేట్ పేరిట కేంద్ర జౌళి శాఖ మరో పథకాన్ని అమలులోకి తెచ్చింది. దీనిప్రకారం, ఎగుమతిదారులు ఎగుమతి చేసే వస్తువుల్లో ఉండే అన్నీ కలుపుకుని చెల్లించే పన్ను మొత్తానికి ఒక డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ జారీ చేయబడుతుంది. డ్యూటీ క్రెడిట్ స్క్రిప్ట్ ను ఉపయోగించి ఎగుమతిదారులు దిగుమతి చేసుకునే యంత్రాలు, పరికరాలు లేదా మారే ఇతర ఉత్పత్తి వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని చెల్లించడానికి అవకాశం కల్పించడం జరిగింది.
ఈ పథకం అమలులోకి వచ్చిన ఏడాది లోపే కోవిడ్ ప్రభావం కనిపించింది. దీనితో తలెత్తిన ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం పథకాన్ని మరికొంతకాలం పొడిగించి సుస్థిర విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. జౌళి రంగంలో ఎక్కువ కాలం అమలులో ఉండే విధంగా కొనుగోలుదారులు ఆర్డర్లను ఇస్తుంటారు. దీనిప్రకారం ఎగుమతిదారులు ముందుగానే తమ కార్యక్రమాలను రూపొందించుకుని కార్యకలాపాలను కొనసాగించవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన విధాన నిర్ణయాలు ఎక్కువకాలం అమలులో ఉంటే ఎగుమతిదారులకు ప్రయోజనం కలుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పథకాన్ని 2024 మార్చ్ 31వ తేదీ వరకు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పథకాన్ని పొడిగించడం వల్ల జౌళి రంగంలో అదనపు పెట్టుబడులు రావడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
***
(Release ID: 1735615)
Visitor Counter : 235