వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
గత ఏడాదితో పోలిస్తే 11.81 శాతం అధికంగా గోధుమ పంట సేకరణ
గత ఏడాది ఇదే సమయానికి 387.53 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ పంటను సేకరిస్తే ఈ ఏడాది ఇదే సమయానికి 433. 32 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ పంట సేకరణ.
ప్రస్తుతం కొనసాగుతున్న గోధుమ పంట సేకరణ ద్వారా 49. 16 లక్షల మంది రైతులకు లబ్ధి.
గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 14.30 శాతం అధికంగా ధాన్యం సేకరణ
ప్రస్తుతం కొనసాగుతున్న 2020-21 ఖరీఫ్ మార్కెట్ సీజన్కు, రబీ మార్కెట్ సీజన్‌కు కలిపి కనీస మద్దతు ధరల ద్వారా 567.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ. తద్వారా 127. 91 లక్షల రైతులకు లబ్ధి.
కనీస మద్దతుధరలను అందిస్తూ పప్పు ధాన్యాలను, నూనెపంటల విత్తనాల సేకరణ. 10, 07, 334. 82 మెట్రిక్ టన్నుల సేకరణ.
Posted On:
13 JUL 2021 7:21PM by PIB Hyderabad
గోధుమ పంటల సేకరణ చేపట్టే పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న రబీ మార్కెట్ సీజన్ దాదాపుగా ముగిసింది. 2021-22కుగాను ఆయా రాష్ట్రాలు ఇంతవరకూ ( 12-07-2021) 433.32 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ పంటను సేకరించడం జరిగింది. ఇది రికార్డు స్థాయిలో జరిగిన సేకరణ. గత ఏడాది ఇదే సమయానికి అంటే 2020-21 రబీ మార్కెట్ సీజన్‌కుగాను 389. 92 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమల్ని సేకరించడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న రబీమార్కెట్ సీజన్ సేకరణ కార్యక్రమాలద్వారా 49.16 లక్షల మంది రైతులు ఇప్పటికే లబ్ధి పొందారు. వారికి ఎంఎస్ పి కింద రూ. 85, 581. 02 కోట్ల చెల్లింపులు జరిగాయి.
2020-21 ఖరీఫ్ మార్కెట్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం పంట సేకరణ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతోంది. ధాన్య సేకరణకు సంబంధించిన రాష్ట్రాల్లో 12-07-2021 నాటికి ఖరీఫ్, రబీమార్కెట్ సీజన్లకు సంబంధించి 867.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయడం జరిగింది. ( ఖరీప్ ధాన్యం పంట 707.59 ఎల్ ఎంటి కాగా రబీధాన్యం పంట 159.47 ఎల్ ఎంటి). గత ఏడాది ఇదే సమయానికి ఇది 758. 54 ఎల్ ఎంటి.
ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెట్ సీజన్ సేకరణ కార్యకలాపాలద్వారా దాదాపుగా 127. 91 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. వారికి కనీస మద్దతు ధర ప్రకారం రూ. 1, 63, 700.91 కోట్లు లభించాయి. రికార్డు స్థాయిలో గతం లేని విధంగా ధాన్యం సేకరణ జరుగుతోంది. గత ఏడాది అంటే 2019-20 ఖరీప్ మార్కెట్ సీజన్ లో జరిగిన 773.45 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణను ఈ ఏడాది దాటడం జరిగింది.
తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనల ప్రకారం ధరల మద్దతు పథకం ( పిఎస్ ఎస్) కింద 2020-21 ఖరీఫ్ మార్కెట్ సీజన్, 2021 రబీ మార్కెట్ సీజన్, 2021 వేసవి సీజన్‌కు సంబంధించిన 108.42 ఎల్ ఎంటి పప్పుధాన్యాలు, నూనె విత్తనాల సేకరణకు ఆమోదం తెలపడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు 1.74 ఎల్ ఎంటి కోప్రా ( కొబ్బరి పంట)ను సేకరించుకునేలా అనుమతి ఇవ్వడం జరిగింది. ధరల మద్దతు పథకం (పిఎస్ ఎస్) కింద పప్పుధాన్యాలు, నూనె గింజలు, కోప్రా పంటలను సేకరించుకుంటామనే ప్రతిపాదనలు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుంచి రాగానే ఆమోదం తెలపడం జరుగుతుంది. తద్వారా ఈ పంటలకు సంబంధించిన ఎఫ్ ఏ క్యు గ్రేడ్ పంటలను, 2020-21 సంవత్సరానికిగాను ప్రకటించిన కనీస మద్దతు ధరలప్రకారం, పేర్లు నమోదు చేసుకున్న రైతుల దగ్గరనుంచి సేకరించడ జరుగుతుంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పంట కోతల సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రకటించిన ఎంఎస్ పి ధరకంటే తక్కువలో మార్కెట్ ధరలు వుంటే రాష్ట్రాలు ప్రకటించిన సేకరణ సంస్థల ద్వారా పంటల సేకరణ చేయడం జరుగుతుంది.
తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హర్యానా, ఒడిషా, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2020-21 ఖరీఫ్, 2021 రబీ, 2021 వేసవి సీజన్లకు సంబంధించిన పెసలు, మినుములు, కంది, శనగపప్పు, మసూర్, వేరుశనక్కాయ, పొద్దుతిరుగుడు గింజలు, ఆవాలు, సోయాబీన్ పంటలను ఆయా నోడల్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వం సేకరించింది. తద్వారా ఎంఎస్ పి కింద 6, 17, 524 మంది రైతులకు రూ. 5, 359.23 కోట్లు జమ అయ్యాయి.
అదే విధంగా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 2020-21 సీజన్‌కు సంబంధించి రూ. 52.40 కోట్ల ఎంఎస్ పి విలువ కలిగిన 5089 మెట్రిక్ టన్నుల కోప్రాను 3961 మంది రైతుల దగ్గరనుంచి సేకరరించడం జరిగింది. 2021-22 సీజన్‌కుగాను తమిళనాడునుంచి 51వేల ఎంపీ కోప్రా సేకరణకు అనుమతి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీనుంచి సేకరణ ప్రారంభమవుతుంది.
***
(Release ID: 1735315)
Visitor Counter : 168