పర్యటక మంత్రిత్వ శాఖ

బ్రిక్స్ దేశాల పర్యాటక శాఖ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించిన - కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 13 JUL 2021 7:14PM by PIB Hyderabad

భారతదేశం, బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భాగంగా, బ్రిక్స్ దేశాల పర్యాటక మంత్రుల సమావేశానికి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు.  ఈ సమావేశంలో, అన్ని సభ్య దేశాలు అంటే,  బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల మంత్రులు పాల్గొన్నారు.

 

బ్రిక్స్ దేశాల మధ్య పర్యాటక సహకారాన్ని ప్రోత్సహించడానికి సమర్థవంతమైన మార్గం గా బ్రిక్స్ పర్యాటక మంత్రుల సమావేశాన్ని, భారతదేశం నిర్వహించింది.  బ్రిక్స్ దేశాల మధ్య పర్యాటక సహకారాన్ని, ఈ సమావేశం, సమీక్షించింది.  ఈ సమావేశంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే, బ్రిక్స్ దేశాల మధ్య పర్యాటక రంగం యొక్క సహకారం మరియు ప్రోత్సాహానికి సంబంధించిన మంత్రుల ప్రకటనను ఆమోదించడం. కోవిడ్-19 మహమ్మారి ప్రజారోగ్యానికి తీవ్రంగా హాని కలిగించినట్లు, మంత్రుల ప్రకటన పేర్కొంది. అదేవిధంగా,  స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల అమలుకు ఎదురౌతున్న అపారమైన సవాళ్ల గురించి కూడా పేర్కొంది. 

బ్రిక్స్ సభ్య దేశాల మధ్య పర్యాటక రాకపోకలు మరింత వృద్ధి చెందడానికి, ఒక దేశానికి చెందిన పర్యాటక ప్రదేశాలు, సదుపాయాల గురించి మిగిలిన బ్రిక్స్ దేశాలు మంచి అవగాహన కలిగి ఉండాలని, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సూచించారు.   బ్రిక్స్ దేశాల వారసత్వం, సాంస్కృతిక పర్యాటకం, ప్రకృతి, వన్యప్రాణులు, పర్యావరణ స్నేహపూర్వక పర్యాటకం, మొదలైన సాధారణ పర్యాటక ఉత్పత్తులు ఎక్కువ సహకారం, సమాచార మార్పిడి, ఉత్తమ పద్ధతులకు అవకాశం కల్పిస్తామని, శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

భవిష్యత్ కోసం పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, హరిత పర్యాటకం కోసం బ్రిక్స్ కూటమి, పర్యాటక రంగ పునరుద్ధరణ, అభివృద్ధిని, సుస్థిరమైన మార్గాల్లో వేగవంతం చేయగలదని గుర్తించబడింది.  హరిత పర్యాటక రంగం కోసం బ్రిక్స్ కూటమి లో -  పర్యాటక రంగ విధానాలలో స్థిరత్వాన్ని నెలకొల్పడం;  పరిరక్షణ ప్రయత్నాలు; స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు;  పునరుత్పాదక శక్తి వనరుల వైపు మారడం;  ఇది ప్రకృతి ఆధారిత పరిష్కారాలలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా, హరిత పర్యాటకం కోసం పరిరక్షణ ప్రయత్నాలు; సున్నితమైన  పర్యావరణ వ్యవస్థ లకు మద్దతు ఇవ్వడం వంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. 

బాధ్యతాయుతమైన, స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం, పర్యాటక మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టడం, పర్యాటక సంస్థల మధ్య సన్నిహిత పరస్పర సహకారం, మానవ వనరుల అభివృద్ధి వంటి రంగాలలో పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం వంటి అంశాల ప్రాముఖ్యతపై కూడా, బ్రిక్స్ పర్యాటక మంత్రుల సమావేశం ప్రముఖంగా దృష్టి సారించింది.   పర్యాటక రంగంలో సహకారం ద్వారా బ్రిక్స్ దేశాల పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి కలిసి పనిచేయాలని మంత్రులు సంకల్పించారు.

*****



(Release ID: 1735249) Visitor Counter : 224


Read this release in: Urdu , English , Hindi , Tamil