విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఎన్‌టీపీసీని అభినందించిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్

- దేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసేందుకు లడఖ్,
ఎల్ఏహెచ్‌డీసీల‌తో ఎన్‌టీపీసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవ‌డంపై మంత్రి హ‌ర్షం

Posted On: 13 JUL 2021 4:30PM by PIB Hyderabad

దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేసేందుకు ఎల్ఏహెచ్‌డీసీ, లడఖ్‌ల‌తో ఎన్‌టీపీసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవ‌డంపై మంత్రి కేంద్ర విద్యుత్, కొత్త మరియు పునరుత్పాదక ఇంధన శాఖల‌ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మ‌హార‌త్న, పీఎస్‌యు సంస్థ అయిన ఎన్‌టీపీసీ మొట్ట‌మొద‌టి గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకోవ‌డంపై కేంద్ర విద్యుత్‌శాఖ‌ మంత్రి అభినంద‌న‌లు తెలిపారు. పునరుత్పాదక వనరులు, గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా కార్బన్ రహిత ఆర్థిక వ్యవస్థను నిర్ధారించే దిశ‌గా ప్ర‌ధాన మంత్రి విజ‌న్‌ను ఈ ఒప్పందం మ‌రింత బలోపేతం చేస్తుంద‌ని మంత్రి తెలిపారు.


ఎలాంటి ఉద్గారాలు లేకుండా గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత మొబిలిటీ ప్రాజెక్టును అమలు చేసిన లేహ్ భారతదేశానికి మొట్టమొదటి నగరంగా అవతరించడం మనందరికీ చాలా గర్వకారణమని ఆయన అన్నారు. ఎన్‌టీపీసీ యొక్క 100 శాతం అనుబంధ సంస్థ అయిన ఆర్ఈఎల్‌ ఈ ప్రాంతంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కేంద్ర పాలిత ప్రాంత‌మైన లడఖ్‌తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్.టి.పి.సి యొక్క మొట్టమొదటి సౌర సంస్థాపనలను లేహ్ లో సౌర చెట్లు మరియు సౌర కార్ల పోర్టు రూపంలో ప్రారంభించడం ద్వారా అవగాహన ఒప్పందం సంతకం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్.కె.మాథూర్‌ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్రభుత్వానికి చెందిన‌ సీనియర్ ప్రముఖులు, ఎన్‌టీపీసీ సంస్థ‌ల‌కు చెందిన‌ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ తాజా అవ‌గాహ‌న ఒప్పందంలో భాగంగా.. పునరుత్పాదక వనరులు, ఆకుపచ్చ హైడ్రోజన్ ఆధారంగా కార్బన్ రహిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి లడఖ్‌కు ఎన్‌టీపీసీ సంస్థ తోడ్పాటును అందించ‌నుంది. ఇది ‘కార్బన్ న్యూట్రల్’ లడఖ్ అనే ప్రధానమంత్రి విజ‌న్‌కు అనుగుణంగా ఉండ‌నుంది. లడఖ్ హైడ్రోజన్ రాష్ట్రంగా మారాలని తాము కోరుకుంటున్నానని ఈ దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించేందుకు గాను ఎన్‌టీపీసీతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో 5 హైడ్రోజన్ ఇంధ‌న ఆధారిత బస్సులను నడపడానికి ఎన్‌టీపీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది.| ఈ దిశగా కంపెనీ లేహ్‌లో సౌర ప్లాంట్ మరియు గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత మొబిలిటీ ప్రాజెక్టును అమలు చేసిన.. దేశంలోనే మొట్టమొదటి నగరంగా లెహ్‌ నిలిచింది. ఇది నిజమైన అర్థంలో సున్నా ఉద్గార చైతన్యంగా మార‌నుంది. ఎన్‌టీపీసీ తన పోర్ట్‌ఫోలియోను పచ్చదనం కోసం దూకుడుగా ముందుకు తెస్తోంది. తక్కువ కార్బన్ పాదముద్రను సాధించడానికి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ మరొ ముంద‌డుగు. దీనికి తోడు మొబిలిటీ, శక్తి, రసాయన, ఎరువులు, ఉక్కు మొదలైన రంగాలలోనూ గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత పరిష్కారాల వాడకాన్ని కూడా ఎన్‌టీపీసీ ప్రోత్సహిస్తోంది. 2032 నాటికి 60 గిగావాట్ల  పునరుత్పాదక సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని ఎన్‌టీపీసీ సంస్థ ఇటీవల సవరించింది, ఇది మునుపటి లక్ష్యాన్ని రెట్టింపు చేసింది. ఇటీవల ఎన్.టి.పి.సి విశాఖపట్నం వద్ద 10 మెగావాట్ల భారతదేశపు అతిపెద్ద తేలియాడే సౌర ప్రాజెక్టును ప్రారంభించింది.

***(Release ID: 1735247) Visitor Counter : 48