శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశంలో ప్రపంచస్థాయి తొలి జాతీయ శాస్త్ర సాంకేతిక పరిశోధన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని శాస్త్ర సాంకేతిక విభాగాన్ని కోరిన కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
10 JUL 2021 9:09PM by PIB Hyderabad
శాస్త్రసాంకేతిక రంగంలో పనిచేస్తున్న విభిన్న స్వయం ప్రతిపత్తి కలిగిన పరిశోధన, అభివృద్ధి సంస్థల పరిశోధన సామర్థ్యాన్ని పెంచడానికి భారతదేశంలో మొట్టమొదటి ప్రపంచస్థాయి జాతీయ శాస్త్రసాంకేతిక యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ, ఎర్త్ అండ్ సైన్స్, పర్సనల్, పబ్లిక్ గ్రీవియెన్స్, పెన్షన్స్, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శాస్త్రసాంకేతిక విభాగాన్ని కోరారు.
టెక్నాలజీ భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులనుద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. భారతదేశం పరిశోధన పబ్లికేషన్స్ పరంగా ప్రపంచంలోనే 3వ ర్యాంకు సాధించిందని ప్రపంచంలోనే ప్రసిద్ధ ఎస్సీఐ జర్నల్స్ లో.. పరిశోధన ప్రచురణ నాణ్యతలో ప్రపంచంలో 9వ స్థానంలో ఉందన్నారు. పరిశోధన పత్రాల నాణ్యతలో భారతదేశ ప్రపంచ ర్యాంకింగ్ 14 నుంచి 9వ స్థానానికి చేరుకున్నప్పటికీ.. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి ప్రపంచంలోనే ఐదో స్థానానికి ఎదిగేలా సమష్టిగా కృషి చేయాలన్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి వ్యక్తిగత జోక్యంతోనే 2016 లో పేటెంట్ చట్టాన్నిమరింత ప్రోత్సాహకరంగా చేశారని, దీనివల్ల పేటెంట్ల పొందే ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా తక్కువ సమయంలో పేటెంట్లను తీసుకునే వెసులుబాటు కలిగిందన్నారు. దీనివల్ల గత ఏడు సంవత్సరాల్లో పేటెంట్ల కోసం దాఖలు చేసిన సంఖ్య పెరిగిందని, పూర్తిస్థాయి పరిశోధకులతోపాటు మహిళా శాస్త్రవేత్తల సంఖ్యలో కూడా ప్రగతిశీల పెరుగుదల నమోదైందన్నారు.
మానవ వనరుల సంబంధిత పథకాలైన మనాక్, ఇన్‌స్పైర్, డాక్టోరల్ మరియు పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లు, మరియు ఇతర పథకాలలో లబ్ధిదారుల సంఖ్య పెరగడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి నొక్కి చెప్పారు. .
భారతదేశం 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునేటప్పటికి.. అంటే భారత్ కా అమృత్ మహోత్సవ్ నాటికి .. 2022ను లక్ష్యంగా పెట్టుకొని భారీ లక్ష్యాలు, ప్రణాళికలతో ముందుకు రావాలని మంత్రి కేంద్ర శాస్త్రసాంకేతిక విభాగాన్ని కోరారు. 2022లో జరిగే 75వ స్వాతంత్ర్య దినోవ్సవాల్లో 7,500 ఎస్టీఐ ఆధారిత స్టార్టప్స్, 7 లక్షల 50వేల మంది 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు మనాక్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనాలని శాస్త్రసాంకేతిక విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అదనంగా విజ్ఞాన్ జ్యోతి పథకం కింద 2022 నాటికి 75000 మంది బాలికలు మనాక్ పథకం ప్రయోజనాలను పొందాలని కూడా శాస్త్రసాంకేతిక విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో సైన్స్, సైంటిస్టులు దేశానికి చేసిన సేవను ప్రతిబింబించేలా భారతదేశ 75వ స్వాతంత్ర్య వేడుకల్లో మనస్ఫూర్తిగా పాల్గొనాలని అన్ని సంస్థలతోపాటు శాస్త్రవేత్తలను మంత్రి జితేంద్ర సింగ్ విజ్ఞప్తి చేశారు.
అంతకు ముందు ఈ కార్యక్రమానికి మంత్రి జితేంద్ర సింగ్ను శాస్త్రసాంకేతిక విభాగం కార్యదర్శి, ప్రొఫెసర్ అశుతోష్ శర్మతోపాటు ఎస్ఇఆర్బి కార్యదర్శి ప్రొఫెసర్ సందీప్ వర్మ, ఎఎస్ అండ్ ఎఫ్ఎ విశ్వజిత్ సహాయ్, అంజు భల్లా, జెఎస్ (అడ్మిన్), సునీల్ కుమార్, జెఎస్ (ఎస్ఎంపి), పీసీపీఎం హెడ్ డాక్టర్ అఖిలేష్ గుప్తా తదితరులు మంత్రికి స్వాగతం పలికారు. అంతేకాకుండా చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్, శాస్త్రీయ విభాగాల అధిపతులు, ఆయా శాఖల పరిపాలనా విభాగాల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
(న్యూఢిల్లీలోని టెక్నాలజీ భవన్లో గురువారం జరిగిన కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్)
(Release ID: 1734682)
Visitor Counter : 190