శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

భారతదేశం ప్రతిపాదించిన వినూత్న సహకార కార్యాచరణ ప్రణాళిక అమలుకు బ్రిక్స్ దేశాల ఆమోదం

Posted On: 09 JUL 2021 4:55PM by PIB Hyderabad

వినూత్నతశాస్త్రీయతసాంకేతిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ భారతదేశం ప్రతిపాదించిన సహకార కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి బ్రిక్స్ దేశాలు అంగీకరించాయి. బ్రిక్స్ 12వ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో భారతదేశం  సహకార కార్యాచరణ ప్రణాళిక ( 2021-24)ను ప్రవేశపెట్టింది. 

బ్రిక్స్ దేశాలు పర్యావరణ వ్యవస్థఆవిష్కర్తలుపారిశ్రామికవేత్తల అనుభవాలను ఒకదానితో ఒకటి పంచుకోవడానికి అవకాశం కలిగించే ప్రతిపాదనలను  సహకార కార్యాచరణ ప్రణాళికలో భారతదేశం పొందుపరచింది. 

ఈ ప్రతిపాదనలను బ్రిక్స్ సైన్స్టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పార్టనర్‌షిప్ వర్కింగ్ గ్రూప్ చర్చించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ను రూపొందిస్తుంది. సంబంధిత దేశ ఎస్ టి ఐ ద్వారా ప్రతిపాదనను సైన్స్టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పార్టనర్‌షిప్ వర్కింగ్ గ్రూప్ కు పంపాలని సమావేశంలో నిర్ణయించారు. 

జూలై ఎనిమిదవ తేదీన  జరిగిన బ్రిక్స్ సైన్స్టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పార్టనర్‌షిప్ స్టీరింగ్ కమిటీ సమావేశాలకు భారతదేశ శాస్త్ర సాంకేతిక శాఖ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల శాస్త్రీయ మంత్రిత్వశాఖల మంత్రులు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. 

వివిధ రంగాల్లో అమలు చేయడానికి అవకాశం ఉన్న ప్రతిపాదనలను చర్చించిన సమావేశం 10 రంగాల్లో పరస్పర సహకరించుకోవడానికి కార్యక్రమాలను ఎంపిక చేసింది. ఖగోళ అంశాలుసముద్రగర్భంలో సర్వేలురోగ నిర్ధారణ,చికిత్సప్రజారోగ్య రక్షణసమగ్ర అభివృద్ధివాతావరణ కాలుష్య అంశాలు,బయో మెడిసిన్వ్యవసాయంఆహార పరిశ్రమ,వాతావరణ మార్పులువ్యవసాయం,నీటి శుద్ధి సాంకేతిక అంశాలు లాంటి పది రంగాల్లో బ్రిక్స్ దేశాలు ఒకదానితో ఒకటి సహకరించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. బ్రిక్స్ వర్కింగ్ గ్రూపులు ఈ అంశాలను చర్చించి సహకారానికి సిఫార్సు చేశాయి. 

2021 సెప్టెంబర్ 13-16ల మధ్య బెంగుళూరు లో జరగనున్న బ్రిక్స్ దేశాల ఆరవ యువ శాస్త్రవేత్తల సదస్సులో చర్చించవలసిన అంశాలపై భారతదేశం చేసిన ప్రతిపాదనలను అన్ని దేశాలు అంగీకరించాయి. ఈ సదస్సులో ఆరోగ్య సంరక్షణ,ఇంధన పరిష్కారాలుసైబర్ వ్యవస్థలు వాటి అమలును ప్రధానంగా చర్చిస్తారు. 

దేశ సాంకేతిక సదస్సులో సాంకేతిక సదస్సులో పాల్గొనాలని కోరుతూ భారతదేశం చేసిన ప్రతిపాదనకు బ్రిక్స్ దేశాలు సానుకూలంగా స్పందించాయి. దీనిని సలహాలు సూచనల కోసం బ్రిక్స్ సచివాలయానికి పంపాలని సమావేశం నిర్ణయించింది. భారతదేశ ప్రతిపాదనను విదేశాంగ మంత్రిత్వ శాఖ బ్రిక్స్ దేశాలకు పంపుతుంది. అంతర్జాతీయ సహకార సలహాదారుడు శ్రీ సంజీవ్ కుమార్ వర్షన్ సమావేశ సమన్వయకర్తగా వ్యవహరించారు.   


(Release ID: 1734521) Visitor Counter : 237