నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

విద్యుత్ మంత్రిత్వ శాఖ‌, నూత‌న & పున‌రుత్పాద‌క ఇంధ‌న (రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ)శాఖల‌ కేబినెట్ మంత్రిగా ప‌ద‌వీబాధ్య‌త‌లు

స్వీక‌రించిన రాజ్‌కుమార్ సింగ్

Posted On: 08 JUL 2021 1:12PM by PIB Hyderabad

విద్యుత్ మంత్రిత్వ శాఖ‌, నూత‌న & పున‌రుత్పాద‌క ఇంధ‌న (రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ)శాఖ కేబినెట్ మంత్రిగా రాజ్ కుమార్ సింగ్ గురువారం ప‌ద‌వీబాధ్య‌త‌లు స్వీక‌రించారు. 
 త‌న‌పై అత్యంత న‌మ్మ‌కాన్ని ఉంచి, ఈ బాధ్య‌త‌ల‌ను తన‌కు అప్ప‌గించినందుకు  ప్ర‌ధాన‌మంత్రికి కృత‌జ్ఞ‌త‌లు చెప్తూ, తాను అందుకు త‌గిన‌ట్టుగా విధులు నిర్వ‌ర్తిస్తాన‌ని ఆర్‌.కె. సింగ్ అన్నారు. 
బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం మీడియాతో కొద్ది సేపు మాట్లాడుతూ, ప్ర‌ధాన‌మంత్రి పెట్టిన విద్యుద్దీక‌ర‌ణ ల‌క్ష్యాల‌ను తాము అనుకున్న స‌మ‌యానిక‌న్నా ముందే సాధించామ‌ని, విద్యుత్‌, ఇంధ‌న రంగాల‌కు చెందిన ఫ‌లాలు సాధార‌ణ పౌరుల‌కు అందేలా కృషి చేస్తాన‌ని సింగ్ చెప్పారు. 
ఈ సంద‌ర్భంగా  కార్యాల‌యంలోని సీనియ‌ర్ అధికారులు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు.  

 

****

 



(Release ID: 1734092) Visitor Counter : 124