భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాల ద్వారా వ్యవసాయ టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు కిసాన్ మిత్ర పిఎస్ఏ కార్యాలయం, కెవికె భాగస్వామ్యం
Posted On:
07 JUL 2021 4:18PM by PIB Hyderabad
వ్యవసాయ శాఖ ప్రెజెంటేషన్ 28వ ఎడిషన్ కు ఒక ప్రత్యేక అతిథి వచ్చారు. భూమిలో తేమను గుర్తించే సెన్సర్ లు ఏర్పాటు చేయడం వల్ల తమ ఇరిగేషన్ విధానాల్లో కనిపించిన ప్రభావం గురించి పంజాబ్ కు చెందిన రైతు బల్ రాజ్ వివరించారు. అతని గ్రామంలో విద్యుత్ సదుపాయం లేదు. వారు డీజిల్ తో నడిచే పంపులనే వినియోగిస్తారు. ఈ సెన్సర్ పెట్టడం వల్ల తాము డీజిల్, నీరు (15-20 గంటల పాటు పంపు నడపగా) కూడా పొదుపు చేసుకోగలిగినట్టు అతను చెప్పాడు. భూమిలో తేమను ఈ సెన్సర్ గుర్తించగలిగింది. దాని వల్ల భూసారం మెరుగుపడడంతో పాటు పంట దిగుబడి కూడా పెరిగిందని అతను తెలిపాడు. ఒక అగ్రిటెక్ స్టార్టప్ ఈ సెన్సర్ ను తయారుచేసింది.
తమ టెక్నాలజీల వినియోగదారులైన రైతులు, ఎఫ్ పిఓలు, కృషి విజ్ఞాన్ కేంద్రాలను చేరుకోవడం ఎలా అన్నదే వ్యవసాయ టెక్నాలజీ స్టార్టప్ లు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు. డిమాండు, సరఫరాలను అనుసంధానం చేయడంలో విజయం సాధించడం లక్ష్యంగా కిసాన్ మిత్ర రూపొందించారు. కెవికె ద్వారా ఈ స్టార్టప్ రైతులకు మద్దతు ఇవ్వగలుగుతుంది. తాము ఎదుర్కొంటున్న సవాళ్లకు రైతులు పరిష్కారాలు కనుగొనగలుగుతారు.
వరుసగా నిర్వహిస్తున్న ఈ వ్యవసాయ ప్రెజెంటేషన్లలోభారత పరిశోధన సంస్థలు, వాటి పర్యవేక్షణలోని ఇంక్యుబేటర్లలో శిక్షణ పొందిన టెక్నాలజీ డెవలపర్లు 150 విభిన్న అంశాలు, వ్యవసాయ నిర్వహణ, పంటల అనంతర విధానాలు, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలను వివరిస్తున్నారు. భారత ప్రభుత్వ ముఖ్య శాస్ర్తీయ సలహాదారు కార్యాలయం పర్యవేక్షణలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ టెక్నాలజీలను మదింపు చేయడం లక్ష్యంగా డిమాండుకు ఆధారం అయిన సభ్యులు (పరిశ్రమలు, ఇంక్యుబేటర్లు) లక్ష్యంగా, టెక్నాలజీని వ్యవసాయ డిమాండు, సరఫరాతో అనుసంధానం చేయడం కోసం ప్రధానంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రైతుల సమస్యలకు వ్యవసాయ టెక్నాలజీలు అభివృద్ధి చేయాలన్న ప్రధానమంత్రి విజన్ సాకారం చేసేందుకు కిసాన్ మిత్ర సహాయకారిగా ఉన్నదని 2021 జూలై 3వ తేదీన జరిగిన 28వ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (వ్యవసాయ ఎక్స్ టెన్షన్) డాక్టర్ ఎ.కె.సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులను చేరడం లక్ష్యంగా దేశంలోని విభిన్న ప్రాంతాల్లో వ్యవసాయ పరిశోధన లాబ్ లు టెక్నాలజీలు, ఇన్నోవేషన్లకు సహాయపడుతున్నందుకు పిఎస్ఎ, ఐసిఎస్ టి, ఎన్ఎస్ఆర్ సిఇఎల్ లను ఆయన అభినందించారు. అలాగే ప్రాంతీయ భాషల్లో కూడా ఈ వెబినార్లు నిర్వహించడాన్ని ప్రశంసిస్తూ మరింత ఎక్కువ మంది రైతులు ముందుకు వచ్చి తమ సమస్యలను వివరించి, తమకు అవసరమైన టెక్నాలజీ పరిష్కారాలను తెలియచేసేందుకు ముందు నిర్వహించబోయే వెబినార్లు సహాయపడగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. “ఒక రైతుకు శిక్షణ ఇచ్చినట్టయితే అతను మరెంతో మంది రైతులకు శిక్షణ ఇవ్వడంలో సహాయపడతాడు. ఒకరికి టెక్నాలజీ సహాయంతో శిక్షణ ఇచ్చినట్టయితే అతను ఆ టెక్నాలజీని బదిలీ చేయడంలో కూడా సహాయపడతాడు” అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సొల్యూషన్లు అందరికీ చేర్చడంలో కెవికెలు తమ కార్యాలయాల్లో ఇలాంటి టెక్నాలజీలు ప్రదర్శించి రైతులు వాటిని వీక్షించేందుకు అవకాశం కల్పించాలని, వాటిని రైతులకు చేర్చడంలో ముందుండి నాయకత్వం వహించాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ ఔట్ రీచ్ కార్యక్రమంలో ఇప్పటివరకు 75 కెవికెలు భాగస్వాములయ్యాయి.
28వ ఎడిషన్ వెబినార్ ను https://www.youtube.com/watch?v=8SyC2G2DRT0 లింక్ లో చూడవచ్చు.
ప్రాంతీయ భాషల్లో ఈ సెషన్లు నిర్వహించడానికి విఐటి స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్ అండ్ అడ్వాన్స్ డ్ లెర్నింగ్, విఏఐఏఎల్ (తమిళం), గ్రామీణ ఇంక్యుబేషన్ సెంటర్ (తెలుగు) వంటి స్వచ్ఛంద సంస్థలు సహాయపడుతున్నాయి. గుజరాతీ, మరాఠీ, రాజస్తానీ భాషల్లో కూడా ఈ సెషన్లు నిర్వహించేందుకు ఈ బృందాలు చర్చలు జరుపుతున్నాయి. తమిళ, తెలుగు భాషల్లో రాబోయే సెషన్లు జూలై 10, 17 తేదీల్లో జరగనున్నాయి. మరిన్ని కెవికెలను ఈ చొరవలో భాగస్వాములను చేయడం ద్వారా రాబోయే నెలల్లో మరిన్ని భాషల్లో వీటిని టెలికాస్ట్ చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు.
కిసాన్ మిత్రల గురించి :
భారత ప్రభుత్వ ముఖ్య శాస్ర్తీయ సలహాదారు కార్యాలయం చొరవతో ఈ కిసాన్ మిత్ర లేదా రైతు నేస్తాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన డేటా సోర్స్ ల్లోని సమాచారం ఆధారంగా అవసరమైన సమాచారం అందించి, సిఫారసులు చేస్తూ రైతులను మరింత స్వయం సమృద్ధంగా తీర్చి దిద్దడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఆ వెబ్ సైట్ ఈ లింక్ లో పరిశీలించండి. : https://kisanmitr.gov.in/
భారత ప్రభుత్వ ముఖ్య శాస్ర్తీయ సలహాదారు కార్యాలయం గురించి :
కేబినెట్ సచివాలయం 1999 నవంబర్ లో భారత ప్రభుత్వ ముఖ్య శాస్ర్తీయ సలహాదారు కార్యాలయం ఏర్పాటు చేసింది. కీలక మౌలిక వసతులు, ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రభుత్వ శాఖలు, సంస్థలు, పరిశ్రమ భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన సైన్స్, టెక్నాలజీ అప్లికేషన్లపై ప్రధానంగా దృష్టి సారిస్తూ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాల్లో ఆచరణీయ సలహాలను ప్రధానమంత్రికి, ఆయన మంత్రివర్గ సహచరులకు ఈ పిఎస్ఏ కార్యాలయం అందిస్తుంది.
కెవికె గురించి :
టెక్నాలజీల అమలు, సామర్థ్యాల అభివృద్ధి లక్ష్యంగా టెక్నాలజీలను మదింపు చేసి ప్రదర్శించేందుకు కృషి చేయడం ఈ కృషి విజ్ఞాన కేంద్రాల లక్ష్యం. జాతీయ వ్యవసాయ పరిశోధన వ్యవస్థ (ఎన్ఏఆర్ఎస్) అనుబంధంగా ఈ కేంద్రాలు పని చేస్తాయి. ఇవి ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ, అనుబంధ పరిశ్రల టెక్నాలజీ అవసరాన్ని మదింపు చేస్తూ వాటికి మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తూ స్థానిక ప్రాధాన్యం గల టెక్నాలజీ మాడ్యూల్స్ ను అభివృద్ధి చేస్తాయి. వివిధ జిల్లాల్లో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ మెరుగుదల కోసం ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద రంగాల చొరవతో పరిజ్ఞానాన్ని, వనరులను అభివృద్ధి చేసి ఎన్ఏఆర్ఎస్ ను అనుసంధానం చేసే కేంద్రాలుగా ఈ కెవికెలు పని చేస్తాయి.
భారత సిఎస్ టి గురించి :
పిఎస్ఏ కార్యాలయం సేవలు పొందుతున్న రిజిస్టర్డ్ పబ్లిక్ ట్రస్ట్ అయిన భారత సామాజిక పరివర్తన కేంద్రం (www.indiancst.in) అప్పటి వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని పశుసంవర్థకం, మత్స్య పరిశ్రమ కోసం2016 నవంబర్ 26 నుంచి ) https://epashuhaat.gov.in ను అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది. ఇ-పశుహాట్ తరహాలో కిసాన్ మిత్ర పోర్టల్ నిర్మాణానికి భారత సిఎస్ టి తన జిపిఎంఎస్ ట్రాన్స్ పోర్టల్ ను అందించింది.
ఎన్ఎస్ఆర్ సెల్ గురించి :
ప్రాఫిట్ వెంచర్లు, సామాజిక వెంచర్లు నిర్వహించే ఎంటర్ ప్రెన్యూర్లు, విద్యార్థులు, మహిళా ఎంటర్ ప్రెన్యూర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాల సహాయంతో ఐఐఎంబికి చెందిన ఎన్ఎస్ఆర్ సెల్ స్టార్టప్ లకు అవసరం అయిన మద్దతు సేవలు అందిస్తుంది. తన మాతృ సంస్థలైన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, బెంగళూరుకు చెందిన స్టార్టప్ లు, పరిశ్రమ మెంటార్లు, ప్రముఖ విద్యావేత్తలు, ఆ సంస్థ సహకారంతో సిద్ధాంతాలు, ప్రాక్టీస్ చేసి వెలుగుతున్న పరిశోధకులందరినీ ఎన్ఎస్ఆర్ సెల్ సంఘటితం చేస్తుంది.
***
(Release ID: 1733603)
Visitor Counter : 186