ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 టీకాల తాజా సమాచారం


37.07 కోట్లకు పైగా టీకా డోసులను రాష్ట్రాలు, యూటీలకు అందించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, యూటీలు, ప్రైవేటు ఆసుపత్రుల వద్ద అందుబాటులో ఉన్న 1.66 కోట్లకు పైగా డోసులు

Posted On: 06 JUL 2021 10:33AM by PIB Hyderabad

కొవిడ్‌ టీకా కార్యక్రమ పరిధిని దేశవ్యాప్తంగా మరింత వేగవంతం చేయడానికి, విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. టీకా సార్వత్రీకరణ నూతన దశ జూన్ 21 నుంచి ప్రారంభమైంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరిన్ని టీకాల లభ్యత, టీకాల లభ్యతపై దూరదృష్టిని పెట్టడం ద్వారా టీకా కార్యక్రమం వేగవంతమైంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చక్కటి ప్రణాళికతో పని చేయడానికి, టీకా సరఫరా గొలుసును క్రమబద్ధీకరించడానికి దీనిని ప్రారంభించారు.

సార్వత్రిక టీకా కార్యక్రమంలో భాగంగా, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా కొవిడ్ టీకాలను అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మద్దతునిస్తోంది. టీకా సార్వత్రీకరణ కొత్త దశలో, దేశంలో తయారవుతున్న టీకాల్లో 75 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం సమీకరించి, వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది.

ఇప్పటివరకు 37.07 కోట్లకు పైగా (37,07,23,840) టీకా డోసులను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం అందించింది.

వీటిలో, వృథాతో కలిపి మొత్తం వినియోగించినవి 35,40,60,197 డోసులు. (ఈ రోజు ఉదయం 8 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం).

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 1.66 కోట్లకుపైగా (1,66,63,643) నిల్వలు, వినియోగించాల్సిన టీకా డోసులు ఉన్నాయి.

 


(Release ID: 1733022) Visitor Counter : 256