ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం


రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 31.51 కోట్ల టీకాల కోర్సులు అందించిన కేంద్ర ప్రభుత్వం

ఇంకా రాష్ట్రాల దగ్గర 1.15 కోట్లకు పైగా డోసులు

Posted On: 27 JUN 2021 10:24AM by PIB Hyderabad
టీకాల కార్యక్రమం వేగవంతం చేయటానికి కేంద్రం కట్టుబడింది. అందుకే దేశ వ్యాప్తంగా పరిధి విస్తృతం చేసింది. సార్వత్రిక టీకాల కార్యక్రమం జూన్ 21న ప్రారంభమైన సంగతి తెలిసిందే. మరిన్ని టీకాల కోర్సులు అందుబాటులో ఉంచటం, ముందుగానే సమాచారం రాష్ట్రాలకు తెలియజేయటం ద్వారా అమలు సమర్థంగా సాగుతోంది. 
 
దేశవ్యాప్త టీకాల కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా టీకా డోసులు అందిస్తోంది.  75% టీకాలను ఉచితంగా పంపిణీ చేస్తుండగా మిగిలిన 25% ప్రైవేట్ ఆస్పత్రులకు అందుబాటులో ఉంచారు.
 
ఇప్పటికే 31.51 కోట్లకు పైగా (31,51,43,490) 
డోసులు ఉచితంగా అందించారు.
ఇందులో వ్ఋధాతో సహా  30,35,97,466 కోర్సులు వాడినట్టు ఈ ఉదయం 8గంటలకు అందిన సమాచారం తెలియజేస్తోంది.  
 
రాష్ట్రాల దగ్గర ఇంకా 1.15కోట్లకు పైగా  (1,15,46,024) వాడిని టీకా కోర్సులు నిల్వ ఉంది.  
 
మరో 20,48,960 టీకా డోసులు వచ్చే 3 రోజుల్లో అందుతాయి.

(Release ID: 1730714) Visitor Counter : 180