జల శక్తి మంత్రిత్వ శాఖ
కేవలం 22 నెలల్లో, 84 లక్షల కుటుంబాలకు ట్యాప్ కనెక్షన్లు లభించడంతో, పంపు నీటి సరఫరా నాలుగు రెట్లు అంటే 7 శాతం నుంచి 31 శాతానికి పెరిగిన - 117 ఆశాజనక జిల్లాలు
"అనేక దేశాల్లో స్థానిక ప్రాంత అభివృద్ధికి ఇది ఒక చాలా విజయవంతమైన నమూనాగా, ఒక ఉత్తమ సాధన గా ఉపయోగపడుతుంది" అని, భారతదేశ ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని ప్రశంసించిన - యు.ఎన్.డి.పి.
Posted On:
25 JUN 2021 6:15PM by PIB Hyderabad
"వివిధ కారణాల వల్ల అభివృద్ధి స్థితిలో ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్న అనేక దేశాల్లో స్థానిక ప్రాంత అభివృద్ధికి, భారతదేశ ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం, చాలా విజయవంతమైన నమూనాగా, ఒక ఉత్తమ సాధన గా ఉపయోగపడుతుంది" అని, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యు.ఎన్.డి.పి) విడుదల చేసిన స్వతంత్ర మదింపు నివేదిక ప్రశంసించింది.
ఏ.డి.పి. కింద సమిష్టి కృషితో, తక్కువ మానవ అభివృద్ధి సూచికలు, ప్రాథమిక సౌకర్యాలతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఈ 117 జిల్లాలు వేగంగా అభివృద్ధిని సాధించాయి. ఇది సాధ్యమయ్యేలా జల జీవన్ మిషన్ కీలక పాత్ర పోషించింది. 2019 ఆగష్టు, 15వ తేదీన "జల్ జీవన్ మిషన్" ప్రకటించినప్పుడు, ఆశాజనక జిల్లాల్లో కేవలం 24.58 లక్షల (7 శాతం) గృహాలకు మాత్రమే పంపు నీటి సరఫరా ఉంది. కేవలం, 22 నెలల స్వల్ప వ్యవధిలో, ఈ జిల్లాల్లో అదనంగా 84 లక్షల (31.37 శాతం) గృహాలకు పంపు నీటి సరఫరా కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. ఆశాజనక జిల్లాలు సాధించిన, ఈ 24 శాతం పెరుగుదల, ఈ 22 నెలల్లో దేశవ్యాప్తంగా పంపు నీటి సరఫరాలో నమోదైన 22.72 శాతం పెరుగుదల కంటే ఎక్కువ.
వివిధ మానవ అభివృద్ధి సూచిక పరిమితులలో వెనుకబడి ఉన్న, 117 జిల్లాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలను పెంచే ప్రభుత్వ ప్రయత్నంలో భాగంగా 2018 జనవరి నెలలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆకాంక్ష జిల్లాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ జిల్లాల్లో నెలకొన్న తీవ్ర అసమానతలను తగ్గించే కీలక కార్యక్రమం "జల్ జీవన్ మిషన్". ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వస్’ యొక్క ప్రధానమంత్రి ఆశయాలకు అనుగుణంగా, "ఎవరూ మిగల కూడదు - ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పంపు నీటి సరఫరా కనెక్షన్ అందించాలి" అనేది ఈ కార్యక్రమం నినాదం.
2019 లో "జల్ జీవన్ మిషన్" కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు, దేశంలోని మొత్తం 19.20 కోట్ల గ్రామీణ కుటుంబాలకు గాను, కేవలం 3.23 కోట్ల (17 శాతం) కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి సరఫరా సౌకర్యం ఉంది. గత 22 నెలల్లో, కోవిడ్-19 మహమ్మారి మరియు లాక్ డౌన్ అంతరాయాలు ఉన్నప్పటికీ, "జల్ జీవన్ మిషన్" కార్యక్రమం వేగంగా అమలయ్యింది. 4.36 కోట్ల గృహాలకు పంపు నీటి కనెక్షన్లు అందించడం జరిగింది. పంపు నీటి కనెక్షన్ల సంఖ్య సుమారు 23 శాతం పెరగడంతో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7.59 కోట్ల (39.58 శాతం) గ్రామీణ గృహాలు పంపు నీటి సరఫరా సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. గోవా, తెలంగాణ, అండమాన్-నికోబార్ దీవులు, పుదుచ్చేరి గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం గృహాలు పంపు నీటి కనెక్షన్లు కలిగి ఉండి, ఆ ప్రాంతాలు ‘హర్ ఘర్ జల్’ గా మారాయి. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన పంపు నీటిని అందించాలనే, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా, ప్రస్తుతం, 63 జిల్లాలు మరియు సుమారు 94 వేల గ్రామాల్లో ప్రతి ఇంటికీ పంపు నీటి సరఫరా సౌకర్యం కల్పించడం జరిగింది.
ఆశాజనక జిల్లాలు, ఎస్.సి. / ఎస్.టి. ప్రజలు ఎక్కువగా నివసించే గ్రామాలు మరియు నాణ్యత ప్రభావిత ప్రాంతాల్లోని అన్ని గృహాలకు రాబోయే కొద్ది నెలల్లో ప్రాధాన్యతతో పంపు నీటిని అందించాలన్న, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాన్ని నిరంతరం పునరుద్ఘాటిస్తూ, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి, శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖలు వ్రాస్తున్నారు.
తెలంగాణలో మొత్తం మూడు ఆశాజనక జిల్లాలు ‘హర్ ఘర్ జల్’ గా మారాయి. బీహార్ కీ చెందిన ఆశాజనక జిల్లాలోని గ్రామాల్లో అన్ని గృహాలకు 2021 సంవత్సరంలో పంపు నీటి సరఫరా సౌకర్యం కల్పించే అవకాశం ఉంది. కాగా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్, మణిపూర్, మేఘాలయ, పంజాబ్ మరియు సిక్కిం లకు, 2022 సంవత్సరంలో, పంపు నీటి సరఫరా సౌకర్యం కల్పించనున్నారు.
ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఆశాజనక జిల్లాల్లో చాలా మంచి పని చేసింది. ఇప్పుడు, రాష్ట్రంలోని 13 ఆశాజనక జిల్లాల్లో 72 శాతం గృహాలకు పంపు నీటి సరఫరా సౌకర్యం కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశాజనక జిల్లా అయిన కడపలో, 82 శాతం గ్రామీణ కుటుంబాలకు "జల్ జీవన్ మిషన్" కార్యక్రమం కింద పంపు నీటి కనెక్షన్లు అందించడం జరిగింది. అదేవిధంగా, గుజరాత్ రాష్ట్రంలో ఆశాజనక జిల్లా అయిన నర్మదా లో 77 శాతం గృహాలకు పంపు నీటి సరఫరా సౌకర్యం కల్పించడం జరిగింది. రాతి జలాశయం మరియు తక్కువ భూగర్భ జల వనరులు కలిగి ఉన్న ఈ కొండ ప్రాంతంలోని గ్రామాలకు సరైన తాగునీటి వసతి లేదు. ఉకై రిజర్వాయర్‌పై రెండు నీటి శుద్ధి ప్లాంట్లతో ఒక బహుళ గ్రామ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ఇప్పుడు 221 గ్రామాల్లో ఉన్న 2.75 లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందిస్తోంది.
దేశంలోని పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు సురక్షితమైన పంపు నీటిని నిర్ధారించడానికి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ 2020 అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించారు. ఫలితంగా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు, తెలంగాణ, అండమాన్-నికోబార్ దీవులు వంటి రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలలు, ఆశ్రమ పాథశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పంపు నీటిని అందించడానికి, ఆయా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకున్నాయి.
కాగా, ఇతర రాష్ట్రాలలో, మెరుగైన ఆరోగ్యం, మెరుగైన పారిశుధ్యం తో పాటు, పిల్లలకు పరిశుభ్రత కోసం, తమ తమ రాష్ట్రాల లోని మిగిలిన అన్ని పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో, మరి కొన్ని నెలల్లో, సురక్షితమైన పంపు నీటిని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి జల శక్తి శాఖ మంత్రి, శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలలో వారిని కోరారు.
2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ గృహానీకీ పంపు నీటి కనెక్షన్ అందించాలనే లక్ష్యంతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, 2019 ఆగష్టు, 15వ తేదీన ఎర్రకోట నుంచి ప్రకటించిన "జల్ జీవన్ మిషన్" రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో అమలులో ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో "జల్ జీవన్ మిషన్" కోసం మొత్తం 50,011 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆయా రాష్ట్రాల స్వంత వనరులు, ఆర్.ఎల్.బి. లు / పి.ఆర్.ఐ.లకు 26,940 కోట్ల రూపాయల మేర, 15 వ ఆర్థిక సంఘం సమకూర్చిన గ్రాంట్ల తో పాటు, ఈ ఏడాది గ్రామీణ తాగునీటి సరఫరా రంగంలో, ఒక లక్ష కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెడుతున్నారు. ఇది గ్రామాల్లో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తోంది.
(Release ID: 1730488)
Visitor Counter : 237