రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పరిధిని పెంచి రూపొందించిన 122ఎంఎం క్యాలిబర్‌ రాకెట్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీవో

Posted On: 25 JUN 2021 6:34PM by PIB Hyderabad

దేశీయంగా అభివృద్ధి చేసిన 122ఎంఎం క్యాలిబర్‌ రాకెట్‌ పరిధిని పెంచి రూపొందించిన కొత్త వెర్షన్లను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని సమీకృత ప్రయోగ కేంద్రం (ఐటీఆర్‌)లో, మల్టీ బారెల్‌ రాకెట్‌ లాంఛర్‌ (ఎంబీఆర్‌ఎల్‌) ద్వారా కొత్త వెర్షన్లను ప్రయోగించింది. నాలుగు రకాల 122ఎంఎం రాకెట్లను ప్రయోగించగా, ఈ మిషన్‌ లక్ష్యాలను అవన్నీ అందుకున్నాయి. భారత సైన్యం కోసం ఈ రాకెట్లను డీఆర్‌డీవో తయారు చేసింది. 40 కి.మీ. దూరంలోని లక్ష్యాలను వీటితో ఛేదించవచ్చు.

    టెలీమెట్రీ, రాడార్‌, ఎలక్ట్రో ఆప్టికల్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ సహా ఐటీఆర్‌, ప్రూఫ్‌ అండ్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (పీఎక్స్‌ఈ) ఏర్పాటు చేసిన పరికరాల ద్వారా రాకెట్ల గమనాన్ని పరిశీలించారు. 

    పుణెలోని ఆయుధ పరిశోధన, అభివృద్ధి సంస్థ (ఈఆర్‌డీఈ), హై ఎనర్జీ మెటీరియల్స్‌ రీసెర్ట్‌ లాబొరేటరీ (హెచ్‌ఈఎంఆర్‌ఎల్‌) సంయుక్తంగా ఈ రాకెట్‌ వ్యవస్థను రూపొందించగా, నాగ్‌పుర్‌కు చెందిన ఎకనామిక్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ లిమిటెడ్‌ ఉత్పత్తి సహకారాన్ని అందించింది. కొత్తగా రూపొందించిన రాకెట్లను, ప్రస్తుతమున్న 122ఎంఎం గ్రాడ్‌ రాకెట్ల స్థానంలో ప్రవేశపెడతారు.

    122ఎంఎం క్యాలిబర్‌ రాకెట్ల ప్రయోగం విజయవంతంపై రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. డీఆర్‌డీవోను, పరిశ్రమను అభినందించారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న సిబ్బందిని డీఆర్‌డీవో ఛైర్మన్‌ డా. జి.సతీష్‌ రెడ్డి ప్రశంసించారు.
 



(Release ID: 1730484) Visitor Counter : 193