వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎం–జీకేఏవై)ను 2021, జూలై నుంచి 2021, నవంబర్ వరకు పొడిగింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


గత సంవత్సరం.. 2020 ఏప్రిల్–నవంబర్ కాలానికి జాతీయ ఆహార భద్రతా చట్టం వర్తించిన లబ్ధిదారులందరికీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.

సుమారు 80 కోట్ల జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) పథకం లబ్ధిదారులకు ఎనిమిది నెలలపాటు అదనంగా 5కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా కేటాయించారు.

రూ.26,602 కోట్ల అంచనా వ్యయంతో 2021లో (మే, జూన్) రెండు నెలల కాలానికి పీఎం–జీకేఏవైని ప్రకటించారు.

2021, జూన్ 7న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి.. ఈ ఏడాది నవంబర్లో వచ్చే దీపావళి వరకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పొడిగించినట్లు ప్రకటించారు.

రూ. 67,266 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 80కోట్ల మంది జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారులకు ఐదు నెలలపాటు 204 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందజేస్తారు.

ప్రస్తుతం జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని లబ్ధిదారులకు అందజేస్తున్ననెలవారీ ఆహారధాన్యలకు అదనంగా ఇవి ఐదు నెలలపాటు ఉచితం

ఈ అదనపు కేటాయింపుల ఖర్చు మొత్తాన్ని భారత ప్రభుత్వం భరిస్తుంది.

Posted On: 23 JUN 2021 5:08PM by PIB Hyderabad

దేశంలోని పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద.. 2020, ఏప్రిల్–నవంబర్ కాలానికిగాను 2013, జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని లబ్ధిదారులందరికీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజనను ప్రకటించింది.  జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని సుమారు 80కోట్ల మంది లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలలపాటు 5 కిలోల ఆహార ధాన్యాలను(గోధుమలు లేదా బియ్యం) ఉచితంగా కేటయించారు.  కోవిడ్–19 సంక్షోభం కారణంగా ఆర్థికంగా నష్టపోయిన పేదలకు, అణగారిన వర్గాలకు ఆహార భద్రతపై కల్పిస్తున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన 2020(ఏప్రిల్–నవంబర్) కింద 321 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించారు. 305 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్రాలకు చేరవేయగా.. అందులో 298 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. అంటే, కేటాయించిన మొత్తం ధాన్యంలో 93 శాతం ధన్యం దేశవ్యాప్తంగా పంపిణీ చేయబడింది.

2021లోనూ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయిన కారణంగా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజనను కొంతకాలం.. అంటే  2021, మే నుంచి 2021, జూన్.. రెండు నెలల కాలానికి రూ. 26,602 కోట్ల రూపాయలతో గతసంవత్సరలో అమలు చేసినట్లుగానే ఈ ఏడాది కూడా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం మొత్తం 79 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల కేటాయింపు జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన 2021(మే, జూన్) కింద కేటాయించిన మొత్తంలో 96 శాతం.. అంటే 76 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరాయి. వీటితోపాటు నెలవారీ కేటాయింపులోభాగంగా కేటాయించిన 35 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల్లో 23 లక్షల మెట్రిక్ టన్నులు.. అంటే సుమారు 53 శాతం ఆహార ధాన్యాలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ జరిగింది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని సుమారు 80కోట్ల మంది లబ్ధిదారులు  మే, జూన్ 2021... రెండునెలలపాటు అదనంగా ఐదు కిలోల ఆహార ధాన్యాలు(బియ్యం లేదా గోధుమలు) పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ 19 మహమ్మారి పరిస్థితిని సమీక్షించి, సంక్షోభ సమయంలో పేదలు, అవసరార్థులకు సహాయం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 7, 2021లో జాతినుద్ధేశించి చేసిన ప్రసంగంలో.. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజనను  2021, నవంబర్లో వచ్చే దీపావళి వరకు .. ఐదు నెలలపాటు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని సుమారు 80కోట్ల లబ్ధిదారులకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలు(బియ్యం లేదా గోధుమలు)ను అందజేస్తారు. రూ.67,266 కోట్ల అంచనా వ్యవయంతో  204 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తారు. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని లబ్ధిదారులకు అందజేసే నెలవారీ కేటాయింపులకు ఇది అదనం.  ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన కింద జరుపుతున్న ఈ అదనపు కేటాయింపు ఖర్చును.. అంతర్రాష్ట్రీయ రవాణా, డీలర్ల మార్జిన్సహా మొత్తం వ్యయాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకోకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.  

 

***

 



(Release ID: 1729905) Visitor Counter : 210