వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ భారత ఆహార సంస్థ 2021 మే మరియు జూన్ నెలలకు పీఎంజికేఏవై కింద మొత్తం 36 రాష్ట్రాలు / యుటిలకు 76.72 ఎల్ఎంటి ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేసింది
2021 మే నుండి 2,353 ఆహార ధాన్యం రేక్‌లను భారత ఆహార సంస్థ లోడ్ చేసింది
సెంట్రల్ పూల్ కింద 593 ఎల్‌ఎమ్‌టి గోధుమలు, 294 ఎల్‌ఎమ్‌టి బియ్యం అందుబాటులో ఉన్నాయి
Posted On:
22 JUN 2021 5:17PM by PIB Hyderabad
జూన్ 21, 2021 వరకు, కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత ఆహార సంస్థ మొత్తం 36 రాష్ట్రాలు / యుటిలకు 76.72 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటి) ఉచిత ఆహార ధాన్యాలను సరఫరా చేసింది. 22 రాష్ట్రాలు / యుటిలు అంటే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఛత్తీస్గఢ్,ఢిల్లీ, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ 2021 మే-జూన్ కోసం పూర్తి కేటాయింపులను వినియోగించుకున్నాను.
14 రాష్ట్రాలు / యుటిలు అంటే అండమాన్ & నికోబార్ దీవులు, అస్సాం, బీహార్, డామన్ డయ్యు డి అండ్ ఎన్హెచ్, హర్యానా, జమ్మూ & కాశ్మీర్, లడఖ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ మే నెల వంద శాతం వినిగయోగించుకోగా, జూన్ 2021 కేటాయింపులు తీసుకునే ప్రక్రియ సాగుతోంది. .
ఎఫ్‌సిఐ ఇప్పటికే అన్ని రాష్ట్రాలు / యుటిలలో తగినన్ని నిల్వలను ఉంచింది. ప్రస్తుతం, సెంట్రల్ పూల్ కింద 593 ఎల్‌ఎమ్‌టి గోధుమలు మరియు 294 ఎల్‌ఎమ్‌టి బియ్యం (మొత్తం 887 ఎల్‌ఎమ్‌టి ఆహార ధాన్యాలు) అందుబాటులో ఉన్నాయి.
అన్ని రాష్ట్రాలు / యుటి ప్రభుత్వాలకు సజావుగా సరఫరా అయ్యేలా ఎఫ్‌సిఐ దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాలను రవాణా చేస్తోంది. 2021 మే ఒకటో తేదీ నుండి, 2353 ఆహార ధాన్యం రేక్‌లను ఎఫ్‌సిఐ లోడ్ చేసింది, అంటే రోజువారీ సగటున 45 రేక్‌లు లోడ్ చేసినట్టు.
పిఎమ్‌జికెఎఐ కింద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీని నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలు / యుటి ప్రభుత్వాలకు సూచించాయి. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి మధ్య లబ్ధిదారులకు ఉచిత ఆహార ధాన్యాలు సరఫరా చేయడానికి ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన సదుపాయం కల్పిస్తోంది. తద్వారా లబ్ధిదారులకు ఆహార భద్రత కల్పిస్తుంది. ఈ పథకం కింద, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ పరిధిలో ఉన్న లబ్ధిదారులకు నెలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం జరుగుతోంది.
*****
(Release ID: 1729554)
Visitor Counter : 135