విద్యుత్తు మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్త ఉమ్మడి యోగా ప్రోటోకాల్ ప్రదర్శనలో ఆన్‌లైన్ ద్వారా పాల్గొనడం ద్వారా ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్న ఎన్‌హెచ్‌పీసీ
Posted On:
21 JUN 2021 1:50PM by PIB Hyderabad
భారతదేశ ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్; తన అన్ని విద్యుత్ కేంద్రాలు, ప్రాజెక్టులు, ప్రాంతీయ కార్యాలయాల్లో ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకుంది. కొవిడ్ దృష్ట్యా, ఎలక్ట్రానిక్, డిజిటల్ వేదికల ద్వారా యోగా వేడుకలు నిర్వహించారు.
ఎన్‌హెచ్‌పీసీ సీఎండీ శ్రీ ఏ.కె.సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక ఆన్‌లైన్ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. దూరదర్శన్ ద్వారా 'కామన్ యోగా ప్రొటోకాల్' ప్రదర్శన దేశవ్యాప్త ప్రత్యక్ష ప్రసారానికి సమకాలీనంగా ఈ కార్యక్రమం జరిగింది. ఎన్.కె.జైన్, డైరెక్టర్ (పర్సనల్), వై.కె.చౌబే, డైరెక్టర్ (ప్రాజెక్టులు), ఆర్.పి.గోయల్, డైరెక్టర్ (ఫైనాన్స్), బిస్వజిత్ బసు, డైరెక్టర్ (ప్రాజెక్టులు), సీవీవో ఎ.కె.శ్రీవాస్తవ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆన్‌లైన్ యోగా కార్యక్రమంలో ఎన్‌హెచ్‌పీసీ ఉద్యోగులు, భద్రత సిబ్బంది, ఒప్పంద కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సహా వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎండీ ఏ.కె.సింగ్ మాట్లాడుతూ, "ప్రజల్లో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని యోగా పెంపొందిస్తుంది. యోగా అభ్యసిస్తున్న వారంతా దానిని వదలకుండా కొనసాగించాలి. అభ్యాసన చేయనివారు యోగా నేర్చుకుని మానసిక, శరీరక ఆరోగ్యాన్ని పొందాలని విజ్ఞప్తి చేస్తున్నా. మనం చేసే పనులను యోగా సులభతరం చేస్తుంది, మనల్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచుతుంది” అని చెప్పారు.
ఎన్‌హెచ్‌పీసీ సీఎండీ ఏ.కె.సింగ్, తన భార్య శ్రీమతి సుధాసింగ్ కూడా ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేశారు.
వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం వల్ల, ఎన్ని ప్రాంతాల్లో ఉన్న ఎన్‌హెచ్‌పీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొనగలిగారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా, వారం రోజులుగా, ఆన్‌లైన్ యోగా కార్యక్రమాలు, యోగా, ప్రకృతి వైద్యంపై ఉపన్యాసాలను ఎన్‌హెచ్‌పీసీ నిర్వహించింది.
****
(Release ID: 1729089)
Visitor Counter : 132