సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని 4 ప్రాంతాల్లో యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

Posted On: 20 JUN 2021 11:42AM by PIB Hyderabad

"యోగా, ఒక భారతీయ వారసత్వం" పేరిట, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనుంది.

    దేశంలోని 75 సాంస్కృతిక ప్రదేశాల్లో యోగా నిర్వహించనున్నారు. ఇందులో 45 నిమిషాల యోగా, 30 నిమిషాల సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. మహారాష్ట్రలోని 4 ప్రదేశాలను ఇందుకోసం ఎంపిక చేశారు. అవి, పుణె లోని అగాఖాన్‌ రాజప్రాసాదం, ముంబయిలోని కన్హెరి గుహలు, ఔరంగాబాద్‌లోని ఎల్లోరా గుహలు, నాగ్‌పుర్‌లోని పాత హైకోర్టు భవనం. ఇవి, జాతీయ ప్రాధాన్యతతో కేంద్ర రక్షణలో ఉన్న ప్రదేశాలు.

    అగాఖాన్‌ రాజప్రాసాదం, కన్హేరి గుహలు భారత పురావస్తు విభాగానికి చెందిన ముంబయి సర్కిల్‌ ఆధీనంలో, ఎల్లోరా గుహలు ఔరంగాబాద్‌ సర్కిల్‌ ఆధీనంలో, పాత హైకోర్టు భవనం నాగ్‌పుర్‌ సర్కిల్‌ ఆధీనంలో ఉన్నాయి. 

    పుణెలోని అగాఖాన్‌ రాజప్రాసాదం, నాగ్‌పుర్‌లోని పాత హైకోర్టు భవనంలో ఒక యోగా శిక్షకుడు ఉదయం 7 గం. నుంచి 7.30 గం. వరకు యోగాసన ప్రదర్శన ఇస్తారు. ఉదయం 7.30 గం. నుంచి ఉదయం 8.15 గం. వరకు, నాగ్‌పుర్‌లోని దక్షిణ మధ్య జోన్‌ సాంస్కృతిక కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. 

    ముంబయిలోని కన్హేరి గుహలు, ఔరంగాబాద్‌లోని ఎల్లోరా గుహల వద్ద ఒక యోగా శిక్షకుడు ఉదయం 7 గం. నుంచి 7.30 గం. వరకు యోగాసన ప్రదర్శన ఇస్తారు. ఆ తర్వాత, ఉదయం 8.15 గం. వరకు సంగీత్‌ నాటక్‌ అకాడమీ ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రదర్శిస్తుంది. 

    పుణె, నాగ్‌పుర్‌లో జరిగే కార్యక్రమాలు దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
 

***



(Release ID: 1728751) Visitor Counter : 157