రైల్వే మంత్రిత్వ శాఖ

దక్షిణాది రాష్ట్రాల‌కు 18000 ఎంటీల ఎల్‌ఎంఓ డెలివరీని చేప‌ట్టిన‌ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు


జాతియ‌ సేవ‌లో భాగంగా 32464 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓని దేశానికి అందించిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు

దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల‌కు ప్రాణ వాయువును అందించిన 448 ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు 1854 ట్యాంకర్లతో ఎల్‌ఎంఓను రవాణా చేసి 15 రాష్ట్రాలకు ఉపశమనం కలిగించాయి

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల‌కు వరుసగా 3300, 4100, 4300, 5600 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓని పంపిణీ చేశాయి

మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, ఉత్తర ప్రదేశ్‌కు దాదాపు 3797 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్‌కు 656 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకి 5722 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 2354 మెట్రిక్ ట‌న్నులు, తమిళనాడుకు 5674 మెట్రిక్ ట‌న్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 4190 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌కు 225 మెట్రిక్ టన్నులు, కేరళకు 513 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 3366 మెట్రిక్ టన్నులు, జార్ఖండ్‌కు 38 మెట్రిక్ టన్నులు, అస్సాంకు 560 మెట్రిక్ టన్నుల ద్ర‌వీకృత వైద్య అవ‌స‌రాల ప్రాణవాయువును అందించిన భార‌తీయ రైల్వే

Posted On: 19 JUN 2021 12:25PM by PIB Hyderabad

వివిధ రకాల అవాంతరాలను అధిగమించి, సరికొత్త పరిష్కారాలను కనుగొనే భారతీయ రైల్వే.. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను (ఎల్ఎంఓ) పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కలిగించే తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. దేశ సేవ‌లో భాగంగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 32400 మెట్రిక్ టన్నుల మేర లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎంఓ) డెలివరీ చేశాయి. త‌ద్వారా స‌ర‌కొత్త మైలురాయిని దాటేశాయి. ఇప్పటివరకు, భారత రైల్వే 1854 కి పైగా ట్యాంకర్లలో దాదాపు 32464 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓను దేశంలోని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. 448 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు తమ ప్రయాణాన్ని పూర్తి చేసి వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగించ‌గం గ‌మ‌నార్హం. దేశంలోని దక్షిణాది రాష్ట్రాల‌కు వివిధ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 18000 మెట్రిక్ ట‌న్నుల‌ ఎల్‌ఎంఓను డెలివరీ చేసి స‌రికొత్త మార్కును దాటేశాయి.
ఇప్పటి వరకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు వరుసగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల్లో 3300, 4100, 4300, 5600 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓలను పంపిణీ చేశాయి. ఈ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుదల సమయానిక‌,2 లోడ్ చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 8 ట్యాంకర్లతో 153 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓని తీసుకొని త‌మ గ‌మ్య స్థానాల‌కు బ‌య‌లుదేరి వెళ్లాయి. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ డెలివరీలను 56 రోజుల క్రితం ఏప్రిల్ 24 న మహారాష్ట్రలో 126 మెట్రిక్ టన్నుల భారంతో ప్రారంభించాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల అభ్యర్థనల మేరకు సాధ్యమైనంత తక్కువ సమయంలో గరష్ట స్థాయిలో ఎక్కువ ఎల్ఎంఓను అందించడానికి భారత రైల్వే ప్రయత్నాలను సాగిస్తోంది. భారతీయ‌రైల్వే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్లతో ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్,అస్సాం రాష్ట్రాలకు త‌గు ఆక్సిజన్ ఉపశమనం కలిగిస్తోంది.
ఈ విడుదల సమయానికి ఆక్సిజ‌న్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా భార‌తీయ రైల్వే మహారాష్ట్రకు 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను, ఉత్తర ప్రదేశ్‌కు దాదాపు 3797 మెట్రిక్ టన్నుల‌, మధ్యప్రదేశ్‌కు 656 మెట్రిక్ టన్నులు, ఢిల్లీకి 5722 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 2354 మెట్రిక్ ట‌న్నులు, తమిళనాడుకు 5674 మెట్రిక్ ట‌న్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 4190 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌కు 225 మెట్రిక్ టన్నులు, కేరళకు 513 మెట్రిక్ టన్నులు, తెలంగాణకు 3366 మెట్రిక్ టన్నులు, జార్ఖండ్‌కు 38 మెట్రిక్ టన్నులు, అస్సాంకు 560 మెట్రిక్ టన్నుల ద్ర‌వీకృత వైద్య అవ‌స‌రాలు తీర్చే ప్రాణ వాయువును అందించింది.
దేశ వ్యాప్తంగా 39 నగరాలకు ప్రాణవాయువు ఇప్పటి వరకు దేశంలోని 15 రాష్ట్రాల్లోని 39 నగరాలు / పట్టణాలకు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు ప్రాణవాయువు అందించాయి. ఉత్తరప్రదేశ్లో లక్నో, వారణాసి, కాన్పూర్, బరేలీ, గోరఖ్పూర్, ఆగ్రా నగరాలకు.., మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్, జబల్పూర్, కట్ని, భోపాల్, మహా రాష్ట్రంలోని నాగ్‌పూర్, నాసిక్, పుణె, ముంబయి, సోలాపూర్ నగరాలకు, తెలంగాణలోని హైదరాబాద్ నగరాలకు, హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్, ఢిల్లీలోని ఢిల్లీ కంటోన్మెంట్, ఓక్లా, తుగ్లకాబాద్, రాజస్థాన్లోని కోట, కంకపరా పట్టణాలకు, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, గుంటూరు, తాడిపత్రి, విశాఖపట్టణం నగరాలకు కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం, తిరువల్లూరు, చెన్నై, టుటికోరిన్, కోయంబత్తూరు, తమిళనాడు లోని మదురై, పంజాబ్లోని భటిండా & ఫిలౌర్, అస్సాంలోని కమ్రూప్ మరియు జార్ఖండ్లోని రాంచీ నగరాలకు ప్రాణ వాయువును ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ప్ర‌త్యేక రైళ్లు అందించాయి.
భారతీయ రైల్వేలు ఆక్సిజన్ సరఫరా స్థానాలతో వేర్వేరు మార్గాలను మ్యాప్ చేశాయి. రాష్ట్రాల యొక్క ఏవైనా అభివృద్ధి అవసరాలకు సిద్ధంగా ఉన్నాయి. ఎల్ఎంఓను తీసుకురావడానికి రాష్ట్రాలు భారత రైల్వేకు ట్యాంకర్లను అందిస్తున్నాయి. భారత రైల్వే పశ్చిమంలోని హపా, బరోడా, ముంద్రా, తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుల్ వంటి ప్రదేశాల నుండి ఆక్సిజన్ తీసుకొని దానిని ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ & అస్సాం రాష్ట్రాలకు సంక్లిష్ట కార్యాచరణ మార్గ ప్రణాళిక దృశ్యాల మధ్య ఆక్సిజన్ను రవాణా చేస్తున్నాయి. రాష్ట్రాలకు ప్రాణ వాయువు ఉపశమనం సాధ్యమైనంత వేగంగా చేరుకునేలా చూడటానికి, రైల్వే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ఫ్రైట్ రైళ్లను నడపడంలో కొత్త ప్రమాణాలను, అపూర్వమైన సరికిత్త బెంచ్ మార్క్‌ను సృష్టిస్తోంది. ఈ క్లిష్టమైన సరుకు రవాణా రైళ్ల సగటు వేగం చాలా సందర్భాలలో 55 కన్నా ఎక్కవగా ఉంది. అధిక ప్రాధాన్యత కలిగిన గ్రీన్ కారిడార్లో, అత్యవసర భావనతో, వివిధ మండలాల కార్యాచరణ బృందాలు చాలా సవాళ్ల‌తో కూడిన‌ పరిస్థితులలో నిరంతరాయంగా పని చేస్తున్నాయి. ఆక్సిజన్ వేగంగా సాధ్యమమైన వ్యవధిలో చేరుకునే నిర్ధారించుకోవడానికి చర్యలు చేపడుతోంది. వివిధ విభాగాలపై సిబ్బంది మార్పుల కోసం సాంకేతిక నిలుపుదలను దాదాపు ఒక నిమిషానికి తగ్గించారు. రైల్వే ట్రాక్‌లు తెరిచి ఉంచి పూర్తి అప్రమత్తతను నిర్వహిస్తున్నారు.
ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ జిప్ చేయకుండా ఉండేందుకు గాను అధిక అప్రమత్తతను నిర్వహిస్తుంది. ఇతర సరుకుల రవాణా వేగం తగ్గని రీతిలో ప్రాణ వాయువు రవాణా జరుగుతోంది. కొత్త ఆక్సిజన్ వాయువు రవాణా అమలు చేయడం చాలా క్లిషమైన క‌స‌ర‌త్తు, గణాంకాలూ ఎప్పటికప్పుడుగా నవీకరించబడుతున్నాయి. మరిన్ని లోడ్ చేయబడిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాత్రి తరువాత తమతమ గమ్య స్థానాలకు ప్రయాణాలను ప్రారంభిస్తాయ‌ని భావిస్తున్నారు.

 

***


(Release ID: 1728577) Visitor Counter : 195