పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

పర్యావరణ రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న - భారత్, భూటాన్ దేశాలు


Posted On: 18 JUN 2021 9:21PM by PIB Hyderabad

భారత్, భూటాన్ దేశాలు పర్యావరణ రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. భారతదేశం తరఫున, కేంద్ర అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్; భూటాన్ తరఫున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మరియు జాతీయ పర్యావరణ కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ తాండి డోర్జీ, ఈ అవగాహన ఒప్పందంపై - దృశ్య మాధ్యమం ద్వారా సంతకాలు చేశారు.

Image

ఈ సందర్భంగా శ్రీ జవదేకర్ మాట్లాడుతూ, వాతావరణ మార్పు, వ్యర్థ పదార్థాల నిర్వహణ వంటి అంశాలకు సంబంధించి, ద్వైపాక్షిక సహకారంలో కొత్త మార్గాలకు, ఈ అవగాహన ఒప్పందం, అవకాశం కల్పించనుందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాన్ని ఒక ప్రతీకగా ఆయన అభివర్ణిస్తూ, వాతావరణ మార్పులతో సహా పర్యావరణ సంబంధిత సమస్యలపై భూటాన్‌తో చర్చలు జరపాలని భారత్ కోరుకుంటోందని, తెలియజేశారు.

Image

భారత్, భూటాన్ దేశాల మధ్య భాగస్వామ్యం మరియు మద్దతును మరింత పెంచడానికి, వాయు కాలుష్యం నివారణ, వ్యర్థ పదార్థాల నిర్వహణ, రసాయన నిర్వహణ, వాతావరణ మార్పు మొదలైన రంగాలలో ఉత్తమ పద్ధతులను ఇచ్చి పుచ్చుకోడానికీ ఈ అవగాహన ఒప్పందం ఒక వేదికగా నిలుస్తుంది. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశాలను కూడా ఈ ఒప్పందం కల్పిస్తుంది. శాస్త్ర, సాంకేతిక, నిర్వహణ సామర్థ్యాలను ఈ అవగాహన ఒప్పందం బలోపేతం చేయడంతో పాటు, ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి వీలుగా పర్యావరణ రంగంలో సహకారాన్ని కూడా ఈ ఒప్పందం విస్తరించనుంది.

 

 

 

*****

 



(Release ID: 1728421) Visitor Counter : 214


Read this release in: English , Urdu , Marathi , Hindi