వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఇండో-ఇజ్రాయెల్ వ్యవసాయ ప్రాజెక్టు కింద కర్ణాటకలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన
ఇజ్రాయెల్ వ్యవసాయ-సాంకేతిక పరిజ్ఞానం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది
రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సహాయపడతాయి - శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
Posted On:
16 JUN 2021 4:14PM by PIB Hyderabad
ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యానవన రంగాన్నిముందుకు తీసుకెళ్లేందుకు, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బి.ఎస్.యడ్యూరప్ప, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్ (ఐఐఏపి) కింద కర్ణాటకలో ఏర్పాటు చేసిన 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఇఇ) లను సంయుక్తంగా ప్రారంభించారు.
వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకి చెందిన ఎంఐడిహెచ్ విభాగం, కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ అభివృద్ధి సహకారానికి ఇజ్రాయెల్ కి చెందిన ఏజెన్సీ - మాషవ్ - 12 రాష్ట్రాలలో 29 ఆపరేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఇఇ) తో, అధునాతన ఇజ్రాయెల్ వ్యవసాయ- సాంకేతికత స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఇజ్రాయెల్ కి చెందిన అతిపెద్ద జి 2 జి సహకారానికి నాయకత్వం వహిస్తున్నాయి, .
ఈ 29 పూర్తిగా పనిచేసే సిఓఈ లలో 3 కర్ణాటక నుండే ఉన్నాయి.. అవి, మామిడి కి సంబంధించి సిఓఈ కోలార్, దానిమ్మ సంబంధించి సిఓఈ బాగల్‌కోట్, కూరగాయలకు సంబంధించి సిఓఈ ధార్వాడ్. ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ తగిన పరిజ్ఞానాన్నిఅందించడం, ఉత్తమ పద్ధతులను ప్రదర్శించడంతో పాటు అధికారులు, రైతులకు శిక్షణ ఇస్తాయి. వినూత్న సాంకేతిక పరిజ్ఞానాలను బదిలీ చేయడానికి కర్ణాటకలో ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్ (ఐఐఏపి) కింద ఈ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఓఈ లు) ఏర్పాటుకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయం అందించినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బిఎస్ యెడియరప్ప కేంద్ర ప్రభుత్వానికి, ఇజ్రాయెల్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యానవన ఉత్పత్తుల, ఉత్పాదకత, నాణ్యతను మెరుగుపరచడానికి, రైతుల సుస్థిరతను సాధించడానికి మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి వీటిని ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, “ఈ కేంద్రాలు కర్ణాటక వ్యవసాయ సమాజానికి సరికొత్త వినూత్న ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందటానికి సహాయపడతాయి మరియు ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి వాటిని అవలంబించడం రైతుల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఈ సిఓఈలు ఏటా 50,000 అంటు మొక్కల ఉత్పత్తి, 25 లక్షల కూరగాయల మొలకల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఉద్యానవనంలో ఆధునిక సాగు పద్ధతుల గురించి అవగాహన పొందడానికి సుమారు 20,000 మంది రైతులు ఈ సిఓఈ లను సందర్శించారు ” అని అన్నారు.
కర్ణాటక రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమల మంత్రి శ్రీ ఆర్. శంకర్ మాట్లాడుతూ “కర్ణాటకలో ఉద్యానవన ఉత్పత్తుల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి పంట ఉత్పత్తి మరియు పంటకోత నిర్వహణలో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడానికి, ఇండో ఇజ్రాయెల్ వ్యవసాయ ప్రాజెక్టు (ఐఐఏపి) కింద కోలార్‌లో మామిడి కేంద్రాలు, బాగల్‌కోట్‌లో దానిమ్మ మరియు ధార్వాడ్‌లోని కూరగాయల స్థాపనకు కేంద్ర ప్రభుత్వము, ఇజ్రాయెల్ సహాయపడ్డాయి. ఈ కేంద్రాలు అభివృద్ధి చేసిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి కర్ణాటక రైతులు చాలా ప్రగతిశీలంగా ఉన్నారు. ఉత్పత్తి పెరుగుదల, ఉత్పాదకత ఇన్పుట్ వ్యయాన్ని తగ్గించడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచుతుంది" అని చెప్పారు.
భారత్ లో ఇజ్రాయెల్ రాయబారి డాక్టర్ రాన్ మల్కా మాట్లాడుతూ, “ఇండో-ఇజ్రాయెల్ భాగస్వామ్యంలో ముఖ్యమైన భాగమైన వ్యవసాయంలో కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నందుకు మాకు గర్వంగాను, సంతోషంగా ఉంది. మన దేశాల మధ్య సంబంధాలు వేగంగా బలోపేతం అవుతున్న తరుణంలో ఈ రోజు మనం మూడు వేర్వేరు కేంద్రాలను ప్రారంభించాము. ఇది రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధిలో ఒక మైలురాయి, మరియు స్థానిక రైతులకు జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వాన్ని ఇస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికతకు అనుగుణంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది" అని అన్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత ప్రభుత్వ వ్యవసాయ, సహకారం, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ అగర్వాల్, ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, కర్ణాటక ప్రభుత్వం అధికారులు పాల్గొన్నారు. అన్ని రాష్ట్ర ఉద్యానవన మిషన్ల సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో వర్చ్యువల్ గా పాల్గొన్నారు.
*****
(Release ID: 1727707)
Visitor Counter : 202