శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

రోగులను తాకకుండా వారి ఆరోగ్య స్థితిని అంచనా వేసే మానిటర్ ను అభివృద్ధి చేసిన అంకుర సంస్థ

Posted On: 14 JUN 2021 4:09PM by PIB Hyderabad

రోగులను తాకకుండానే వారి ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే మానిటర్ ను బయో టెక్నాలజీ శాఖ దాని అనుబంధ ప్రభుత్వ రంగ సంస్థ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్) సమకూర్చిన నిధులతో ఏర్పాటైన అంకుర సంస్థ 'డోజీ' అభివృద్ధి చేసింది. ఇప్పటికే సంస్థ అభివృద్ధి చేసిన మానిటర్ వ్యవస్థ దేశంలోని 35 జిల్లాలలోని 4,000 ఆసుపత్రుల్లో ఏర్పాటయింది. ఈ వ్యవస్థతో ఈ ఆసుపత్రుల్లోని సాధారణ పడకలు ఐసీయూ పడకలుగా రోగులకు అందుబాటులోకి వచ్చాయి. ' డోజీ' రూపొందించిన వ్యవస్థతో దేశవ్యాపితంగా 30,000 రోగులకు ప్రయోజనం కలిగింది. దీనితోపాటు 65,000 నాసింగ్ పని గంటలు ఆదా అయ్యాయి. రోగి ఆరోగ్య పరిస్థితిని ముందుగానే గుర్తించడం వల్ల 750 మందిని చికిత్స కోసం ఐసీయూ కి తరలించడానికి అవకాశం కలిగింది. 

"డోజీ' అభివృద్ధి చేసిన మోనిటరింగ్ వ్యవస్థవల్ల ఆసుపత్రుల్లో వుండే సాధారణ పడకను ఐసీయూ పడకగా సులువుగా మార్చడానికి వీలవుతుంది.'డోజీ' రూపొందించిన పరికరాన్ని రోగి పరుపు కింద అమరుస్తారు. ఇది  బల్లిస్టోకార్డియోగ్రఫీ విధానాన్ని ఉపయోగిస్తూ రోగి  గుండె కొట్టుకోవడం మరియు శ్వాసక్రియ తీసుకోవడం వల్ల వెలువడే తరంగాలను వుపయోగించి పనితీరును అంచనా వేస్తుంది. కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తూ ఈ వ్యవస్థ తానూ సేకరించిన సమాచారాన్ని గుండె కొట్టుకుంటున్న వేగం, శ్వాస తీసుకుంటున్న పద్దతి, రక్తపోటు సంకేతాలను వెలువరిస్తుంది. ఈ పరికరం ద్వారా లభిస్తున్న సంకేతాలు 98.4%వరకు ఖచ్చితంగా ఉంటున్నాయని పరీక్షల్లో వెల్లడయ్యింది. అనుబంధ పరికరాలను ఉపయోగిస్తూ ఈ పరికరం ఆక్సిజన్ స్థాయి, ఈసీజీ లను కూడా నమోదు చేస్తుంది. ఈ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్ వుహాన్ లో కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. 

ముందుగానే హెచ్చరికలను జారీచేసే సౌకర్యాన్ని కూడా డోజీలో అమర్చారు. దీనితో నర్సింగ్ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గడమే కాకుండా ముందుగానే డాక్టర్లు అప్రమత్తం అవడానికి వీలవుతుంది. రోగులకు తక్షణం వైద్య సౌకర్యం అందుతుంది. వైర్లు, ఎలక్ట్రోడ్ల వల్ల రోగికి  అసౌకర్యంగా  లేకుండా 'డోజీ'ని ఏర్పాటుచేస్తారు. దీనితో రోగికి మరింత మెరుగైన వైద్యసేవలను అందించడానికి వీలవుతుంది. 

ప్రతి వ్యక్తికి మెరుగైన వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో 'డోజీ' సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే అంశంపై దృష్టిసారించి పనిచేస్తోంది. 50,000 సాధారణ పడకలను ఐసీయూ పడకలుగా మార్చడానికి అవసరమైన సహకారాన్ని అందించాలని సంస్థ నిర్ణయించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి సిఎస్ఆర్ నిధులనుసమీకరించాలని సంస్థ భావిస్తోంది. దీనివల్ల కోవిడ్-19 లాంటి పరిస్థితుల్లో రోగులకు అత్యవసర వైద్యాన్ని అందించి దేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకుని రావడానికి అవకాశం కలుగుతుంది. 

 బిగ్సీడ్లీప్బయోనెస్ట్ లాంటి  వివిధ కార్యక్రమాల ద్వారా డిబిటిబిరాక్ లు  డోజీకి సహకారం అందిస్తున్నాయి. 

డిబిటి గురించి

 

 వ్యవసాయంఆరోగ్య సంరక్షణజంతు శాస్త్రాలుపర్యావరణం మరియు పరిశ్రమలలో విస్తరణ, అమలు ద్వారా భారతదేశంలో బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బయోటెక్నాలజీ (డిబిటి) ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

 

  బిరాక్   గురించి

 

 బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిరాక్) ని  బయోటెక్నాలజీ (డిబిటి) లాభాపేక్షలేని విభాగం 8, షెడ్యూల్ బిగా నెలకొల్పింది. దేశాభివృద్ధికి దోహదపడే బయోటెక్నాలజీ రంగంలో   వ్యూహాత్మక పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలను  బిరాక్  ప్రోత్సహిస్తోంది.

 

***



(Release ID: 1727087) Visitor Counter : 217