ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఎన్ఐసి ఇమెయిల్ వ్యవస్థలో సైబర్ ఉల్లంఘనలేవీ జరగలేదని స్పష్టం చేసిన ప్రభుత్వం
Posted On:
13 JUN 2021 7:13PM by PIB Hyderabad
ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్, డోమినోస్ వంటి సంస్థలలో డాటా ఉల్లంఘనల ప్రభావంపై మీడియా కథనం ఒకటి ఈ ఉల్లంఘనలు హ్యాకర్లకు ఇమెయిల్ అకౌంట్లను, ఎన్ ఐసి ఇమెయిళ్ళ పాస్‌వర్డ్‌లను బహిర్గతం చేశాయని పేర్కొంది.
ఈ నేపథ్యంలో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) నిర్వహించే భారత ప్రభుత్వ ఇమెయిల్ వ్యవస్థలో ఎటువంటి సైబర్ ఉల్లంఘన జరగలేదనే విషయాన్ని మొదటగా స్పష్టం చేయడం ముఖయం. ఇమెయిల్ వ్యవస్థ పూర్తి సురక్షితం, భద్రం.
రెండవది, ఈ పోర్టళ్ళపై తమ ప్రభుత్వ ఇమెయిల్ అడ్రెస్ ఉపయోగించి నమోదు చేసుకుని, ప్రభుత్వ ఇమెయిల్ అకౌంట్‌కు ఉపయోగించే పాస్‌వర్డ్ నే ఉపయోగిస్తే తప్ప బాహ్య పోర్టళ్ళ సైబర్ భద్రత ఉల్లంఘన అనేది ప్రభుత్వ ఇమెయిల్ సేవలను ప్రభావవితం చేయదు.
ఎన్ఐసి ఇమెయిల్ వ్యవస్థ రెండు కారకాల ప్రామాణీకరణ, 90 రోజుల్లో పాస్ వర్డ్ మార్పు వంటి పలు భద్రతా చర్యలను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, ఎన్ఐసి ఇమెయిల్‌కు పాస్ వర్డ్ మార్పుకు మొబైల్ ఒటిపి అవసరం. ఒకవేళ మొబైల్ ఒటిపి తప్పయితే, పాస్‌వర్డ్ మార్పు సాధ్యం కాదు. ఎన్ఐసి ఇమెయిల్‌ను ఉపయోగించే చేసే ఫిషింగ్ ప్రయత్నాన్ని దేనినైనా ఎన్ఐసి నివారించగలదు. క్రమం తప్పకుండా ఎన్ఐసి యూజర్ల చైతన్యం కోసం కార్యక్రమాలను నిర్వహిస్తూ, సంభావ్య ప్రమాదాలు, రక్షణ ప్రోటోకాళ్ళ గురించి తాజా పరుస్తుంటుంది.
***
(Release ID: 1726838)
Visitor Counter : 239