జల శక్తి మంత్రిత్వ శాఖ
ఉత్తరప్రదేశ్కు ఉత్తరప్రదేశ్ కు 2021-22లో జల్ జీవన్ మిషన్ కింద 10,870 కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం
హర్ ఘర్ జల్' సాధనకు నాలుగు రేట్లు అధికంగా నిధుల విడుదల
60,000 గ్రామాల్లో 78 లక్షలఇళ్లకు పైపుల ద్వారా నీరు సరఫరా చేయడానికి పనులకు జల్ శక్తి మంత్రిత్వశాఖ ఆమోదం
సీసం, ఫ్లోరైడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న177 ప్రాంతాల్లో కొళాయి ద్వారా నీరు సరఫరా చేయడానికి కేంద్రం ప్రాధాన్యత
Posted On:
12 JUN 2021 6:04PM by PIB Hyderabad
ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరు సరఫరా కావాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ ఆశయాన్ని సాకారం చేయడానికి జల్ జీవన్ మిషన్ పథకాన్ని చేయడానికి కేంద్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 10,870.50 కోట్ల రూపాయలను కేటాయించింది. 2019-20లో రాష్ట్రానికి 1,206 కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం 2020-21లో 2,571కోట్ల రూపాయలను కేటాయించింది. దీనితో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ కింద కేంద్రం కేటాయించిన నాలుగు రేట్లు పెరిగినట్టు అయ్యింది.
జల్ జీవన్ మిషన్ కింద గ్రామీణప్రాంతాల్లో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరు సరఫరా చేయడానికి రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఇటీవల తనను కలసిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి కేంద్ర జలశక్తిశాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి ప్రకటించిన విధంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి 2024నాటికి కొళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేస్తామని కేంద్ర మంత్రికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఉత్తర ప్రదేశ్‌లో 97 వేల గ్రామాల్లో 2.63 కోట్ల కుటుంబాలు ఉన్నాయి, వీటిలో ఇప్పుడు 30.04 లక్షల (11.3%) కుటుంబాలు తమ ఇళ్లకు పంపు నీటి సరఫరా కలిగి ఉన్నారు. జల్ జీవన్ మిషన్ ప్రారంభించటానికి ముందు 5.16 లక్షల (1.96%) గృహాలకు మాత్రమే కొళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేది. గత 21 నెలల్లో జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రం 24.89 లక్షల (9.45%) గృహాలకు కొళాయి కనెక్షన్లను అందించింది. అయినప్పటికీ, ఉత్తర ప్రదేశ్‌లో కొళాయి ద్వారా నీటి సరఫరా లేకుండా ఇప్పటికీ సుమారు 2.33 కోట్ల గృహాలు ఉన్నాయి.
2020-21లో యుపికి కేటాయింపులను రూ .2,571 కోట్లకు పెంచారు. ప్రారంభ బ్యాలెన్స్‌తో రూ. 777 కోట్లతో ,కేంద్ర నిధులుగామొత్తం 3,348 కోట్ల రూపాయలురాష్ట్రానికి అందుబాటులో ఉంటాయి. వీటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం 2,053 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి అవకాశం ఉంది.
జల్ జీవన్ మిషన్ అమలును వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, మిగిలిన మూడింట ఒక వంతు గృహాలకు( 78 లక్షల గ్రామీణ కుటుంబాలు) కుళాయి ద్వారా నీటి సరఫరాను చేయాలని కేంద్ర మంత్రి జల్ శక్తి శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరారు. ఈ ఏడాది 60 వేలకు పైగా గ్రామాల్లో నీటి సరఫరా ప్రాజెక్టులు / పథకాల పనులు ప్రారంభించాలని ఆయన రాష్ట్రానికి సూచించారు.
బుందేల్‌ఖండ్ మరియు వింధ్యచల్‌లో పైపుల నీటి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, ముఖ్యమంత్రి స్థాయిలో వాటి అమలుపై సమీక్షించాలని తన లేఖలో కేంద్ర మంత్రి జల్ శక్తి శ్రీ గజేంద్ర సింగ్ శేఖవత్ కోరారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలకు (7 జిల్లాలు ఝాన్సీ , మహోబా, లలిత్‌పూర్, జలాన్, హమీర్‌పూర్, బండా మరియు చిత్రకూట్) పైపుల నీటి సరఫరా పథకానికి 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వింధ్యచల్ ప్రాంతంలోని మీర్జాపూర్ మరియు సోన్‌భద్ర జిల్లాలకు గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టుల పనులకు ప్రధాని 2020 నవంబర్‌లో ప్రధాని శంఖుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతంలోని 6,742 గ్రామాల్లో నివసిస్తున్న 17.48 లక్షల గృహాలకు, 1.05 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది.
ఓపెనింగ్ బ్యాలెన్స్ రూ. 466 కోట్లతో పాటు కేంద్ర కేటాయింపులతో 2021-22లో రూ. 10,870 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వంకి అందుబాటులో ఉంటాయి. 2021-22లో రాష్ట్ర వాటా, రూ. 1,263 కోట్లు మిగులుతో 2019-20, 2020-21లో రాష్ట్రంలో జెజెఎం అమలుకు అందుబాటులో ఉన్న మొత్తం హామీ నిధి సుమారు రూ. 23,937 కోట్ల వరకు ఉంటాయి.
2021-22లో 15వ ఆర్ధిక సంఘం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గ్రామీణ స్థానిక సంస్థలు/ పంచాయతీరాజ్ సంస్థల్లో నీటి సరఫరా పారిశుధ్య కార్యక్రమాల కోసం 4,324 కోట్ల రూపాయలను కేటాయించింది. 2025-26వరకు ఈ కార్యక్రమాల కోసం 22,808 కోట్ల రూపాయల కేటాయింపులు లభిస్తాయి. ఉత్తర ప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ భారీ పెట్టుబడి ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి కల్పిస్తుంది . ఇది గ్రామాల్లో నూతన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.
నీటి నాణ్యత ప్రభావిత నివాసాలు, ఎస్సీ / ఎస్టీ మెజారిటీ గ్రామాలు, సాగి గ్రామాలు, ఆశాజనక జెఇ / ఎఇఎస్ ప్రభావిత జిల్లాలకు జల్ జీవన్ మిషన్ లో ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. దీనితో ఈ తరగతిలోకి వచ్చే గ్రామాలు / ప్రాంతాలలోని అన్ని గృహాలకు 2021-22 చివరి నాటికి కుళాయి ద్వారా నీరు అందించాలి. రాష్ట్రంలో 53 ప్రాంతాల్లో ఫ్లోరైడ్,124 ఆర్సెనిక్ప్రభావం ఉందని గుర్తించారు. వారిలో ఎక్కువ మందికి రోజుకు 8-10 లీటర్ల చొప్పున నీటి శుద్ధి కర్మాగారాలు (సిడబ్ల్యుపిపి) ద్వారా సురక్షితమైన నీటిని అందిస్తున్నారు. ఈ సంవత్సరంలో రోజుకు 55 లీటర్ల తలసరి చొప్పున ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న 2.5 లక్షల మందికి సురక్షితమైన పంపు నీటి సరఫరా జరిగేలా చూడాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది.
తగినంత భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న ఇండో-గాంగెటిక్ బెల్ట్‌లో ప్రతి ఇంటికి గొట్టపు బావులు , ఓవర్‌హెడ్ ట్యాంక్ మరియు పైపుల నీటి కనెక్షన్‌లతో గ్రామానికి మొత్తంగా నీటి సరఫరా పథకాలను రూపొందించి ఈ సంవత్సరంలోనే పూర్తి చేయవచ్చునని కేంద్రం సూచించింది.
పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు సురక్షితమైన తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 100 రోజుల ప్రచారాన్ని ప్రకటించారు, దీనిని 2020 అక్టోబర్ 2 న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ మరియు రాష్ట్ర మంత్రి శ్రీ రత్తన్ లాల్ కటారియా ప్రారంభించారు. దీనిని వేగంతో అమలుచేసిన రాష్ట్రం 98,699 (80%) గ్రామీణ పాఠశాలలు, 45,807 (23%) అంగన్‌వాడీ కేంద్రాలకు పంపు నీటి సరఫరాను అందించింది. మెరుగైన ఆరోగ్యం మరియు పిల్లల జీవన ప్రమాణాల కోసం అన్ని పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాల్లో సురక్షితమైన పంపు నీటి సరఫరా ఉండేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ 'సబ్కాసాత్, సబ్కా వికాస్ మరియు సబ్కా విశ్వస్' లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి పంపు నీటి సరఫరా జరిగేలా చూడాలన్న లక్ష్యంతో అమలు జరుగుతున్న జల్ జీవన్ మిషన్ ఈ సూత్రానికి ఉత్తమ ఉదాహరణలలో ఒకటిగా ఉంటుంది. దిగువ నుంచి పైకి అమలు జరిగే ఈ పథకంలో ప్రజలు కీలక పాత్ర పోషిస్తారు . వారు అందుబాటులో ఉన్న నీటి వనరులనుగుర్తించి గ్రామంలోని అవసరాన్ని బట్టి, ప్రజారోగ్య ఇంజనీర్ల సాంకేతిక సహకారంతో ప్రణాళికను సిద్ధం చేస్తారు. ఈ ప్రణాళికను గ్రామసభలో చర్చించి ఆమోదం పొందవలసి ఉంటుంది. దీనితో, ప్రతి గ్రామంలో గ్రామాలలో నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, అమలు, నిర్వహణలో చురుకైన పాత్ర పోషించడానికి గ్రామ నీటి పారిశుధ్య కమిటీలు (విడబ్ల్యుఎస్సి) ఏర్పాటు కావలసి ఉంటుంది. 15 ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామాల్లో నీటి సరఫరా పారిశుధ్య కమిటీలను పటిష్టం చేసి, కార్యక్రమాలను అమలు చేయడానికి స్వచ్చంధ సంస్థల సహకారాన్ని తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పించడానికి కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ లోని 97,455 గ్రామాలలో కేవలం 18,142 గ్రామాలకు మాత్రమే కొళాయి ద్వారా నీరు సరఫరా అవుతోంది. 6,491 గ్రామాల్లో పనులు వివిధ దశల్లో వున్నాయి. పైపుల ద్వారా నీరు సరఫరా చేయడానికి 8,661 గ్రామాల్లో పనులను చేపట్టవలసి ఉన్నందున ఈ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. పైపుల ద్వారా నీరు సరఫరా అవుతున్న గ్రామాల్లో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆయన సూచించారు. ఉత్తరప్రదేశ్ లో 87,974 గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ పనులను ప్రారంభించవలసి వుంది.
నీటి నాణ్యతను పరిశీలన, నిర్వహణా కార్యక్రమాలను చేపట్టే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ దీనికోసం ప్రతి గ్రామంలో అయిదుగురు మహిళలకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. వీరు నీటి వనరులను ఫీల్డ్ టెస్ట్ కిట్స్ (ఎఫ్‌టికె) ను ఉపయోగిస్తూ స్వతంత్రంగా పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. నీటి నాణ్యత పరిశోధనా సంస్థల స్థాయిని పెంచి వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడానికి చర్యలను అమలు చేయవలసి ఉంటుంది. రాష్ట్రంలో వున్న 89 పరిశోధనాశాలల్లో కేవెలం ఒకదానికి మాత్రమే ఎన్ఏబిఎల్ గుర్తింపు వుంది. జిల్లా స్థాయిలో 75 పరిశోధనాశాలలకు ఈ ఏడాది ఎన్ఏబిఎల్ గుర్తింపు పొందడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ సహకారంతో జల్ జీవన్ మిషన్ నిర్వహిస్తున్న గ్రాండ్ టెక్నాలజీ ఛాలెంజ్‌లో భాగంగా బాగ్‌పట్ జిల్లాలోని 10 గ్రామాల్లో సేవకు ప్రాధాన్యత ఇస్తూ 'ఆన్‌లైన్ కొలత, పర్యవేక్షణ వ్యవస్థ ను ప్రారంభించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. గ్రామంలో నీటి సరఫరా దెబ్బతిన్నప్పుడు 'ఆన్‌లైన్ వ్యవస్థ' హెచ్చరికలను జారీ చేస్తుంది. దీనితో సకాలంలో దిద్దుబాటు చర్యల అమలు చేయడానికి అవకాశం కలుగుతుంది. గ్రామాల్లో వీటిని ఈ నెలలో నెలకొల్పుతారు.
రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించడానికి జాతీయ జల్ జీవన్ మిషన్ యునైటెడ్ నేషన్స్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ ను ఎంపిక చేసింది. ప్రజలను సమీకరించే అంశంలో యునైటెడ్ నేషన్స్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ సహకరిస్తుంది. గ్రామాల్లో అమలు చేసే కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన, అమలు తదితర అంశాల్లో యునైటెడ్ నేషన్స్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ తన సహకారాన్ని అందిస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని 11 జిల్లాలలోని(బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని 7 జిల్లాలు, వింధ్యచల్ ప్రాంతంలోని 2 జిల్లాలు, ప్రయాగ్రాజ్, కౌశంబి జిల్లాలు) 137 యునైటెడ్ నేషన్స్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ తన సిబ్బందిని నియమించి నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో నీటి సరఫరాను మెరుగుపరచడానికి జరుగుతున్న ప్రయత్నాలకు సహకారం అందిస్తుంది. రాష్త్ర ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి మరికొన్ని సంస్థలు ముందుకు
వస్తున్నాయి.
జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ 2029 ఆగస్ట్ 15వ తేదీన ప్రారంభించారు. 2024 నాటికి దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో ఈ పథకం అమలు జరుగుతోంది. 2021-22 బడ్జెట్ లో ఈ పథకానికి 50,011 కోట్ల రూపాయలను కేటాయించారు. రాస్త్రాలు తమ వాటాగా 26,940 కోట్ల రోపాయలను సమకూరుస్తున్నాయి. వీటితో పాటు 15వ ఆర్ధిక సంఘం విడుదల చేయనున్న నిధులతో కలిపి గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమంపై ఈ ఏడాది లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయడం జరుగుతుంది. దీనితో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
***
(Release ID: 1726685)
Visitor Counter : 207