బొగ్గు మంత్రిత్వ శాఖ
కోవిడ్‌పై పోరాటానికి మద్దతుగా ఎంపి ప్రభుత్వానికి రూ. 10 కోట్లను విరాళంగా ఇచ్చిన ఎన్‌సిఎల్
భోపాల్ ఎయిమ్స్ లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రూ. 1.75 కోట్ల సాయాన్ని అందించిన ఎన్‌సిఎల్
Posted On:
11 JUN 2021 6:51PM by PIB Hyderabad
రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలల్లో 5 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పేందుకు మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)లో భాగంగా నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సిఎల్) రూ. 10 కోట్లను విరాళంగా ఇచ్చింది. ఎన్‌సిఎల్ సిఎండి ప్రభాత్ కుమార్ సిన్హా శుక్రవారం నాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు చెక్కును అందచేశారు. కోవిడ్ 19కి వ్యతిరేకంగా రాష్ట్రం చేస్తున్న పోరాటానికి ఇది తోడ్పాటు అందించనుంది.
ఈ నేపథ్యంలో సిఎండి సిన్హా ముఖ్యమంత్రికి ఎన్‌సిఎల్ గురించి, రాష్ట్రంలో దాని కార్యకలాపాల గురించి వివరించారు. సింగ్రౌలీ ప్రాంతంలో కంపెనీ చేపట్టిన సిఎస్ ఆర్ కార్యకలాపాలు, ఆ ప్రాంతంలో కలుపుకుపోయే వృద్ధి కోసం చేపడుతున్న భారీ ప్రాజెక్టు గురించి తెలిపారు. కోవిడ్ 19 మహమ్మారిని అంతం చేసేందుకు ఎన్‌సిఎల్ చేపట్టిన చర్యలను కూడా సిఎండి వివరించారు. దేశం ఇంధన రంగానికి ఎన్‌సిఎల్ అందిస్తున్న తోడ్పాటును, కోవిడ్ మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రేరిత పరీక్షా సమయంలో ఎన్‌సిఎల్ కృషిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఎన్‌సిఎల్‌కు మద్దతునిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆరోగ్యసంరక్షణ మౌలికసదుపాయాలను ఆధునీకరించడం కోసం ఎంపి ప్రభుత్వం కింద పని చేస్తున్న ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖకు రూ. 10 కోట్ల మొత్తాన్ని అందించారు. దీనితోపాటుగా, ఎయిమ్స్, భోపాల్‌లో సిఎస్ఆర్ చొరవల కింద రోగులకు చికిత్సను అందించేందుకై ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పేందుకు రూ. 1.75 కోట్ల రూపాయిల ఆర్థిక సహాయాన్ని కూడా కంపెనీ అందించింది.
దీనితోపాటుగా ఎన్‌సిఎల్ సింగ్రౌలీ జిల్లా యంత్రాంగం కోవిడ్‌పై పోరాటంలో భాగంగా రూ. 7 కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, ఇతర అవసరమైన సౌకర్యాల ఏర్పాటు సహా వైద్య మౌలికపదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ఎన్‌సిఎల్ సహాయం చేస్తోంది. గతంలో ఎన్‌సిఎల్ కోవిడ్-19 మహమ్మారిపై పోరాటం చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్‌సిఎల్ రూ. 20 కోట్ల మొత్తాన్ని విరాళంగా అందించింది.
సింగ్రౌలీ ప్రాంతంలో ని గ్రామాలలో నివసిస్తున్న 1లక్ష మంది జనాభాకు బహిరంగ ప్రదేశాల శానిటైజేషన్, రేషన్ కిట్ల పంపిణీ, మాస్కులు, శానిటైజర్లు, మెడికల్ కిట్లు, వైద్య పరికరాలు తదితరమమైన అత్యవసర సౌకర్యాలను కూడా ఎన్‌సిఎల్ అందించింది. కోవిడ్ రోగుల చికిత్స కోసం, సిబ్బందికి, స్థానికులకు సేవలను అందించేందుకు బలమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను రికార్డు సమయంలో అభివృద్ధి చేసింది.
భారత ప్రభుత్వానికి చెందిన మినీరత్న కంపెనీ ఎన్‌సిఎల్. సంస్థ. అత్యంత యాంత్రిక బొగ్గు గనుల నుంచి ఏడాదికి 115 మెట్రిక్ టన్నులను తవ్వి తీస్తుంది. ఇందులో 6 ఓపెన్‌కాస్ట్ గనులు మధ్యప్రదేశ్‌లో కార్యకలాపాలు సాగిస్తూ, కంపెనీ ఉత్పత్తి చేసే బొగ్గులో దాదాపు 85%కి దోహదం చేస్తాయి.
మొత్తం బొగ్గు ఉత్పత్తిలో ఎన్‌సిఎల్ 15 శాతం దోహదం చేయడం ద్వారా దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 10% ఉత్పాదన చేస్తుంది.
***
(Release ID: 1726411)
Visitor Counter : 237