చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సంజయ్ యాదవ్
Posted On:
10 JUN 2021 6:18PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 217 క్లాజ్ (1) ద్వారా ఇచ్చిన అధికారాన్ని వినియోగిస్తూ, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజయ్ యాదవ్‌ను అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఇది ఆయన ఎప్పుడు బాధ్యతలను స్వీకరిస్తే అప్పటి నుంచి అమలులోకి రానుంది. ఈ మేరకు శాసన& న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన న్యాయశాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
న్యాయవాదిగా 25.08.1986 జస్టిస్ సంజయ్ యాదవ్, ఎం.ఎ., ఎల్.ఎల్.బి నమోదు చేసుకున్నారు. ఆయన జబల్పూర్‌లో 20 ఏళ్ళపాటు సివిల్, రాజ్యాంగ, శ్రామిక, ఉద్యోగ వ్యవహారాలలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసి, కార్మిక, ఉద్యోగవ్యవహారాలలో స్పెషలైజ్ చేశారు. ఆయన 1999 మార్చి నుంచి 2005 అక్టోబర్ వరకూ ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశారు. వెంటనే, అక్టోబర్ 2005 నుంచే ఆయన డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా ఉన్నారు. ఆయన 2 మార్చి, 2007న మధ్య ప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత 15 జనవరి 2010న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. అనంతరం ఆయన అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తిగా 14.04.2021న నియమించారు.
***
(Release ID: 1726106)
Visitor Counter : 179