రైల్వే మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 27600 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఒను బట్వాడా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ బట్వాడాలను పూర్తి చేసిన 392 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
15 రాష్ట్రాలకు ఊరటను కల్పించేందుకు 1603 ట్యాంకర్లలో ఆక్సిజన్‌ను రవాణా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు
తమిళనాడులో 3700 ఎంటిల ఎల్ఎంఒను దించిన ఆక్సిజన్ ఎక్‌ప్రెస్‌లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరుసగా 3000, 2700, 3300 మెట్రిక్ టన్నులకు పైగా ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఒ)ను ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు బట్వాడా
మహారాష్ట్రలో 614 ఎంటీల ఆక్సిజన్‌ను దించగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో 3797 ఎంటీలు, మధ్యప్రదేశ్‌లో 656 ఎంటీలు, ఢిల్లీలో 5790 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 2212 ఎంటీల, రాజస్థాన్‌కు 98 ఎంటీలు, కర్ణాటకలో 3342 ఎంటీలు, ఉత్తరాఖండ్‌లో 320 ఎంటీలు, తమిళనాడుకు 3773 ఎంటీలు, ఆంధ్రప్రదేశ్‌కు 3049 ఎంటీలు, పంజాబ్‌కు 225 ఎంటిలు, కేరళకు 513 ఎంటీలు, తెలంగాణకు 2765 ఎంటీలు, ఝార్ఖండ్‌కు 38 ఎంటీలు, అస్సాంలో 400 ఎంటీలు
Posted On:
08 JUN 2021 5:30PM by PIB Hyderabad
అన్ని ఆటంకాలను అధిగమించి, నూతన పరిష్కారాలను కనుగొంటూ భారతీయ రైల్వేలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఒ)ను సరఫరా చేయడం ద్వారా ఊరటను కల్పిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
దేశ సేవలో భాగంగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 27000 మెట్రిక్ టన్నులకు పైగా ఎల్ఎంఒను బట్వాడా చేశాయి.
ఇప్పటివరకూ భారతీయ రైల్వేలు దాదాపు 27600 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఒను 1603 ట్యాంకర్ల ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాలకు బట్వాడా చేశాయి.
ఇప్పటివరకూ 392 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని, వివిధ రాష్ట్రాలకు సహాయాన్ని అందించాయి.
ఈ ప్రకటన వెలువడే సమయానికి, 21 ట్యాంకర్లలో 381 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఒను మోసుకుని 4 ఎక్స్‌ప్రెస్‌లు ప్రయాణం సాగిస్తున్నాయి.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా తమిళనాడు 3700 మెట్రిక్ టన్నులకు ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఒ)ను అందచేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరుసగా 3000, 2700, 3300 మెట్రిక్ టన్నులకు పైగా ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఒ)ను ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు బట్వాడా చేశాయి.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ బట్వాడాలను ఏప్రిల్ 24వ తేదీన మహారాష్ట్రకు 126 మెట్రిక్ టన్నులతో ప్రారంభించాయన్న విషయం గమనార్హం.
ఆక్సిజన్ కోరుతున్న రాష్ట్రాలకు సాధ్యమైనంత స్వల్ప సమయంలో ఎల్ఎంఒలను బట్వాడా చేయాలన్నది భారతీయ రైల్వేలు కృషి చేస్తున్నాయి.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, ఝార్ఖండ్, అస్సాం సహా 15 రాష్ట్రాలకు ఆక్సిజన్‌ను బట్వాడా చేశాయి.
ఈ ప్రకటన వెలువడే సమయానికి మహారాష్ట్రలో 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను దించగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో 3797 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్‌లో 656 మెట్రిక్ టన్నులు, ఢిల్లీలో 5790 మెట్రిక్ టన్నులు, హర్యానాకు 2212 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌కు 98 మెట్రిక్ టన్నులు, కర్ణాటకలో 3342 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌లో 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 3773 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 3049 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌కు 225 ఎంటిలు, కేరళకు 513 ఎంటీలు, తెలంగాణకు 2765 ఎంటీలు, ఝార్ఖండ్‌కు 38 ఎంటీలు, అస్సాంలో 400 ఎంటీల ఆక్సిజన్‌ను అందించడం జరిగింది.
నేటివరకూ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలో 39 నగరాలు/ పట్టణాలు - ఉత్తర్‌ప్రదేశ్‌లో లక్నో, వారణాసి, కాన్పూర్, బరేలీ, గోరఖ్‌పూర్ & ఆగ్రాకు, మధ్యప్రదేశ్‌లో సాగర్, జబల్పూర్, కత్ని & భోపాల్‌కు, మహారాష్ట్రలో నాగపూర్, నాసిక్, పూణె, ముంబై, సోలాపూర్‌లో, తెలంగాణలో హైదరాబాద్‌కు, హర్యానాలో ఫరీదాబాద్, గురుగ్రాంలో, ఢిల్లీలోని తుగ్లకాబాద్, ఢిల్లీ కంటోన్మెంట్, ఓఖ్లాలో, రాజస్థాన్‌లో కోటా, కనకపాడలో, కర్ణాటకలో బెంగళూరులో, ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్, ఆంధ్రపదేశ్‌లోని నెల్లూరు, గుంటూరు, తాడిపత్రి, విశాఖపట్నంలో, కేరళలోని ఎర్నాకుళం, తమిళనాడులో తిరువళ్ళూర్, చెన్నై, ట్యూటీకార్న్, కోయంబత్తూర్, మదురైలో, పంజాబ్‌లోని భటిండా, ఫిల్లౌర్, అస్సాంలోని కామరూప్, ఝార్ఖండ్‌లోని రాంచీకి ఆక్సిజన్‌ను చేరవేశాయి.
భారతీయ రైల్వేలు ఆక్సిజన్ సరఫరా ప్రాంతాలతో భిన్నమైన మార్గాలను గుర్తించి, ఎంచి రాష్ట్రాలకు తలెత్తే అవసరాలను తీర్చేందుకు సంసిద్ధంగా ఉంటుంది. ఎల్ఎంఒను మోసుకువచ్చేందుకు భారతీయ రైల్వేలకు రాష్ట్రాలు ట్యాంకర్లను అందిస్తున్నాయి.
దేశంలో నలుమూలలా ప్రయాణిస్తూ, పశ్చిమంలోని హపా, బరోడా, ముంద్ర నుంచి, తూర్పులో రూర్కేలా, దుర్గాపూర్, టాటానగర్, అంగల్ నుంచి ఆక్సిజన్ ను తీసుకుని
ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు సంక్లిష్టమైన కార్యాచరణ మార్గ ప్రణాళిక ద్వారా అందిస్తోంది.
సాధ్యమైనంత వేగంగా ఆక్సిజన్ సాయాన్ని అందించేందుకు, రైల్వేలు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ సరుకు రైళ్ళను నడిపేందుకు నూతన ప్రమాణాలను, ముందెన్నడూ లేని పారామితులను సృష్టిస్తోంది. ఈ కీలకమైన సరుకు రవాణా రైళ్ళ సగటు వేగం దీర్ఘప్రయాణాల్లో సాధారణంగా గంటకు 55 కిమీ పైన ఉంటోంది. అత్యధిక ప్రాధాన్యత కలిగిన గ్రీన్ కారిడార్ ద్వారా అత్యవసర భావనతో వివిధ జోన్లకు చెందిన కార్యాచరణ బృందాలు ఆక్సిజన్ సాధ్యమైనంత వేగంగా అందేందుకు అత్యంత సవాళ్ళతో కూడిన పరిస్థితుల్లో రోజుకు 24 గంటలూ పని చేస్తున్నాయ. వివిధ సెక్షన్లలో సిబ్బంది మారుతున్నందున సాంకేతిక నిలుపుదలలు 1 నిమిషానికి తగ్గించారు.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు దూసుకుపోయేందుకు పట్టాలను ఖాళీగా ఉంచడమే కాక అత్యంత అప్రమత్తతను పాటిస్తున్నారు.
ఇదంతా కూడా ఇతర సరుకు రవాణా కార్యకలాపాల వేగం తగ్గకుండా ఉండే పద్ధతిలో చేస్తున్నారు.
నూతన ఆక్సిజన్‌ను మోసుకుపోవడం అనేది అత్యంత క్రియాశీలక వ్యాయామం, ఎప్పటికప్పుడు గణాంకాలు తాజాపరుస్తున్నారు. ఆక్సిజన్‌ను మోసుకొని మరిన్ని ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఈ రాత్రికి తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి.
***
.
(Release ID: 1725467)
Visitor Counter : 197