భారత పోటీ ప్రోత్సాహక సంఘం

ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్‌లో నిర్దిష్ట వాటాను బైజూస్‌ సొంతం చేసుకోవటానికి, తర్వాత బైజూస్‌లో ఏఈఎస్‌ఎల్‌ విలీనానికి సీసీఐ ఆమోదం

Posted On: 08 JUN 2021 5:44PM by PIB Hyderabad

ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్‌ (ఏఈఎస్‌ఎల్‌)లో నిర్దిష్ట వాటాను థింక్‌ & లెర్న్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బైజూస్‌) సొంతం చేసుకోవటానికి, తర్వాత బైజూస్‌లో ఏఈఎస్‌ఎల్‌ విలీనానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. పోటీ చట్టం 2002లోని సెక్షన్‌ 31(1) ప్రకారం ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేసింది.

    ప్రతిపాదిత ఒప్పందం ద్వారా, ఏఈఎస్‌ఎల్‌ను బైజూస్‌ విలీనం చేసుకుని, బైజూస్‌ పేరిట మాత్రమే కార్యకలాపాలు సాగిస్తుంది. అంటే, ఏఈఎస్‌ఎల్‌పై సంపూర్ణ, ఏకైక నియంత్రణను బైజూస్‌ పొందుతుంది.

    మన దేశంలో ఏర్పాటైన ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ బైజూస్‌. నేరుగా, తన అనుబంధ సంస్థల ద్వారా ఆన్‌లైన్‌ విద్య సేవలను ఇది అందిస్తోంది. ప్రాథమిక, మాధ్యమిక పాఠ్యాంశాలతోపాటు, దేశ, విదేశాల్లోని ఇంజినీరింగ్‌, వైద్య విద్య వంటి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు శిక్షణ సేవలను సాంకేతికత ఆధారిత విద్యావేదిక ద్వారా అందిస్తోంది.

    ఏఈఎస్‌ఎల్‌, మన దేశంలో ఏర్పాటైన పబ్లిక్‌ లిమిటెడ్‌ సంస్థ. ఏఈఎస్‌ఎల్‌, నేరుగా లేదా తన అనుబంధ సంస్థ అయిన ఆకాష్‌ ఎడ్యుటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా లేదా తన శాఖల ద్వారా, ఇంజినీరింగ్‌, మెడికల్‌, ఒలింపియాడ్స్‌, నేషనల్‌ టాలెంట్‌ సెర్ట్‌ ఎగ్జామినేషన్‌ వంటి పరీక్ష సన్నద్ధత సేవలతోపాటు ప్లస్‌2 విద్యార్థులకు పాఠ్యాంశ ఆధారిత శిక్షణను అందిస్తుంది.

    సీసీఐ సవివర ఆదేశం రావలసివుంది.
 

****


(Release ID: 1725463) Visitor Counter : 152


Read this release in: English , Urdu , Hindi , Tamil