జల శక్తి మంత్రిత్వ శాఖ
స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్- 2 వదశ
కోవిడ్ 19 మహమ్మారి లోనూ స్వచ్ఛభారత్ మిషన్ స్థిరమైన ప్రగతి, 1249 గ్రామాలు ఒడిఎఫ్ ప్లస్ గా ప్రకటన
ఎస్‌బిఎం-జి కింద ప్రగతిని సమీక్షించిన జల్ శక్తి శాఖ సహాయమంత్రి శ్రీ రతన్ లాల్ కటారియా
Posted On:
07 JUN 2021 5:14PM by PIB Hyderabad
తాగునీరు, పారిశుధ్య విభాగం కింద గల స్వచ్ఛభారత్ మిషన్ - గ్రామీణ్ (ఎస్‌బిఎం-జి) ప్రగతి గురించి కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి శ్రీ రతన్ లాల్ కటారియా ఈ రోజు సమీక్ష నిర్వహించారు. కోవిడ్ -19 మహమ్మారి విసిరిన తీవ్ర సవాలు సమయంలోనూ ఈ కార్యక్రమం స్థిరమైన ప్రగతి సాధిస్తోంది. క్లిష్ట పరిస్థితులు, కోవిడ్ మహమ్మారి కారణంగా విధించిన కఠిన నిబంధనలలోనూ 2020 మేలో ఈ విభాగం స్కీమ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేసింది. అలాగే మాన్యవల్స్, బ్రోచర్లు, అడ్వయిజరీలను రాష్ట్రస్థాయిలో అమలు , సామర్ధ్యాల మద్దతుకోసం రూపొందించింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఎస్.బి.ఎం ఫేజ్ 2ను 2020 ఫిబ్రవరిలో ప్రారంభించారు. అంటే కొవిడ్ వేవ్ తొలి దశ కు కాస్త ముందు దీనిని ప్రారంభించారు. ఎస్.బి.ఎం ఫేజ్- 1 , అక్టోబర్ 2019లో దేశం బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా ప్రకటనతో ముగిసింది. ఇక రెండవ దశ కింద తొలిదశలో సాధించిన విజయాల కొనసాగింపుపైన అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఘన, ద్రవ, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రధానంగా దృష్టిపెట్టింది.
పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్రాలు రూ 40,750 కోట్ల రూపాయల విలువ గల పనులకు సంబంధించి వార్షిక అమలు ప్రణాళికను రూపొందించేందుకు అధికారులు రాష్ట్రాలను ప్రోత్సహించడం జరిగింది. దీనిని ఎన్.ఎస్.ఎస్.సి- నేషనల్ స్కీమ్ శాంక్షనింగ్ కమిటీ ఆమోదించింది. స్వల్ప వ్యవధిలోనే 1.1 లక్ష గ్రామాలు ఘన , ద్రవరూప వ్యర్థాల నిర్వహణ (ఎస్.డబ్ల్యుఎం, ఎల్‌డబ్ల్యుఎం) పనులు చేపట్టినట్టు నమోదు కావడం ఆశాజనకం. 2.41 లక్షల గ్రామాలు కనీస స్థాయిలో చెత్త, నిల్వ నీరు కలిగి ఉన్నాయి. 1249 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా ప్రకటించుకున్నాయి. 53,066 కమ్యూనిటీ కంపోస్టు పిట్‌లు, 10.4 లక్షల ఇంటిస్తౄయి ఎస్.ఎల్.డబ్ల్యు.ఎం ఆస్తుల నిర్మాణం చేపట్టడం జరిగింది. గ్రామాలు సుమారు 1.60 లక్షల డ్రైనేజ్ పనులు చేపట్టినట్టు నివేదించాయి.
కోవిడ్ మహమ్మారి కారణంగా పెద్ద ఎత్తున పాలనా సిబ్బంది సేవలు దానికి వినియోగించాల్సి వచ్చినప్పటికీ ఎస్.బి.ఎం. -జి కింద పేర్కొన్న లక్ష్యాలను సాధించేందుకు అధికారుల రాష్ట్రప్రభుత్వాలతో సన్నిహితంగా
కలసి కృషి చేస్తున్నందుకు కేంద్ర సహాయమంత్రి శ్రీ రతన్ లాల్ కఠారియా అధికారులను అభినందించారు. క్షేత్రస్థాయిలో స్వచ్ఛతా పరిస్థితులను అంచనా వేయాల్సిన అవసరం ఉందని శ్రీ కటారియా నొక్కి చెప్పారు. ఈ సందర్బంగా ఎదుర్కొనే సవాళ్లను సమన్వయంతో కూడిన ప్రణాళిక, రాష్ట్రప్రభుత్వాలతో ,గ్రామపంచాయతీలతో కలసి ఉమ్మడి కార్యాచరణ ద్వారా ఎదుర్కోవాలన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా ప్రజలలో ఆరోగ్యం ,వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్య విషయాలలో అవగాహన పెరిగిందన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ తదుపరి లక్ష్యాల సాధనకు ఈ అవగాహనను వినియోగించుకోవాలన్నారు.
2021-22 సంవత్సరానికి నిర్ణయించుకున్న లక్ష్యాలలో 51,05,534 ఐహెచ్.హెచ్.ఎల్‌లు, 2,07,945 గ్రామాలలో ఎస్.డబ్ల్యు.ఎం ప్రాజెక్టులు, 1,82,517 గ్రామాలలో గ్రేవాటర్ మేనేజ్‌మెంట్, 2,457 బ్లాక్‌లలో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్లు,386 గోబర్దన్ ప్రాజెక్టుల నిర్మాణం ఉన్నాయి. గోవర్ధన్ యోజన ను 2018లో ప్రారంభించారు. గ్రామస్థాయిలో ఆవు పేడ వ్యర్థాలను పర్యావరణ హితకరంగా, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండే రీతిలో పరిష్కారం సాధించే విధంగ తొలగించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ ఈ ప్రాజెక్టుకు నమూనా పర్యవేక్షక ఏజెన్సీగా ఉంది.ఇది నూతన , పునరుత్పాదక ఇంధన , పెట్రోలియం, సహజవాయు, వ్యవసాయ మంత్రిత్వశాఖ, పశుగణాభివృద్ధి, పాడి, మత్స్య మంత్రిత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తాయి. ఇప్పటివరకు బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి 85 ప్రాంతాలు గుర్తించారు. ఇందులో 34 ప్లాంట్లు పూర్తి చేశారు. ఇలాంటి ప్రాజెక్టుల ప్లానింగ్‌కు చత్తీస్‌ఘఢ్ రాష్ట్రం నాయకత్వం వహించింది. త్వరలోనే పలు విజయగాధలు దేశవ్యాప్తంగా పలు గ్రామపంచాయతీలనుంచి రానున్నాయి.
15 వ ఆర్ధిక సంఘం మంచినీరు, పారిశుధ్యరంగాలకు 2021-25 సంవత్సరాల కాలానికి 1.42 లక్షల కోట్ల రూపాయలు కేటాయిండం గ్రామపంచాయతీల దిశ మార్చేదిగా శ్రీ కటారియా అభివర్ణించారు.
ఇది ఒడిఎఫ్ ప్లస్ స్థాయి అందుకోవడానికి , మొత్తంగా వ్యర్థాల నిర్వహణ పరిస్థితిని ఉన్నతీకరించడానికి కృషిని వేగవంతం చేస్తుందన్నారు. ఈ డిపార్ట మెంట్ త్వరలోనే అన్ని ఎస్.డబ్ల్యుఎం సంబంధిత పనులు, దాని అనుబంధంగా గల సాంకేతిక మద్దతు సమాచారం, మార్గదర్శకాలను పర్యవేక్షించేందుకు ఎం.ఐ.ఎస్ వ్యవస్థను విడుదల చేయనుంది.
***
(Release ID: 1725201)
Visitor Counter : 200