ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రపంచ ఆహార భద్రత దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిజిటల్‌ ప్రసంగం చేసిన డాక్టర్ హర్ష్ వర్ధన్

"ఆహార పదార్థాలు ద్వారా వచ్చే వ్యాధులు పెరగడం ఆందోళనకారం, వీటిపై మాకు సంవత్సరానికి దాదాపు 15 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది"

Posted On: 07 JUN 2021 5:43PM by PIB Hyderabad

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఈ రోజు నిర్వహించిన వర్డ్ ఫుడ్ సేఫ్టీ డే వేడుకలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ హాజరయ్యారు. ఆహారం వ్యవసాయ లేదా వాణిజ్య వస్తువులే కాదు, ప్రజారోగ్య సమస్యకి కూడా ముఖ్యమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకునేందుకు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

 

మనం తీసుకునే ఆహరం భద్రత, పౌష్టికమైనదిగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని, ఈ వ్యవస్థతో భాగస్వామ్యులైన వారంతా దృష్టిలో పెట్టుకోవాలని కేంద్ర మంత్రి అన్నారు. 

“ఆహార భద్రత మొత్తం ఆహార గొలుసుతో పాటు, వ్యవసాయం, ప్రభుత్వం, పరిశ్రమ మరియు వినియోగదారులు అనే మూడు రంగాలతో అనుసంధానమై సమగ్రంగా ఉండాలి. ఆరోగ్య భద్రత పోషకాహార విధానాలు, పోషకాహార విద్యలో ఆహార భద్రత ఒక ముఖ్యమైన అంశంగా ఏర్పడటం కూడా అవసరం. ఆహార పదార్థాల వల్ల వచ్చే సమస్యలు నివారించడానికి, గుర్తించడానికి సహాయపడే చర్యను ప్రేరేపించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము అలా చేయడం ద్వారా మేము ఆహార భద్రత, మానవ ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు, మార్కెట్ యాక్సెస్ మరియు స్థిరమైన అభివృద్ధికి తోడ్పడతాము ” అని కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు. 

“ఆహార గొలుసులు సుదీర్ఘంగా, సంక్లిష్టంగా మరియు ప్రపంచీకరించబడినప్పుడు, వివిధ వ్యాధులకు దారితీసే ఆహార కలుషితం జరుగుతుండడం ఇపుడు పెరుగుతున్న ఆందోళన , మాకు సంవత్సరానికి దాదాపు 15 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. 2030 నాటికి, ఆహార పదార్థాల ద్వారా ఉత్పన్నమయ్యే వ్యాధులు ఏటా 150 నుండి 177 మిలియన్లకు పెరుగుతాయని భావిస్తున్నాం ” అని కేంద్ర మంత్రి తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 తీవ్రమవ్వడంతో, సురక్షితమైన ఆహారం, పోషణ, రోగనిరోధక శక్తి మరియు సుస్థిరతపై దృష్టి పెరిగింది. “నివారణ ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది వ్యాధుల భారాన్ని తగ్గిస్తుంది.  డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయం, పోషకాహార, ఆహార సంబంధిత వ్యాధుల పెరుగుతున్న భారాన్ని పరిష్కరించడంలో సహాయపడుతుంది "

ఆహార భద్రతను మెరుగుపరచడానికి, గట్టి నిబంధనలు, ఆహారాన్ని పరీక్షించడానికి మెరుగైన ప్రయోగశాలలు, క్షేత్ర స్థాయిలో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయడం మరియు ఆహార నిర్వహణదారుల శిక్షణ మరియు సామర్థ్యం పెంపుతో పాటు నిఘా వంటి అనేక రంగాలలో నిరంతర పెట్టుబడులు అవసరం. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన ఆహారాన్ని కల్పించడం ద్వారా దేశ ఆహార పర్యావరణ వ్యవస్థను మార్చడానికి ప్రభుత్వ ప్రధాన ప్రయత్నం ‘ఈట్ రైట్ ఇండియా’ ను జాతీయ ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉంది" అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

“ఈ సంవత్సరం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం ఇతివృత్తం -‘ రేపటి ఆరోగ్యానకి సురక్షితమైన ఆహారం ’. సురక్షితమైన ఆహారం ఉత్పత్తి మరియు వినియోగం ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగి ఉందని స్పష్టం చేస్తుంది” అని ఆయన చెప్పారు.

ఆహార భద్రత బాధ్యతను పంచుకునేందుకు, దానితో సంబంధం ఉన్న సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించడానికి ప్రతిన బూనాలని హాజరైన ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తూ మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

మొత్తం ప్రసంగ పాఠాన్ని ఈ లింక్ లో చూడవచ్చు:  https://youtu.be/P6sKME3H3pg

****(Release ID: 1725199) Visitor Counter : 10