సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ఔషదాల ద్వారా లభించే రోగనిరోధక శక్తి కంటే సహజసిద్ధంగా లభించే రోగనిరోధక శక్తి సమర్ధవంతంగా ఉంటుంది..డాక్టర్ జితేంద్రసింగ్


ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం 2021 లో ముఖ్య అతిథిగా కీలక ఉపన్యాసం చేసిన మంత్రి

Posted On: 07 JUN 2021 5:21PM by PIB Hyderabad

ఔషధాలను తీసుకోవడం వల్ల లభించే రోగనిరోధకశక్తి కంటే సహజ వనరుల ద్వారా లభించే రోగనిరోధకశక్తి బలంగా సమర్ధవంతంగా ఉంటుందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. మధుమేహవ్యాధి రంగంలో గతంలో ప్రొఫెసర్ గా పనిచేసి గుర్తింపు పొందడమే కాకుండా ప్రఖ్యాత ఆర్‌ఎస్‌ఎస్‌డిఐ (రీసెర్చ్ సొసైటీ ఫర్ స్టడీ ఆఫ్ డయాబెటిస్ ఇన్ ఇండియా) జీవితకాల సభ్యునిగా ఉన్న డాక్టర్ జితేంద్రసింగ్ ఈ రోజు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం 2021 సందర్భంగా పిహెచ్‌డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్  ఇండస్ట్రీ “రేపటి ఆరోగ్యానికి నేడు రక్షిత ఆహారం” అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ జితేంద్రసింగ్ కీలక ఉపన్యాసం ఇచ్చారు. సహజసిద్ధంగా లభించే రోగనిరోధకశక్తిపై జరిగిన అనేక అధ్యయనాల ఫలితాలను మంత్రి తన ఉపన్యాసంలో ప్రస్తావించారు. అలోపతి వైద్యంలో రోగనిరోధకశక్తిని పెంచడానికి డాక్టర్లు విటమిన్లతో కూడిన మందులతో సహా అనేక సలహాలను ఇస్తున్నారని అన్నారు. మందుల ద్వారా రోగనిరోధకశక్తిని పెంచడంలో ఎటువంటి తప్పు లేదని అన్న మంత్రి వీటికన్నా సహజసిద్ధంగా లభించే రోగనిరోధకశక్తి మరింత సమర్ధంగా బలంగా పనిచేస్తుందని అన్నారు. 

రోగనిరోధకశక్తిని పెంచడం ద్వారా వ్యాధులను నివారించే వైద్యవిధానాలు భారతదేశ వైద్య ప్రక్రియలో అంతర్లీనంగా ఉన్నాయని డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు. 1940 సమయంలో పెన్సిలిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత మాత్రమే యాంటీబయాటిక్స్ మరియు యాంటీమైక్రోబయాల్స్ వాడకం వైద్యవిధానంలో ప్రారంభమయ్యిందని వివరించారు. భారతదేశం లాంటి దేశాల్లో 20వ శతాబ్దం ప్రారంభంలో క్షయవ్యాధి ప్రబలంగా ఉందని తెలిపిన మంత్రి ఈ వ్యాధిని తగ్గించడానికి 1950 ల ప్రారంభంలో స్ట్రెప్టోమైసిన్ మరియు ఇతర క్షయవ్యాధి మందులు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ మందులు అందుబాటులోకి రాకముందే భారతదేశంలో క్షయవ్యాధికి శానటోరియంలలో చికిత్స అందించిన అంశాన్ని మంత్రి గుర్తు చేశారు. శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచి క్షయవ్యాధిని తగ్గించడానికి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని, గాలివెలుతురు ధారాళంగా లభించే విధంగా ఏర్పాటుచేసిన  శానటోరియంలలో చికిత్స అందించారని ఆయన గుర్తు చేశారు. 

 

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ తో తిరిగి భారతదేశ పురాతన వైద్యవిధానాలకు ప్రాధాన్యత లభించి ప్రతిఒక్కరి దృష్టి వీటిపై మళ్లిందని డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. అంటురోగాలను నివారించే అంశంలో ఆధునిక వైద్యవిధానాల వల్ల ఆశించిన ఫలితాలు ప్రాకపోవడంతో నిపుణులు ప్రజల ఆహార అలవాట్లకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారని మంత్రి అన్నారు. గతంలో ప్రజలు ఎటువంటి ఆహారం తీసుకొనేవారు, వారి ఆహార అలవాట్లు ఎలావుండేవి అన్న అంశాలకు ప్రస్తుతం ప్రాధాన్యత పెరిగిందని మంత్రి అన్నారు. అయితే, గతంలో ప్రజలు ఆహారానికి, ఆహార అలవాట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమని మంత్రి అన్నారు. 

తన 30 సంవత్సరాల వైద్య అనుభవాలను వివరించిన డాక్టర్ జితేంద్రసింగ్ మధుమేహవ్యాధిని నివారించడానికి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోరాదని అనుకోవడం ప్రజల్లో ఉన్న ఒక అపోహ మాత్రమేనని అన్నారు. మనం24 గంటల్లో  తీసుకొనే సమతుల్య  ఆహారంలో కార్బోహైడ్రేట్ల శాతం 60వరకు ఉంటుందని అన్నారు. కార్బోహైడ్రేట్లు శరీరానికి అవసరమైన ఇన్సులిన్ ఉత్పత్తి కావడానికి దోహదపడతాయని మంత్రి తెలిపారు. రోగి ఆరోగ్యస్థితి, బరువు, శారీరక శ్రమ లాంటి అంశాలను  దృష్టిలో ఉంచుకుని డాక్టర్లు ఎటువంటి కార్బోహైడ్రేట్లను తీసుకోవాలన్న అంశాన్ని నిర్ధారిస్తారని అన్నారు. 

కోవిడ్ తరువాత ప్రజల్లో పౌష్ఠిక ఆహరం, తీసుకోవలసిన ఆహారం రోగనిరోధక వ్యవస్థపై ఇవి చూపే ప్రభావంపై అవగాహన పెరిగిందని డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. సురక్షితమైన మంచి ఆహరం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని ఆయన వివరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆహార విషయంలో మంచి సురక్షిత ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వక తప్పదని మంత్రి స్పష్టం చేశారు. 

80 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న భారత దేశంలోని ఈశాన్య ప్రాంతాలు ప్రపంచంలో అత్యంత అరుదైన జీవ వైవిధ్యం కలిగిన ప్రాంతమని డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. ఈ ప్రాంతంలో 80 శతం ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడి సుస్థిర జీవనాన్ని గడుపుతున్నారని మంత్రి అన్నారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని అన్నారు. 

భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ  (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐఐ) 2019-20లో ఆహార భద్రతపై నిర్ధేశించిన ప్రమాణాలను సాధించిన భారతదేశంలోని చిన్నరాష్ట్రాలు అయిన  మణిపూర్ మరియు మేఘాలయలు  మొదటి రెండు స్థానాల్లోనిలిచాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు., భారతదేశంలో  మొట్టమొదటి “సేంద్రీయ” రాష్ట్రంగా  సిక్కిం   జనవరి 2016 లోగుర్తింపు పొందిందని అన్నారు. 

 ఆహార భద్రతతో సహా అన్ని అంశాలపై తమ దేశం దక్షిణ-దక్షిణ సహకారంలో భాగంగా భారతదేశానికి  పూర్తిగా సహకరిస్తోందని అర్జెంటీనా రాయబారి హ్యూగో జేవియర్ గొబ్బి అన్నారు.

 

 ఎన్‌ఇసియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ డార్లాండో ఖాతింగ్, పిహెచ్‌డిసిసిఐ సంజయ్ అగర్వాల్ అధ్యక్షుడు, పిహెచ్‌డిసిసిఐ వినియోగదారుల వ్యవహారాల చైర్మన్ ప్రొఫెసర్ బెజోన్ కుమార్ మిశ్రా కూడా ప్రసంగించారు.

 

***



(Release ID: 1725135) Visitor Counter : 235