నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
12 వేల మెగావాట్ల సీపీఎస్‌యూ రెండో దశ సౌర ప్రాజెక్టు పథకం
బిడ్ సమర్పణ గడువును ఈ నెల 15 వరకు పొడిగించిన ఇరెడా
Posted On:
07 JUN 2021 3:32PM by PIB Hyderabad
'కేంద్ర నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ' (ఎంఎన్‌ఆర్‌ఈ) ఆధ్వర్యంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 'భారతీయ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ' (ఇరెడా), సాధ్యత లోటు నిధులతో (వీజీఎఫ్) 12 వేల మెగావాట్ల గ్రిడ్ అనుసంధాన సౌర ప్రాజెక్టును ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ రంగ పథకం రెండో దశ అమలు కోసం బిడ్ దాఖలు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పెంచింది. తొలుత ఈ గడువు మే 30వ తేదీగా ఉంది. స్వదేశీ, దిగుమతి చేసుకునే సౌర బ్యాటరీలు, మాడ్యూళ్ల మధ్య ధరల తేడాను భర్తీ చేయడానికి వీజీఎఫ్ అందిస్తారు. దీనిని రెండు దఫాలుగా విడుదల చేస్తారు.
సీపీఎస్‌యూలు వారి స్పందనను ఈ నెల 15 లోగా తెలియజేయాలి. అర్హత సాధించిన సంస్థలను వచ్చే నెల 20న ప్రకటిస్తారు. ఈ పథకం అమలు బాధ్యతను కేంద్ర నూతన, పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ ఇరెడాకు అప్పగించింది.
ఈ పథకం కింద, ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తి చేసే విద్యుత్‌ను యూనిట్‌కు రూ.2.45కు ఎక్కువ కాకుండా, పరస్పరం అంగీకరించిన వినియోగ రుసుముల చెల్లింపుపై సొంతంగా వినియోగించుకోచ్చు, లేదా ప్రభుత్వ/ప్రభుత్వ సంస్థలు ఉపయోగించుకోవచ్చు. ప్రత్యక్షంగా లేదా డిస్కమ్‌ల ద్వారా విద్యుత్‌ను వినియోగించుకోవచ్చు. మెగావాట్ విద్యుత్ కోసం గరిష్ఠంగా రూ.55 లక్షలను అనుమతిస్తారు. ప్రాజెక్టు అభివృద్ధి సంస్థను ఎంపిక చేయడానికి, వీజీఎఫ్ మొత్తాన్ని కొలమానంగా ఉపయోగించి, వేలం ప్రక్రియ ద్వారా ప్రభుత్వ సంస్థలకు వాస్తవ వీజీఎఫ్‌ను నిర్ణయిస్తారు.
పీజీఎఫ్ గరిష్ఠ పరిమితిని మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. ఒకవేళ వ్యయాల వ్యత్యాసం తగ్గితే పరిమితిని కూడా తగ్గిస్తుంది.
వచ్చే ఏడాది నాటికి 100 మె.వా. సామర్థ్యమున్న సౌర పీవీని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో భాగంగా, దేశంలో ఎక్కడైనా గ్రిడ్ (చిన్న, సూక్ష్మ గ్రిడ్‌లతో కలిపి) అనుసంధాన సౌర పీవీ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ఈ ఏడాది జనవరి 29న ఇరెడా ప్రతిపాదనలు ఆహ్వానించింది. రెండో దశ (మూడో దఫా) కింద 5 వేల మె.వా. సామర్థ్యం కోసం “బిల్డ్-ఓన్-ఆపరేట్” (బీఓఓ) ప్రాతిపదికన ఈ ప్రాజెక్టు ఉంటుంది.
***
(Release ID: 1725093)
Visitor Counter : 210