విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ప్రపంచ పర్యావరణం దినం రోజున ద్విచక్ర, త్రిచక్ర వాహనాల రంగంలోకి విస్తరించిన సి ఈ ఎస్ ఎల్


● 30వేలకు పైగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాల కోసం గోవా, కేరళతో ఒప్పందం కుదుర్చుకున్న సి ఈ ఎస్ ఎల్

● దేశంలో విద్యుత్ చలనశక్తి పర్యావరణ వ్యవస్థను పెంపొందించుకోవడానికి భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్, ఫోర్టం , జె బి ఎం
రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్, టి వి ఎస్ మోటార్ కంపెనీలతో సి ఈ ఎస్ ఎల్ సంస్థ వ్యూహాత్మక సంబంధాలు ఏర్పరచుకొంది.

● దేశ ప్రజలు భరించగల అందుబాటైన ధరల్లో విద్యుత్ వాహనాలు (ఈవీ) లభ్యమయ్యేలా చేసే చర్య

Posted On: 05 JUN 2021 7:46PM by PIB Hyderabad

 

            దేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచే ఉద్దేశంతో  విద్యుత్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ  కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సి ఈ ఎస్ ఎల్)  పర్యావరణ దినోత్సవం రోజున కీలకమైన భాగస్వామ్యాలు కుదుర్చుకొంది.  
30వేలకు పైగా  ద్విచక్ర, త్రిచక్ర వాహనాల సేకరణ  కోసం గోవా, కేరళతో  సి ఈ ఎస్ ఎల్  ఒప్పందాలు మరియు ఎం ఓ యులు  కుదుర్చుకున్నది.   దేశంలో ద్విచక్ర, త్రిచక్ర సెగ్మెంట్లలో  కొనుగోలుదారులకు అందుబాటైన ధరల్లో వాహనాలను అందించడానికి వీలుగా విశిష్టమైన రీతిలో రూపొందిన తొలి ఎంట్రీ ఇది.    ఈ ఒప్పందాల ప్రకారం  సి ఈ ఎస్ ఎల్ విద్యుత్ వాహనాలు ఛార్జింగ్ కు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు  ఆస్తుల వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది.    వినియోగదారుల సౌలభ్యత మరియు  సుగమత  కోసం ఈ పద్ధతిని రూపొందించడం జరిగింది.  దానితో పాటు అదనంగా భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్,  ఫోర్టం ,   జె బి ఎం రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్,  టి వి ఎస్ మోటార్ కంపెనీలతో  సి ఈ ఎస్ ఎల్ సంస్థ  వ్యూహాత్మక సంబంధాలను ఏర్పరచుకుంది.   ఈ ఒప్పందాల ప్రకారం సి ఈ ఎస్ ఎల్ మరియు ప్రైవేటు కంపెనీలు సంయుక్తంగా  విద్యుత్ వాహనాల పర్యావరణ వ్యవస్థ  విస్తరణ మరియు  స్వీకారం చేస్తాయి.  
               ఇందులో భాగంగా  ప్రజల అవసరాలు తీర్చేందుకు ఛార్జింగ్  కోసం  మౌలిక సదుపాయాలను  ఏర్పాటు చేయడం ,   ఛార్జింగ్ లో  మంచి  సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంభించడం,  డిమాండ్ పెరుగుదలకోసం  ఉత్తమ వ్యాపార అలవాట్లను,  నమూనాలను, సమర్థులైన వినియోగవర్గాల   అన్వేషించడం వంటివి ఉన్నాయి.   రహదారులు,  ఎక్స్ ప్రెస్ వేలలో ఛార్జ్ పాయింట్  
ఆపరేటర్ల  ఏర్పాటు వంటివి  కూడా ఒప్పందాలలో ఉన్నాయి.  ప్రాజెక్టులో భాగంగా  విద్యుత్ వాహానాల సెగ్మెంట్లు అన్నింటిలో తమ వాహనాలను ఎక్కడైనా పార్క్ చేసి  ఛార్జ్  చేసుకునేందుకు గల సాధ్యాసాధ్యాలను కూడా వెతుకుతారు.  
               కాలుష్య రహిత భారత్  సాధించాలంటే విద్యుత్ వాహనాలను జన సమూహం విస్తారంగా వాడటం ముఖ్యమైన చర్య అని,  అందుకే ప్రపంచ పర్యావరణ దీనమైన ఈ మంచిరోజు  అనేక ఒప్పందాలను ప్రకటిస్తున్నట్లు  సి ఈ ఎస్ ఎల్   మేనేజింగ్ డైరెక్టర్ &  సి ఈ ఓ మహువా ఆచార్య తెలిపారు.  
               టి వి ఎస్ మోటార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మను సక్సేనా,   ఫోర్టం ఛార్జ్ అండ్ డ్రైవ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ అవదేశ్ ఝా ,  భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ జి. ఎస్. ఎన్ . మూర్తి  ప్రసంగించారు.  
               కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ  సి ఈ ఎస్ ఎల్. అక్షయ ఇంధనం,  విద్యుత్ చలనశక్తి   మరియు వాతావరణ మార్పుల  కూడలిని  పరిగణనలోకి తీసుకొని  ఇంధన సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంపై  ఈ సంస్థ దృష్టిని కేంద్రీకరిస్తోంది.   సరైన సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతాలలో బ్యాటరీ ఇంధనం నిలువ చేయడం,   వ్యవసాయ పంపుసెట్లకు అక్షయ ఇంధనం లభ్యతకు పరిష్కారాలు,  వీధి దీపాలు,  ఇళ్లలో దీపాలు,  గ్రామీణ ప్రాంతాలలో  వంట సాధనాల వంటి వాటి కోసం సౌర శక్తిని ఉపయోగించడానికి  సి ఈ ఎస్ ఎల్ తగిన  సహకారాన్ని అందిస్తుంది.   బ్యాటరీ ఉపయోగించి విద్యుత్ చలనశక్తిని  పెంపొందిచడంపై ప్రస్తుతం  ఈ సంస్థ కృషి చేస్తోంది.   తద్వారా భారతదేశంలో  విద్యుత్ వాహనాల వాడకం పెంచాలన్నది వారి ఉద్దేశం.  

సి ఈ ఎస్ ఎల్ గురించి:  
సి ఈ ఎస్ ఎల్ ---   కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్  (కన్వర్జెన్స్) 100%  కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ.  సి ఈ ఎస్ ఎల్.   కొత్తగా ఏర్పాటైన ఈ ఇంధన కంపెనీ పరిశుద్ధమైన,  అందుబాటైన  రీతిలో అక్షయ ఇంధనం
అందించడం వీరి  ఉద్దేశం.  అక్షయ ఇంధనం,  విద్యుత్ చలనశక్తి   మరియు వాతావరణ మార్పుల  సమూహాన్ని  పరిగణనలోకి తీసుకొని  ఇంధన సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంపై  ఈ సంస్థ దృష్టిని కేంద్రీకరిస్తోంది.

 

***


(Release ID: 1725028) Visitor Counter : 175


Read this release in: English , Urdu , Hindi , Punjabi