ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
నాడు పోస్టు చేయడమైనది:
06 JUN 2021 9:29AM by PIB Hyderabad
ఇండియాలో గత 24 గంటలలో 1.14 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 60 రోజుల వ్యవధిలో కనిష్ఠ కేసులు నమోదయ్యాయి.
కొత్త కేసుల తగ్గుదల కొనసాగుతోంది. వరుసగా 10 వ రోజు రోజువారి కేసలు 2 లక్షల కంటే తక్కువగా ఉన్నాయి.
భారతదేశపు క్రియాశీల కేసుల సంఖ్య 15 లక్షలకన్నా తగ్గింది. , ఈరోజు ఇవి 14,77,799 గా ఉన్నాయి.
గత 24 గంటలలో క్రియాశీల కేసులు 77,449 తగ్గాయి
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2.69 లక్షల మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గత 24 గంటలలో 1,89,232 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
వరుసగా 24 వ రోజు, రోజు వారి రికవరీలు, రోజువారి కొత్త కేసుల కన్న ఎక్కువ గా ఉన్నాయి.
జాతీయ స్థాయి లో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి రేటు 93.67 శాతానికిపెరిగింది.
వారపు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.54 శాతంగా ఉంది.
రోజువారి పాజిటివిటీ రేటు 5.62 శాతం కొనసాగుతోంది. వరుసగా 13 వరోజు కూడా ఇది 10 శాతం కంటే తక్కువగా ఉంది.
పరీక్షల సమార్ధ్యాన్ని గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 36.4 కోట్ల పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ఇండియా గణనీయంగా 23 కోట్ల వాక్సినేషన్ కవరేజ్ దాటింది. ఇప్పటివరకు 23.13 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.
***
(రిలీజ్ ఐడి: 1724894)
సందర్శకుల సూచీ సంఖ్య : : 195