విద్యుత్తు మంత్రిత్వ శాఖ
విద్యుత్ ప్రసార ప్రాజెక్టుల రెండు ప్రత్యేక ప్రయోజన సంస్థలను పవర్‌గ్రిడ్‌కు అప్పగించిన ఆర్‌ఈసీ అనుబంధ సంస్థ ఆర్‌ఈసీపీడీసీఎల్
Posted On:
05 JUN 2021 12:41PM by PIB Hyderabad
రెండు విద్యుత్ ప్రాజెక్టుల ప్రత్యేక ప్రయోజన సంస్థలు (ఎస్పీవీలు) 'ఫతేఘర్ బద్లా ట్రాన్స్‌కో లిమిటెడ్', 'శికార్ న్యూ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్'ను పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 'ఆర్‌ఈసీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్' (ఆర్‌ఈసీపీడీసీఎల్) అప్పగించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఆర్‌ఈసీ లిమిటెడ్ సంపూర్ణ యాజమాన్యంలోని సంస్థ ఆర్‌ఈసీపీడీసీఎల్. ఆర్‌ఈసీపీడీసీఎల్ సీఈవో, సంయుక్త సీఈవో, పవర్‌గ్రిడ్ అధికారుల సమక్షంలో ఎస్పీవీల అప్పగింత జరిగింది.
ప్రసారాల అభివృద్ధిదారుల ఎంపిక కోసం 'సుంకం ఆధారిత పోటీ వేలం' (టీబీసీబీ) ద్వారా, కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించిన 'ప్రామాణిక వేలం పత్రాలు, మార్గదర్శకాలకు' అనుగుణంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను ఎంపిక చేశారు.
ఆర్‌ఈసీ లిమిటెడ్ గురించి: ఆర్‌ఈసీ నవరత్న హోదా సంస్థ. దేశవ్యాప్తంగా విద్యుత్ రంగానికి ఆర్థిక సాయం, అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. 1969లో ఈ సంస్థను స్థాపించారు. సేవల్లో 50 ఏళ్ల ఘనతను పూర్తి చేసుకుంది. రాష్ట్ర విద్యుత్ బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర/రాష్ట్ర విద్యుత్ వినియోగ సంస్థలు, స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, గ్రామీణ విద్యుత్ సహకార సంస్థలు, ప్రైవేట్ రంగ వినియోగ సంస్థలకు ఆర్థిక సాయాన్ని ఆర్‌ఈసీ అందిస్తుంది. విద్యుత్ రంగ విలువ గొలుసు ప్రాజెక్టులకు; ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు సహా వివిధ రకాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయాన్ని ఆర్‌ఈసీ అందిస్తుంది.
***
(Release ID: 1724682)
Visitor Counter : 142