సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

రేపు లోక్ నాయక్ భవన్‌ లో డి.పి.పి.డబ్ల్యు. నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరంలో, టీకాలు వేయించుకోవాలని, 18 ఏళ్లు పైబడిన ప్రతి అధికారినీ కోరిన - డాక్టర్ జితేంద్ర సింగ్


మహమ్మారి 2వ దశలో, సి.పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. కోవిడ్-19 పోర్టల్ ద్వారా స్వీకరించిన 28,005 ఫిర్యాదులలో 19,694 ఫిర్యాదులను పరిష్కరించిన - డి.ఏ.ఆర్.పి.జి.

Posted On: 04 JUN 2021 5:55PM by PIB Hyderabad

ప్రభుత్వ అధికారులు మరియు వారి కుటుంబ సభ్యులతో పాటు పింఛనుదారుల కోసం, ప్రత్యేకంగా టీకాలు వేసే శిబిరాన్ని, రేపు ఇక్కడ లోక్ నాయక్ భవన్‌లో నిర్వహించనున్నారు. 

కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి, డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ విషయాన్ని, ప్రకటించారు.  పింఛనుదారులు, పింఛనుదారుల సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక శిబిరంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి అధికారితో పాటు, అర్హత గల వారి కుటుంబ సభ్యులు అందరూ, టీకాలు వేయించుకోవాలని , ఆయన కోరారు.  రాబోయే వారాల్లో ఇలాంటి మరిన్ని శిబిరాలు నిర్వహిస్తామని కూడా,  ఆయన సూచన ప్రాయంగా తెలియజేశారు. 

కోవిడ్ -19 మహమ్మారి రెండవ దశలో స్వీకరించిన ఫిర్యాదుల పరిష్కార పురోగతిని డాక్టర్ జితేంద్ర సింగ్ సమీక్షించారు. ఫిర్యాదుల పరిష్కార నాణ్యతపై ఆయన ఈ సందర్భంగా, సంతృప్తి వ్యక్తం చేశారు.

కోవిడ్ రెండవ దశ, మొదటి దశ కంటే ఎక్కువ ఉధృతంగా ఉన్నప్పటికీ,  ఫిర్యాదులకు సత్వర పరిష్కారాలను అందించడం ద్వారా ఈ సవాలును సమర్ధంగా ఎదుర్కోవటానికి డి.ఏ.ఆర్.పి.జి. కృషి చేసిందని, డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.  మొదటి దశలో ఫిర్యాదుల పరిష్కారం కోసం చేపట్టిన, కోవిడ్-19 డాష్‌ బోర్డు, ప్రతిస్పందన కోసం కాల్ సెంటర్ల ఏర్పాటుతో పాటు, సి.పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. తో రాష్ట్రాల పోర్టర్ల ను ఏకీకృతం చేయడం వంటి అనేక కార్యక్రమాలు కోవిడ్ రెండవ దశ సవాళ్లను ఎదుర్కోడానికి సహాయపడుతున్నాయని, ఆయన చెప్పారు. 

దీనితో పాటు, సకాలంలో ఫిర్యాదులను పరిష్కరించడం కోసం, డి.ఏ.ఆర్.పి.జి., రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు / విభాగాల తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తోంది.   మహమ్మారి 2వ దశలో, సి.పి.జి.ఆర్.ఏ.ఎం.ఎస్. కోవిడ్-19 పోర్టల్ ద్వారా డి.ఏ.ఆర్.పి.జి. 28,005 ఫిర్యాదులను స్వీకరించింది.   అందులో 19,694 ఫిర్యాదులను పరిష్కరించింది.   సి.పి.జి.ఆర్.ఎమ్.ఎస్. క్రింద అప్పీల్ చేసుకునే విధానాన్ని కూడా  డి.ఎ.ఆర్.పి.జి. అమలు చేస్తోంది. ఇక్కడ బాధిత పౌరులు, భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శి లేదా సంయుక్త  కార్యదర్శి హోదాలో ఉన్న నోడల్ అప్పీలేట్ అథారిటీకి అప్పీల్ దాఖలు చేయవచ్చు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రెండేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా, ప్రభుత్వ అధికారులు దేశ సేవకు పునరంకితం కావాలని, డాక్టర్ జితేంద్ర సింగ్ కోరారు.

మహమ్మారి రెండవ దశ సమయంలో, అంతరాయం లేకుండా కార్యక్రమాలు కొనసాగించడంలో ప్రభుత్వ అధికారుల అంకితభావాన్ని కూడా, గౌరవ మంత్రి అభినందించారు.

 

 

<><><>


(Release ID: 1724539) Visitor Counter : 139